365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,ఆగస్టు 23,2021:భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్‌లలో ఒకటైన శాంసంగ్, నేడు వినూత్నమైన కన్స్యూమర్ లాయల్టీ కార్యక్రమాన్ని ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని ప్రారంభించింది. ‘శాంసంగ్ హోమ్’గా ఈ లాయల్టీ కార్యక్రమాన్ని పిలుస్తున్నారు. ఈ వినూత్నమైన కన్స్యూమర్ లాయల్టీ కార్యక్రమాన్ని ప్రస్తుత శాంసంగ్ వినియోగదారులకు ప్రోత్సాహకాలను అందించే రీతిలోతీర్చిదిద్దారు.దీని ద్వారా అందుబాటు ధరలోని ప్రయోజనాలను అందించనున్నారు. తద్వారా శాంసంగ్ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ఉత్పతత్తులపై వినియోగదారుల ప్రేమ, వారు చూపే ఆదరణను గుర్తించనున్నారు. ఈకార్యక్రమం, వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలను వినియోగదారులు చేసే రెండవ కొనుగోలుపైఅందిస్తుంది. వీటిలో భాగంగా శాంసంగ్ తాజా టెలివిజన్‌లు,వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు లేదా మైక్రోవేవ్‌లపై ఏదైనా ఒకదానిని సెప్టెంబర్ 30,2021 లోపు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
శాంసంగ్ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌పై జూలై 28,2021 వ తేదీ,ఆ తరువాత కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ ఆఫర్ పొందడానికి అర్హులు.ఈ కార్యక్రమం కింద, వినియోగదారులు తమ మొదటి ఈఎంఐలో కేవలం 50% మాత్రమే చెల్లించవచ్చు (2500 రూపాయల వరకూ పరిమితం). ఈ ప్రయోజనం తదనంతర కొనుగోళ్లపై కూడా వర్తిస్తుంది.ఉదాహరణకు, ఒకవేళ వినియోగదారులు శాంసంగ్ టెలివిజన్‌ను ఫ్లిప్‌కార్ట్‌పై జూలై 28,2021న కొనుగోలు చేస్తే, ఈ ఆఫర్‌తో వాషింగ్‌మెషీన్, రిఫ్రిజిరేటర్ లేదా మైక్రోవేవ్‌లలో ఏదైనా సరే సెప్టెంబర్ 30,2021 లోపు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
‘‘శాంసంగ్ వద్ద, మేము ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి శాంసంగ్ హోమ్ శీర్షికన వినూత్నమైన కార్యక్రమం వెల్లడిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని శాంసంగ్ లాయల్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే రీతిలో తీర్చిదిద్దాము. ఈ వినియోగదారులు తమ రెండవ శాంసంగ్ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తిని కొనుగోలు చేయడం ద్వారా తమ లివింగ్ స్పేస్‌ను అత్యాధునిక సాంకేతికతో అప్‌గ్రేడ్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం మా విస్తృత శ్రేణి కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తులపై మాత్రమే అందుబాటులో ఉంటుంది.మారుతున్నవినియోగదారుల అవసరాలను మేము ఖచ్చితంగా తీర్చగలమని హామీ ఇస్తున్నాము. మరీ ముఖ్యంగా అధిక సమయం వారు ఇంటిలో గడుపుతున్న వేళ ఈ హామీని విస్తరిస్తున్నాం’’ అని సందీప్ సింగ్ అరోరా, సీనియర్ డైరెక్టర్, ఆన్‌లైన్ బిజినెస్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్, శాంసంగ్ ఇండియా అన్నారు.
శాంసంగ్ హోమ్ లాయల్టీ కార్యక్రమ పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలు :
.మొట్టమొదటి శాంసంగ్ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ కొనుగోలును ఖచ్చితంగా సెప్టెంబర్ 15,2021 కన్నా
ముందుగా ఫ్లిప్‌కార్ట్‌పై చేయాలి
.మొదటి కొనుగోలు తరువాత శాంసంగ్ హోమ్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
.వినియోగదారులు తమ రెండవ శాంసంగ్ ఉత్పత్తి కొనుగోలును తాజా టెలివిజన్‌లు, వాషింగ్ మెషీన్లు,
రిఫ్రిజిరేటర్లు లేదా మైక్రోవేవ్ ఓవెన్లులో ఏదో ఒకదానిని సెప్టెంబర్ 30,2021 లోపుగా కొనుగోలు చేయాలి
.ఈ ప్రయోజనం అందుకోవడానికి మొదటి కొనుగోలు , రెండవ కొనుగోలుకు నడుమ ఖచ్చితంగా 15
రోజుల దూరం ఉండాలి
.వినియోగదారులు తమ తదుపరి కొనుగోళ్లపై 50% వరకూ రాయితీని మొదటి వాయిదా (2500 రూపాయల
వరకూ)పై పొందవచ్చు మరిన్ని వివరాల కోసం దయచేసి చూడండి : https://www.flipkart.com/samsung-home-offer-2021-store