365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి 29,హైదరాబాద్: అగ్రగామి హెల్త్ కేర్ సంస్థ భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ముందడుగు వేసింది. కరోనా వైరస్ రిస్క్ ను అంచనా వేసేలా ఓ అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది. “ఎన్ ఐ హెచ్ డబ్ల్యూఎన్ “పేరుతో యాప్ ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఐదు నిమిషాల్లో కోవిడ్-19 వైరస్ రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్నెస్ కేర్ నెట్ వర్క్ ఈ యాప్ ను రూపొందించేందుకు కొన్నేళ్లుగా అనేక పరిశోధనలు చేసింది. స్వదేశీ సాంకేతికతతో హెల్త్ వెల్నెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్ సంజీవన్ ను రూపొందించింది భారత్ హెల్త్ కేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ. శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి,అమెరికాకు చెందిన హార్వార్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ లతో కలిసి ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు,నూతన పరికరాలను విపణి లోకి ప్రవేశ పెట్టిన కోటీగ్రూప్ ఆఫ్ వెంచర్స్ ఈ అరుదైన ఘనత సాధించింది. ఉచితంగా ప్లేస్టోర్ లో నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్నెస్ కేర్ నెట్ వర్క్ ఈ యాప్ ను పొందవచ్చు. మరిన్ని వివరాలకు +91-9100-181-181, care@nihwn.co, https://www.nihwn.co
www.nihwn.co (https://www.nihwn.co/)
Home Page