365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,నవంబర్ 29,2022: రేపటితో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మపదవీ విరమణ చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ బంపర్ ఇచ్చారు.
సీఎస్ గా పదవీ విరమణ చేసిన మరుక్షణమే సమీర్ శర్మ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత సమీర్ శర్మను ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీ హోదాలో సమీర్ శర్మ… సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులు కానున్నారు. ఈ మేరకు సీఎంఓలో సమీర్ శర్మ కోసం ఓ ప్రత్యేక పోస్టును రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది.
ఇదిలా ఉంటే.. రేపు పదవీ విరమణ చేయనున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కు కూడా సీఎం జగన్ బంపర్ ఆపర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన విజయ్ కుమార్.. జిల్లాల పునర్విభజనను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో రేపు పదవీ విరమణ చేయనున్న విజయ్ కుమార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది.
స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా విజయ్ కుమార్ ను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీసియో సెక్రటరీ హోదాలో విజయ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్
పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం
త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం..
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి