365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,14 మార్చి, 2023, ప్రముఖ వెండి ఆభరణాల సంస్థ “ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ”, భారతదేశంలోని అతిపెద్ద బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటుచేసిన ఈ నూతన స్టోర్ ను ప్రముఖ నటి రీతు వర్మ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.
ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేక వెండి ఆభరణాల కలెక్షన్ అందిస్తుంది. సరికొత్త డిజైన్లతో చిన్నారుల నుంచి పెద్దవారిదాకా అందరికీ అవసరమైన, వారి అభిరుచికి తగిన విధంగా లేటెస్ట్ మోడల్ జ్యువెలరీ కలెక్షన్ ను రూపొందిస్తోంది.
ఈ సందర్భంగా రమేష్ ఇమ్మడి తన కుటుంబంతో కలిసి మాట్లాడుతూ “ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ భారతదేశంలోనే అతిపెద్ద బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉంది. ఈ షోరూమ్ “బ్రైడల్ సిల్వర్ జువెలరీ”ని అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇప్పుడు ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ మూడు ప్రత్యేక షోరూమ్‌లను కలిగి ఉందని, ఇందులో “బ్రైడల్ సిల్వర్ జువెలరీ”, “వెడ్డింగ్ సిల్వర్ జువెలరీ”, “గ్లిట్టరీ రథ సిల్వర్ జ్యూయలరీ”, “లైట్ వెయిట్ సిల్వర్ ఆభరణాలు” ఉన్నాయని, “డెయిలీ వేర్ తోపాటు పలురకాల కలెక్షన్ ను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.