Mon. Oct 7th, 2024
What role do the eyes play in the spread of coronavirus?

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి30,హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో మన కళ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని కంటి వైద్యనిపుణులు,
డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, క్లీనికల్ సర్వీసెస్ హెడ్
డాక్టర్ లత .వి హెచ్చరిస్తున్నారు. కండ్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిదని వారు చెబుతున్నారు.

  డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, క్లీనికల్ సర్వీసెస్ హెడ్, డాక్టర్ లత వి.
డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, క్లీనికల్ సర్వీసెస్ హెడ్, డాక్టర్ లత వి.

ఎలా వ్యాప్తి చెందుతుందంటే ?
-ఇది తుంపర్లు/సంప్రదింపులు/గాలి ద్వారా పయణించడం వల్ల వ్యాప్తి చెందవచ్చు.

  • కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అత్యంత సహజమైన మార్గంగా రెస్పిరేటరీ డ్రాప్‌లెట్స్ నిలుస్తాయి (దగ్గు, తమ్ము).
    -వైరస్‌తో కూడిన అపరిశుభ్రమైన పరిసరాలను తాకి, అనంతరం ఆ చేతులతో తమ కళ్లు, ముక్కు, నోటిని తాకడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
  • కండ్లకలక ఉన్నవారికీ కంటి స్రావాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
  • దీని వల్ల కండ్లకలక , శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి.
    -ఇటీవలి కాలంలో విదేశీ ప్రయాణాలు చేసిన వారు మరింత ఆప్రమప్తంగా ఉండాలి.
    -ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ రోగులు ఈ వ్యాధి వాహకాలుగా మారే ప్రమాదం ఉంది. సాధారణంగా ఈ వైరస్ సోకిన 2-14 రోజుల లోపు లక్షణాలు కనిపిస్తాయి.
    వైరస్‌కారణంగా కండ్లకలక రావొచ్చు
    కరోనా వైరస్ కారణంగా కండ్లకలక రావొచ్చు. ఇది మొదటి సూచికగా కూడా ఉంటుంది. దీని కారణంగా నేత్రవైద్యులు ఈ కరోనా వైరస్ బారిన పడేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి.
    కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, దురద, నొప్పి, స్రావాలు కారడం, ఫోటోఫోబియా వంటి లక్షణాలు ఈ కండ్లకలకలో కనబడతాయి. శ్వాససంబంధిత లక్షణాలలో జ్వరం, దగ్గు, గొంతు మంట, శ్వాస తీసుకోవడంలో కష్టం, ముక్కు కారడం, తలనొప్పి వంటివి ఉంటాయి. తీవ్రమైన కేసులలో న్యుమేనియా, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి జరిగే ప్రమాదం ఉన్నదని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ లత చెబుతున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిలో కండ్ల పాత్ర ?
కరోనా వైరస్ వ్యాప్తిలో కండ్ల పాత్ర ?


ఎలాంటి జాగ్రత్తలు ?

అతి సరళమైన పరిశుభ్రతా ప్రమాణాలు అనుసరించాలి. ఇందుకోసం..

చేతులను తరచుగా సబ్బు, నీరుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రపరుచుకోవడం లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో అయినా శుభ్రపరుచుకోవాలి.

శీతల పానీయాలు/చల్లటి పదార్ధాలు తీసుకోరాదు.
-వేడి నీళ్లు, వేడి పదార్థాలు తీసుకోవాలి. తగినంత నీరు తీసుకోవాలి.
-అపరిశుభ్రంగా ఉన్న చేతులతో ముఖం, కళ్లు, ముక్కు లేదా నోటిని తాకరాదు.
-హెల్త్‌కేర్ వర్కర్లు తప్పనిసరిగా మెడికల్ మాస్క్, గాగూల్స్, ఫేసియల్ ప్రొటెక్షన్ ధరించాలి. అనారోగ్యంతో ఉన్నవారు ఎన్ 95 లేదా సర్జికల్ మాస్క్ ధరించాలి. 14 రోజుల పాటు ఇంటి వద్దనే ఉండాలి. లక్షణాలు ఎక్కువగా కనబడితే డాక్టర్‌ను సంప్రదించాలి.

error: Content is protected !!