365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్,నవంబర్ 28,2022: వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు– వరుసగా మూడో ఏడాది. రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీరాయితీ సొమ్ముతో పాటు గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్.జగన్.
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్ వైస్‌చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ సలహాదారు ఐ తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్టికల్చర్, సెరికల్చర్ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్, వ్యవసాయశాఖ కమిషనర్ సి హరికిరణ్, రెవెన్యూశాఖ (డిజాస్టర్ మేనేజిమెంట్) ఎక్స్ అఫిషియో డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరు.