365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 11, హైదరాబాద్: కోట కేంద్రంగా కలిగినటువంటి సుప్రసిద్ధ మెడికల్, ఐఐటీ ప్రవేశ పరీక్షల కోచింగ్ ఇనిస్టిట్యూట్ కెరీర్ పాయింట్, ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) , జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) అభ్యర్థులకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కోటకు చెందిన అత్యుత్తమ ఫ్యాకల్టీ నుంచి శిక్షణను లైవ్‌లో నీట్ , జెఈఈ అభ్యర్థులకు కెరీర్ పాయింట్ అందించనుంది. దేశంలో ఏ ప్రాంత వాసులైనా తమ ఇంటి నుంచి సౌకర్యవంతంగా శిక్షణ పొందే అవకాశం ఇది కల్పిస్తుంది. దీనిలోని ఇంటరాక్టివ్ లైవ్ చాటింగ్ ఫీచర్ కారణంగా విద్యార్థులు నేరుగా ప్రొఫెసర్‌తో సంభాషించడంతో పాటుగా తమ సందేహాలను తక్షణమే తీర్చుకోవచ్చు. వీటితో పాటుగా వేలాది వీడియో లెక్చర్స్, మాక్ టెస్ట్‌లు, రిజల్ట్ ఎనాలిసిస్ వంటివి ఒకే ప్యాకేజీలో అందిస్తారు. ఈ ఆన్‌లైన్ కోర్సులలో ప్రతి రోజూ ప్రత్యక్ష తరగతులు ఉంటాయి.
ఈ ఆన్‌లైన్ తరగతులు లాక్‌డౌన్ ముగిసే వరకూ కొనసాగుతాయి. అనంతరం కోట , సంబంధిత స్టడీ సెంటర్‌లలో క్లాస్‌రూమ్ తరగతులు ప్రారంభమవుతాయి. “ప్రస్తుత లాక్‌డౌన్ మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయి. మా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులందరూ వాస్తవ సమయంలో తరగతులకు కనెక్ట్ కావొచ్చు. ఈ తరగతులు ఇంటరాక్టివ్ రూపంలో ఉంటాయి”అని కెరీర్ పాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో ప్రమోద్ మహేశ్వరి అన్నారు. “లాక్‌డౌన్ కారణంగా జీవితం స్థంభించి పోయినప్పటికీ, అభ్యాసం మాత్రం కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో టెస్ట్‌లను నిర్వహిస్తున్నారు. తమ భద్రత కోసం విద్యార్థులు ఇంటిలో ఉండటం ఎంత అవసరమో, కోచింగ్‌కు దూరం కాకుండా ఉండటం కూడా అంతే అవసరం” అని ప్రమోద్ మహేశ్వరి తెలిపారు.