Tue. Dec 31st, 2024
Krittika-Dipotsavam

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 7 డిసెంబర్ 2022: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని వార్షిక కార్తీక దీపోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది.

సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో దీపోత్సవం జరిగిన తరవాత శ్రీ కపిలేశ్వర ఆలయ ప్రధాన గోపురం, శ్రీకామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజ స్తంభం వద్ద సంప్రదాయబద్ధంగా నెయ్యితో వెలిగించిన దీపాలతో అలంకరించారు.

ఈ దీపోత్సవం వెలుగులలో ఊంజల్ మండపంలో దీపాలతో అలంకరించిన శివలింగం, త్రిశూలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఆ త‌రువాత‌ జ్వోలాతోర ణం వెలిగించారు.

ఆలయ డీఈవో దేవేంద్రబాబు, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్, భూపతి, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!