365తెలుగుడాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, జనవరి 1,హైదరాబాద్: మాధాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్
మేళా ఆకట్టుకుంటుంది. బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి శిల్పారామంలో ఏర్పాటు చేసిన పలు వినోద కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన సందర్శకులను అలరించింది.