Sat. Jul 27th, 2024
Megastar Chiranjeevi joins Instagram to connect with young fans

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ ,న్యూస్,మార్చి25,హైదరాబాద్: అత్యంత శుభప్రదమైన ఉగాది పండుగ వేళ, టాలీవుడ్‌లో అభిమాన మెగాస్టార్‌, చిరంజీవి నేడు, ఇన్‌స్టాగ్రామ్‌పై తన ప్రవేశాన్ని వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులకు ఆయనతో నేరుగా సంభాషించేందుకు మార్గంగా నిలువనుంది. ఇన్‌స్టాగ్రామ్‌కు అంతర్జాతీయంగా నూరుకోట్ల మంది వినియోగదారులున్నారు. కమ్యూనిటీ , సాంస్కృతిక ఔచిత్యం, విజువల్‌
ఎక్స్‌ప్రెషన్‌ కారణంగా అసాధారణంగా ప్రాచుర్యం పొందింది ఇన్‌స్టాగ్రామ్‌. దీనికి ప్రియాంక చోప్రా ,విరాట్‌ కోహ్లీ, దీపికా
పడుకొనే నుంచి రతన్‌ టాటా వరకూ వినియోగదారులున్నారు. ఇప్పుడు పద్మభూషణ్‌, అవార్డు గ్రహీత , భారతదేశంలో సినిమాకు సంబంధించి మహోన్నతమైన వ్యక్తులలో ఒకరైన, చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువుదీరిన కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ ఈ ప్లాట్‌ఫామ్‌పై చేరారు. భారతదేశ వ్యాప్తంగా అభిమానులు కలిగిన, అభిమానులు ముద్దుగా పిలుచుకునే చిరును యువత నుంచి ముసలి వారి వరకూ ఒకేలా అభిమానిస్తారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా, చిరంజీవి నేరుగా తన అభిమానులను పలుకరించడంతో పాటుగా తన అభిరుచులు , ఆసక్తులను యువ అభిమానులతో పంచుకోనున్నారు. దీని గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఇన్‌స్టాగ్రామ్‌పై చేరినందుకు సంతోషంగా ఉంది ! నా ఖాతా ను ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభించేందుకు ఇంతకన్నా మంచి రోజు మరేదీ లేదు. ఉగాది అత్యంత శుభప్రదమైనది, మన తెలుగువారి నూతన
సంవత్సరారంభం ! ఆధీకృత భావాలను పలికించడంలో అత్యున్నత వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌ సుప్రసిద్ధం, నేటి అత్యంత ఆందోళనకరమైన అంతర్జాతీయ ఆరోగ్య వాతావరణంలో, నేను నా భావాలను, విధానాలను వ్యక్తీకరించేందుకు తోడ్పడుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా వాసులతో పాటుగా భారతీయులకు సైతం ఉపయోగపడనున్నాయి. నా జీవితంలోని మరుపురాని ఘట్టాలను సైతం పంచుకునేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు. ఆయనను ఇన్‌స్టాగ్రామ్‌ కమ్యూనిటీపై ఆహ్వానించిన మనీష్‌ చోప్రా, హెడ్‌ ఆఫ్‌ పార్టనర్‌షిప్స్‌, ఫేస్‌బుక్‌ ఇండియా
మాట్లాడుతూ ‘‘నేడు సంస్కృతిని ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వచిస్తుంది. ఈ యాప్‌ను ప్రతిరోజూ వినియోగిస్తుండటానికి ప్రధాన కారణం పబ్లిక్‌ ఫిగర్స్‌, క్రియేటర్లతో నిత్యం అనుసంధానించబడేందుకు ఇది తోడ్పడుతుంది. చిరంజీవి మా ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌పై చేరడం మాకు గర్వకారణం. భారతీయ సినీ పరిశ్రమలో ఆయన ఓ దిగ్గజం. మేము ఉత్పత్తులు, ఫీచర్లు అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడం,
పబ్లిక్‌ ఫిగర్స్‌ను మా వేదికపైకి తీసుకురావడం, మా ప్లాట్‌ఫామ్‌పై వారు వ్యక్తీకరించుకోవడానికి తోడ్పడటం చేయనున్నాం’’ అని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణా రాష్ట్రాలలో ఇన్‌స్టాగ్రామ్‌ పై ఇప్పటికే పలువురు సుప్రసిద్ధ వ్యక్తులు చేరడంతో పాటుగా తమ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. చిరంజీవితో పాటుగా ఇప్పుడు మహేష్‌బాబు, అల్లు అర్జున్‌,రామ్‌చరణ్‌, సమంత అక్కినేని, రానా దగ్గుబాటి, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ వంటి వారు ఉన్నారు.
చిరంజీవిని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌పై అతని ఖాతా ను అనుసరించవచ్చు. ఆయన తన ఖాతాను
ఆరంభించిన వెంటనే ఫాలోవర్లు ఆయనతో చేరారు.