Sat. May 25th, 2024
Straight to digital: Amazon Prime Video to globally premiere seven highly anticipated Indian movies

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, ఇండియా,15 మే 2020: షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన, అమితాబ్ బచ్చన్ (బ్లాక్, పీకు), ఆయుష్మాన్ ఖురానా (శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్, అంధాధున్) నటించిన గులాబో సితాబో యొక్క రాబోయే ప్రసారం గురించి ప్రకటించిన తరువాత, అదనంగా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఆరు భారతీయ సినిమాలను నేరుగా తన స్ట్రీమింగ్ సర్వీస్ పై ప్రసారం చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ప్రకటించింది. వీటిలో ఐదు భారతీయ భాషలకు చెందిన సినిమాలు ఉన్నాయి. విద్యాబాలన్ (డర్టీ పిక్చర్, కహానీ) ప్రధాన పాత్ర పోషించిన, అను మీనన్ దర్శకత్వం వహించిన శకుంతలా దేవి, ప్రధాన పాత్రలో జ్యోతిక (చంద్రముఖి) నటించిన లీగల్ డ్రామా పొన్ మగల్ వంధాల్, కీర్తిసురేశ్ (మహానటి) నటించిన పెంగ్విన్ (తమిళం, తెలుగు), సుఫియాం సుజాతాయం (మలయాళం), లా (కన్నడ), ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ) వీటిలో ఉన్నాయి. ఈ సినిమాలు రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోపై ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెరిటరీస్ లలో వీటిని వీక్షించవచ్చు.ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ, ‘‘అమెజాన్ లో మేము మా వినియోగదారుల మాట వింటాం, ఆ దిశగా మేము పని చేస్తాం’’ అని అన్నారు. ‘‘గత 2 ఏ ళ్లుగా వివిధ భాషల్లో, థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే కొత్త రిలీజ్ లను చూసేందుకు గమ్యస్థానంగా ప్రైమ్ వీడియో రూపుదిద్దుకుంది. ఇప్పుడు మేము మరో అడుగు ముందుకేశాం. అంతా ఎంతగానో చూస్తు న్నఏడు భారతీయ సినిమాలను ఎక్స్ క్లూజివ్ గా ప్రైమ్ వీడియోపై ప్రసారం చేయనుంది, సినిమాటిక్ అనుభూతిని వారి ఇళ్ల ముంగిళ్లలోకి తీసుకురానుంది’’ అని అన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ ఈ సందర్భంగా మాట్లా డుతూ, ‘‘ఎంతగానో చూడాలనుకుంటున్న ఈ 7 సినిమాల విడుదల కోసం భారతీయ వీక్షకులు ఎంతో ఆ త్రంగా ఎదురుచూస్తున్నారు. మా వినియోగదారుల కోసం వీటిని ఇప్పుడు మేము ప్రసారం చేయడం మా కెంతో ఆనందదాయకం. వీటిని మా వీక్షకులు ఇంట్లోనే సురక్షితంగా, సౌకర్యవంతంగా తాము ఎంచుకున్న స్క్రీన్ పై చూడవచ్చు. 4000కు పైగా పట్టణాలు, నగరాలలో వీక్షణంతో భారతదేశంలో ఎంతగానో చొచ్చుకు పోయిన ప్రైమ్ వీడియో ఇప్పుడు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లలో అందుబాటులో ఉంది. ఈ సినిమా ల కు అంది అంతర్జాతీయ రిలీజ్ ముద్రను అందించనుంది. ఈ కార్యక్రమం పట్ల మేమెంతో ఉద్వేగంగా ఉన్నాం. ఇది మా ప్రైమ్ సభ్యులను ఆనందపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

Amazon Prime Video, which will air seven movies
Amazon Prime Video, which will air seven movies

అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క డైరెక్ట్–టు-సర్వీస్ స్లేట్:పొన్ మగల్ వంధల్ (తమిళం), అమెజాన్ ప్రైమ్ వీడియోపై మే 29 నుంచి
జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్ నటించిన పొన్ మగల్ వంధల్ ఒక లీగల్ డ్రా మా. రచన, దర్శకత్వం జె.జె. ఫ్రెడరిక్. నిర్మాతలు సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్. గులాబో సితాబో (హిందీ), అమెజాన్ ప్రైమ్ వీడియోపై జూన్ 12 నుంచి
అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో ఒక ఫ్యామిలీ కామెడీ. సగటు మనిషి రోజువారీ పోరాటాలను ఇందులో చూడవచ్చు. రచన జూహి చతుర్వేది. దర్శకత్వం షూజిత్ సిర్కార్. నిర్మాణం రోన్ని లాహిరి, శీల్ కుమార్.పెంగ్విన్ (తమిళం, తెలుగు), అమెజాన్ ప్రైమ్ వీడియోపై జూన్ 19 నుంచి కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ కు రచన, దర్శకత్వం ఈశ్వర్ కార్తీక్. నిర్మాణం స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్ లా (కన్నడ), అమెజాన్ ప్రైమ్ వీడియోపై జూన్ 26 నుంచి
రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు నటించిన లా కు రచన, దర్శకత్వం రఘు సమర్థ్. నిర్మాతలు అశ్విని , పునీత్ రాజ్ కుమార్.ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ), అమెజాన్ ప్రైమ్ వీడియోపై జూలై 24 నుంచి
ఫ్రెంచ్ బిర్యానీలో డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. రచన అవినాశ్ బాలెక్కాల. దర్శకత్వం పన్నాగ భరణ. నిర్మాతలు అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్ శకుంతలా దేవి (హిందీ), విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన శకుంతలా దేవి అనేది హ్యూమన్ కంప్యూటర్ గా ప్రఖ్యాతి చెందిన రచయిత, గణితవేత్త అయిన శకుంతలా దేవి జీవితకథ. కథా రచన నాయనిక మహ్తాని, అనూ మీనన్. దర్శకత్వం అనూ మీనన్. నిర్మాణం అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.సుఫియాం సుజాతాయం (మలయాళం), విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. అదితి రావు హైదరీ, జయ సురుయ నటించిన సుఫియాం సుజాతాయం సినిమాకు కథా రచన, దర్శకత్వం నరని పుజా షానవాస్. నిర్మాణం విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.

Straight to digital: Amazon Prime Video to globally premiere seven highly anticipated Indian movies
Straight to digital: Amazon Prime Video to globally premiere seven highly anticipated Indian movies

ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ఈ నూతన వి డుదలలు కూడా చేరాయి. ఇందులో ఫోర్ మోర్ షాట్స్, ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మ రియు మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ ర యాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉ న్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్య యం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సే వలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మల యాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చుప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా పాతాళ్ లోక్ అన్ని ఎపిసోడ్స్ ను స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉ పకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ వంటి వాటిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చూడ వచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లో కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు. భారత దేశం లో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ.999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉచి త 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో
ప్రైమ్ వీడియో అనేది ఒక ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ప్రైమ్ సభ్యులకు అవార్డ్ విన్నింగ్ అమెజాన్ ఒరి జినల్ సిరీస్ కలెక్షన్, వేలాది సినిమాలు, టీవీ షోలు – తాము కోరుకున్నవన్నీ ఒకే చోట లభించేలా చే స్తుంది. Prime Video. com లో మరింత సమాచారం తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోతో భాగం: ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు, హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ఈ టైటిల్స్ కూడా చేరాయి. ఇందులో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్, మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ వి న్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సేవలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయా ళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చు
తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణా లు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ, పలు రకాల గేమింగ్ ఉపకరణాలు వంటి వాటిపై ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ఎయిర్ టెల్, వోడాఫోన్ ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కూడా వినియోగదారులు ప్రైమ్ వీడియోను పొందవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రై మ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
మెరుగుపర్చబడిన అనుభూతులు: ప్రతీ వీక్షణాన్ని మరింతగా అనుభూతి చెందండి 4కె అల్ట్రా హె చ్ డి, హై డైనమిక్ రేంజ్ (హెచ్ డిఆర్) కంపాటిబుల్ కంటెంట్ తో. ఎక్స్ క్లూజివ్ ఎక్స్ -రే యాక్సెస్ తో మీ అభిమాన సినిమాలు, టీవీ షోల గురించి మరింతగా ఆనందించండి. ఐఎండీబీచే శక్తివంతం. ఆఫ్ లైన్ లో తరువాత చూసుకునేందుకు వీలుగా సెలెక్ట్ మొబైల్ డౌన్ లోడ్స్ తో సేవ్ చేసుకోండి.ప్రైమ్ తో చేరిక: భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ.999 లేదా నె లకు రూ.129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు మరియు ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.

Amazon Prime Video, which will air seven movies
Amazon Prime Video, which will air seven movies

www.amazon.inOnline Shopping site in India: Shop Online for Mobiles, Books, Watches, Shoes and More – Amazon.inAmazon.in: Online Shopping India – Buy mobiles, laptops, cameras, books, watches, apparel, shoes and e-Gift Cards. Free Shipping & Cash on Delivery Available.