Sun. Oct 6th, 2024
This International Day of Yoga, include Almonds in your diet plan!

365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, జూన్ 19, 2020,హైదరాబాద్: ఆరోగ్యం , సంక్షేమం పట్ల సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా, జూన్ 21వ తేదీన రోజంతా జరిపే వేడుకలోభారీస్థాయి.యోగాప్రదర్శనలను సైతం జరుపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఒకే చోటకు రావడంతో పాటుగా పలు ఆసనాలనూ ప్రాక్టీస్ చేస్తుంటారు.సంపూర్ణ ఆరోగ్య నేపథ్యాన్ని యోగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, ప్రశాంతమైన మనస్సు, ధృడమైన శరీరం దీనిలో భాగంగా ఉంటాయి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన, యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉన్న ఓ మార్గం చూడవచ్చు. కానీ దీనితో పాటుగా అత్యంత కీలకమైన అంశం- ఆరోగ్యవంతమైన మరియు పౌష్టికాహార డైట్‌ను సైతం భాగం చేసుకోవాలి.
కొద్ది పరిమాణంలోనే అయినా ప్రభావవంతమైన మార్పులను డైట్‌లో చేసుకోవడం ద్వారా మొత్తంమ్మీద ఆరోగ్యం నిర్మించుకోవడంలో సుదూరం వెళ్లవచ్చు మరియు మీ యోగా సాధనకూ సహాయం చేయవచ్చు. మీ డైట్‌లోఓగుప్పెడుబాదంజోడించడం.ప్రారంభించేందుకు చక్కటి మార్గం. ఇవి పౌష్టికాహార స్నాకింగ్ అవకాశాన్ని అందిస్తాయి. తరచుగా వీటిని తీసుకోవడం వల్ల మొత్తంమ్మీద ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం కలుగుతుంది. దీనితో పాటుగా, బాదములలో విటమిన్ బీ12, మెగ్నీషియం ఫాస్పరస్ తదితర పోషకాలూ ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఇవి సహాయపడతాయి.ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాల్సిన ఆవశ్యకతను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ “అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాయామ మార్గం యోగా. ఇది శరీరం మీద మాత్రమే గాక మనస్సు మీద కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. మా యోగా సాధనను కాంప్లిమెంట్ చేస్తూ నేను సైతం ఆరోగ్యవంతమైన డైట్‌ను అనుసరిస్తున్నాను .

This International Day of Yoga, include Almonds in your diet plan!
This International Day of Yoga, include Almonds in your diet plan!

ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదం తీసుకోవడమూ చేస్తుంటాను. బాదములను సాత్విక్ ఆహారంగా భావిస్తుంటారు. వీటిలో అత్యంత కీలకమైన పోషకాలు అయినటువంటి ప్రొటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం మొదలైనవి ఉన్నాయి. అదనంగా, బాదములు శక్తిని సైతం అందిస్తాయి. ఆయుర్వేద చెప్పేదాని ప్రకారం శరీర కణజాల టోనింగ్‌కు ఇవి సహాయపడతాయి” అని అన్నారు.యోగా ప్రయాణ ఆరంభానికి ముందు సరైన ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ “భారతదేశంలో, ఇప్పుడు సనాతన సంప్రదాయాలను అనుసరించాలనే ఆసక్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా వ్యాయామాలు లేదా ఆహార తయారీ పరంగా ! వీటి ద్వారానే జీవనశైలి వ్యాధులను అడ్డుకోవచ్చని వారు భావిస్తున్నారు. యోగాను సాధన చేయడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. పోషకాలు అధికంగా కలిగినటువంటి బాదములను డైట్‌లో జోడించడం ద్వారా దానిని ఆరంభించవచ్చు. బరువు నియంత్రించడంలో బాదములు సహాయపడతాయి , అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం ప్రతి రోజూ 42 గ్రాముల బాదములను తీసుకుంటే, నడుం దగ్గర కొవ్వు తగ్గడంతో పాటుగా నడుం చుట్టుకొలత కూడా తగ్గుతుంది” అని అన్నారు.ఫిట్‌నెస్‌తో ఆరోగ్యవంతమైన డైట్‌ను మిళితం చేయాల్సిన ఆవశ్యకతను ఫిట్‌నెస్ ప్రియుడు , సూపర్‌మోడల్ మిలింద్ సోమన్ వెల్లడిస్తూ “యోగా శక్తిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కానీ, సరైన రీతిలో దానిని సాధన చేస్తూనే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు చేసిన వ్యాయామాల యొక్క అత్యుత్తమ ప్రయోజనాలు పొందగలం. ఫ్రైడ్ స్నాక్స్ లేదంటే అనారోగ్యవంతమైన ఆహారానికి బదులుగా ఆరోగ్యవంతమైన ఆహారం అయినటువంటి బాదములు తీసుకోవడానికి నేను ప్రాధాన్యతనిస్తుంటాను. బాదములు తేలికైనవి, సులభంగా తీసుకువెళ్లదగినవి. భోజనాల నడుమ తినడానికి అత్యుత్తమ స్నాక్‌గా వీటని మలుచుకోవచ్చు” అనిఅన్నారు.ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన, ఆరోగ్యవంతమైన డైట్‌తో పాటుగా మరిన్ని యోగా సెషన్‌లలో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రతిజ్ఞ చేద్దాం ! 

error: Content is protected !!