365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,నవంబర్ 28,2022: భారతదేశంలోని పురాతన బాటిల్ మినరల్ వాటర్ కంపెనీలలో ఒకటైన బిస్లరీకి త్వరలో కొత్త యజమాని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంస్థ ను బిస్లరీ యజమాని కుమార్తె జయంతి చౌహాన్ నిర్వహించనని చెప్పింది.
జయంతి చౌహాన్ 24 సంవత్సరాల వయస్సులో ఆమె తండ్రి బిస్లరీ ఇంటర్నేషనల్ యజమాని రమేష్ చౌహాన్ మార్గదర్శకత్వంలో ఆమె బిస్లరీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఆ కంపెనీ బాధ్యతలు నిర్వహించనని చెప్పింది. దీంతో బిస్లరీ సంస్థ ఛైర్మన్ రమేష్ చౌహాన్ రూ. 7,000 కోట్ల వ్యాపార సంస్థను విక్రయించనున్నట్లు ప్రకటించారు.
నవంబర్ 24వ తేదీన ప్రముఖ పారిశ్రామికవేత్త తన ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ బిస్లెరి ఇంటర్నేషనల్ కోసం కొనుగోలుదారు కోసం వెతుకుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే కంపెనీని అమ్మడానికి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో సహా అనేక కంపెనీతో చర్చలు జరుపుతున్నారు.
బిస్లరీ అమ్మకానికి గల కారణాల గురించి అడిగినప్పుడు, 82 ఏళ్ల వ్యాపార నాయకుడు తన కుమార్తె జయంతి దాని బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపనందువల్ల ఎవరైనా దానిని నిర్వహించవలసి ఉందని చెప్పారు.
రమేష్ చౌహాన్ మరిన్ని వివరాలను వెల్లడించలేదు, ప్రస్తుతం బిస్లరీ వైస్ చైర్‌పర్సన్ గా ఉన్న జయంతి చౌహాన్ లేదా JRC గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
జయంతి చౌహాన్ తన బాల్యంలో ఎక్కువ భాగం ఢిల్లీ, బొంబాయి ఆ తర్వాత న్యూయార్క్ నగరంలో గడిపారు. ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ (FIDM)లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇస్టిటుటో మారంగోని మిలానోలో ఫ్యాషన్ స్టైలింగ్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివారు.24 సంవత్సరాల వయస్సులో ఆమె తండ్రి మార్గదర్శకత్వంలో ఆమె బిస్లరీ ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఆమె ఢిల్లీ లోని బిస్లరీ బ్రాంచ్ కు సంబంధించిన బాధ్యతలు స్వీకరించారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించడం, వివిధ ప్రక్రియల ఆటోమేషన్ తీసుకురావడం వంటి మార్పులు చేశారు.
జయంతి చౌహాన్ హెచ్‌ఆర్, సేల్స్, మార్కెటింగ్ వంటి విభాగాల్లో బలమైన బృందాలను నియమించారు. బిస్లెరి వెబ్‌సైట్ ప్రకారం, విస్తృతమైన గ్లోబల్ ఎక్స్‌పోజర్, క్రాస్-కేటగిరీ అనుభవంతో, జయంతి చౌహాన్ 2011లో ముంబై ఆఫీసు బాధ్యతలు చేపట్టారు.
జయంతి చౌహాన్ కొత్త ఉత్పత్తి అభివృద్ధిపై పని చేస్తున్నారు. బిస్లరీ మినరల్ వాటర్, హిమాలయాల నుంచి వెదికా నేచురల్ మినరల్ వాటర్ (లగ్జరీ సెగ్మెంట్), ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్ , బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో ఆమె కీలక బాధ్యతలు నిర్వహించారు.
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన మినరల్ వాటర్ బ్రాండ్..దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో 122ప్లాంట్లు, 4500 డిస్ట్రిబ్యూటర్లు 5000 పంపిణీ నెట్‌వర్క్‌తో బలమైన ఉనికిని కలిగి ఉన్న బిస్లరీ వినియోగదారులకు గత 50 సంవత్సరాలుగా సురక్షితమైన, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మినరల్ వాటర్‌ను అందజేస్తోంది.