365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 5, హైదరాబాద్: స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. కాగా ఇక ఈ చిత్రం ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా మొత్తం మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే నడుస్తోంది. అయితే మర్డర్ చేసేది అనుష్కనేనట. ఈ విషయం క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రివీల్ అవుతుంది. పైగా సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉందట. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ ప్రేక్షుకులను బాగా ఆకట్టుకుంది.
అన్నట్టు ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించబోతుంది. ఇక మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. అలాగే ఇద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. అలాగే అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. కాగా ఈ సినిమాలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టి అనుష్క.. ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ అందుకుంటుందేమో. ప్రముఖ రచయిత కోన వెంకట్ తన బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.