Sat. May 25th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, మార్చి2, 2020: ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్), దేశమతటా 200 కు పైగా కేంద్రాలతో చాక్టర్లు , ఐఐటియన్లు కావాలని ఆశించే విద్యార్థులకు టెస్ట్ ప్రిపరేటరీ సేవల అందజేసే విద్యా సంస్థ, ఇది క్లాస్ X – క్లాస్ XII  విద్యార్థులకు నేషనల్ ఎలిజిబిలిటీ , స్కాలర్షిప్ టెస్ట్ (ఎన్.ఇ.ఎస్.టి.) పేరుతో తమ వార్షిక స్కాలర్షిప్ పరీక్షల రెండవ ఎడిషన్ ప్రకటించింది.

అకాష్ నెస్ట్  అనేది క్లాస్ X నుండి క్లాస్ XII కు క్లాస్ XI నుండి క్లాస్ XII కు వెళ్లే విద్యార్థులు ,క్లాస్ XII  కు హాజరైన లేదా పాసైన (చదువుతున్న లేదా ఆపైన) విద్యార్థుల కొరకు, దేశమంతటా 24 రాష్ట్రాలు ,డేశంలోని యూనియన్ టెర్రిటరీలలో ఏప్రిల్ 5, 2020 తేదీన ఈ పరీక్ష జరగబోతున్నది.

నెస్ట్ విద్యార్థులకు జాతీయ స్ఠాయిలో పరకీక్ష పూర్తి చేసి, 90% వరకు ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ గెలుచుకునే సదవకాశం అందిస్తున్నది. క్లాస్ X నుండి క్లాస్ XII వరకు విద్యార్థులు (చదువుతున్న మరియు పాసయిన విద్యార్థులు ఇద్దరు కూడా) ఈ పరీక్షలో పాల్గొనవచ్చు. ఆకాష్ నెస్ట్ ద్వారా విద్యార్థులకు శక్తి లభించి, దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒ.ఇ.ఎస్.ఎల్ కోచింగ్ పొందుటకు వారికి సహకారం లభిస్తుంది.

స్కాలర్షిప్ వివరాలు

  • ఆకాష్ నెస్ట్ ఏప్రిల్ 5, 2020 తేదీన, దేశమంతటా 24 రాష్ట్రాలు/యూనియన్ టెర్రిటరీలలో జరుగుతుంది.
  • ఈ పరీక్ష ఒక గంట సమయం ఉండి, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు జరపబడుతుంది.
  • రిజిస్ట్రేషన్ మరియు సరిగ్గా నింపబడిన దరఖాస్తు పత్రను అందుటకు చివరి తేదీ ఏప్రిల్ 3, 2020. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200.
  • స్టూడెంట్స్ ని ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ మరియు మేథమెటిక్స్ లో పరీక్షించుట జరుగుతుంది.

ఆకాష్ చౌదరి, డైరెక్టర్ , సి.ఇ.ఒ, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఇలా అన్నారు, విజయం సాధించుటకు మీ లక్ష్యం దిశలో మీరు ఒక అడుగు ముందుకు వెళ్లాలి. ఆకాష్ నెస్ట్ రెండవ ఎడిషన్ ప్రవేశపెడుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది, దీని ద్వారా విద్యార్థులు జాతీయ స్థాయిలో పరీక్ష పూర్తి చేసి, 90% వరకు స్కాలర్షిప్ గెలుచుకునే అవకాశం పొందుతారని నేను నమ్ముతున్నాను. ఇంతకు ముందు సంవత్సరం వలెనే, ఈ గౌరనప్రదమైన ప్రతిభ అన్వేషణ పరీక్ష పూర్తి చేసి, తమ కెరీర్ లక్ష్యాలలో గొప్ప లాభాల సదవకాశం పొందుతారని ఆశిస్తున్నాను.”అస్సామ్, ఆంధ్ర ప్రదేశ్, బిహార్, చత్తీగఢ్, డిల్లీ, గోవా, గురాత్, హర్యాణా, జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర. ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళ నాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ లోని అన్ని ప్రముఖ నగరాలలో ఈ పరీక్ష జరప బడుతుంది.

 అకడమిక్ విజయాన్ని సాధించాలని అపేక్షిస్తూ, శ్రమించే విద్యార్థుకు ఆకాష్ ఇనిస్టిట్యూట్ ప్రమాణాల కంటెంట్, కోచింగ్ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ టీచింగ్ మెథడాలజీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, సమగ్ర స్టడీ మెటీరియల్, వైవిధ్యమై కోర్స్ ఆఫరింగ్స్, డెలివరీ ఛానల్స్, మాడర్న్ ఇన్ప్రాస్ట్రక్చర్ , డిసిప్లిన్డ్ , ఫోకస్డ్ లెర్నింగ్ వాతావరణంతో అన్నివిధాలా సహాయం అందజేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. దీనికి కరిక్యులమ్, కంటెంట్ డెవలప్మెంట్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, మానిటరింగ్ విషయంలో ఇన్-హౌస్ ప్రాసెస్ కలిగి ఉండి, తమ నేషనల్ అకడమిక్ టీమ్ ద్వారా ఇది నిర్వహించబడుతున్నది. అనేక సంవత్సరాలుగా, అనేక  మెడికల్ , ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు , ఎన్.టి.ఎస్.ఇ (NTSE),  కె.వి.పి.వై (KVPY),,ఒలింపియాడ్స్ (Olympiads) వంటి కాంపిటీటివ్ పరీక్షలలో ఎ.ఇ.ఎస్.ఎల్ (AESL) విద్యార్థులు నిరూపితమైన సెలక్షన్ ట్రాక్ రికార్డు సాధించుట జరిగింది.