365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్, జనవరి5,గురుగ్రామ్: భారతదేశం అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన సామ్ సంగ్ తన ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్ 10+, ఎస్ 10 మరియు ఎస్ 10ఇ లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ప్రక టనతో వినియోగదారులు ఇప్పుడు ఈ మూడు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై తక్షణ క్యాష్ బ్యాక్ పొంద గలుగుతారు. ఈ ఆఫర్లు 2020 జనవరి 4 నుంచి జనవరి 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.512 జీబీ,128 జీబీ వేరియంట్లకు చెందిన గెలాక్సీ ఎస్ 10లపై వరుసగా రూ.20,000,రూ.12,000 ల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదేవిధంగా పెద్ద డిస్ ప్లే కోరుకునే వినియోగదారులు గెలాక్సీ ఎస్ 10+ కు చెందిన 512 జీబీ , 128 జీబీ లపై రూ.12,000 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. కాంపాక్ట్ గా ఉన్నప్పటికీ శక్తితో కూడిన స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికి గెలాక్సీ ఎస్ 10 ఇ ఎంతో అనువుగా ఉంటుంది. దీనిపై రూ.8,000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కోరుకునే వారి కోసం గెలాక్సీ ఎస్ 10 సిరీస్ రూపొందించబడింది. ఇది తిరుగులేని , ఇంటెలిజెంట్ అనుభూతిని అందిస్తుంది. డిస్ ప్లే, కెమెరా, సెక్యూరిటీ లలో సంచలనాత్మక వినూత్నతలతో, విలక్షణ జీవనశైలి అవసరాలకు తగిన రీతిలో పనితీరుతో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కావాల్సిన సాధికారికతను అందిస్తుంది. డిజైన్, పనితీరు, కెమెరా లకు సంబంధించి తిరుగులేని వినూత్న తకు ఇది ప్రాతినిథ్యం వహిస్తుంది.ఈ ఆఫర్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ చానల్స్ లో, ప్రపంచపు అతిపెద్ద మొబైట్ ఎక్స్ పీరియెన్స్ సెంటర్ – సామ్ సంగ్ ఒపెరా హౌజ్ (బెంగళూరు) దేశవ్యాప్తంగా సామ్ సంగ్ అవుట్ లెట్స్ లోలభ్యం.