Mon. Sep 9th, 2024

365తెలుగ డాట్ కం ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్, 10మే 2020డీబీఎస్ ఆసియా హబ్ 2 (డీఏహెచ్2) తాము ఇప్పటి వరకూ 6.5 మిలియన్ రూపాయలను కోవిడ్ -19 ఉపశమన చర్యలకు మద్దతునందించేందుకు సమీకరించామని వెల్లడించింది. ఈ మొత్తాలను 4,35,000 భోజనాలను అందించడంతో పాటుగా స్థానిక ఆస్పత్రులకు పరీక్షలయంత్రసామాగ్రి అందించేందుకు వినియోగించనున్నారు.
యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో భాగస్వామ్యం చేసుకుని డీఏహెచ్ 2 ఉద్యోగుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. తద్వారా సమాజంలో తీవ్రంగా ప్రభావితమైన వర్గాలకు మద్దతునందించడంతో పాటుగా అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను సైతం వేగవంతం చేస్తుంది. ఓ ఉద్యోగి అందించే ప్రతి విరాళానికీ, రెట్టింపు మొత్తంలో డీఏహెచ్ 2 తోడ్పాటునందించడం ద్వారా మూడు రెట్ల ప్రభావాన్ని అందించింది.
యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి డీఏహెచ్2 ఇప్పుడు కిరాణా సరుకులు ఇతర నిత్యావసరాలను ఈ మహమ్మారి కారణంగా ప్రభావితమైన దాదాపు 1500 కుటుంబాలకు అందజేసింది. వీటిలో 300 కిట్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పారిశుద్ధ్య కార్మికులకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో అందజేశారు. ప్రతికిట్ విలువ 2వేల రూపాయలు. దీనిలో నిత్యావసర సరుకులు సహా కిరాణా, శానిటేషన్ మెటీరియల్స్ వంటివి ఉంటాయి. ఐదుగురు ఉన్న కుటుంబానికి కనీసం నెల రోజుల పాటు అవసరాలను ఇవి తీర్చగలవు. ఈ మొత్తం విలువ 4,35,000 భోజనాలు. ఈ విరాళాలలో కొంత మొత్తాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యర్థించిన రీతిలో ప్రభుత్వ ఆస్పత్రులలో కోవిడ్-19 కేసులను వేగవంతంగా పరీక్షించేందుకు ర్యాపిడ్ టెస్టింగ్ యంత్రసామాగ్రిని అందించేందుకు వినియోగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరియు స్థానిక ఆస్పత్రులలో సామర్థ్యం మెరుగుపరచడానికి డీఏహెచ్2 ఇప్పుడు ఐటీ4టీఎస్ క్యాంపెయిన్ కోసం చేతులు కలిపింది. డీఏహెచ్2 డొనేషన్‌ను ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్టర్ కోసం వినియోగించనున్నారు. కోవిడ్-19 పరీక్షలలో ఇది అత్యంత కీలకం కానుంది.ఈ సంస్థ ఇప్పటికే 15వేల మాస్కులను హెల్త్‌కేర్ వర్కర్లకు అందించడంతో పాటుగా అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా మార్చి నెలలోనే 2వేల భోజనాలను అందించింది.
బ్యాంకు యొక్క అంతర్జాతీయ కార్యక్రమం డీబీఎస్ స్ట్రాంగర్ టుగెదర్ లో భాగంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. సమాజంలో బీద వర్గాల ప్రజలకు తోడ్పడేందుకు 10.5 మిలియన్ సింగపూర్ డాలర్లను అందించడానికి డీబీఎస్ కట్టుబడింది. డీబీఎస్ స్ట్రాంగర్ టుగెదర్ ఫండ్ ద్వారా దాదాపు 4.5 మిలియన్ మీల్స్‌ను బ్యాంకు అందించడంతో పాటుగా సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనా, ఇండియా, ఇండొనేషియా, తైవాన్‌ల వ్యాప్యంగా కేర్ ప్యాక్స్‌ను సైతం బ్యాంకు అందించనుంది.
అలెక్స్ వూ, సీఈవో, డీబీఎస్ ఆసియా హబ్ 2 మాట్లాడుతూ “ఈ మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నిరుపేదలకు మా మద్దతును విస్తరించడానికి లక్ష్యంగా చేసుకున్నాము. తమ మద్దతునందించడంతో పాటుగా ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మా ఉద్యోగులకు ధన్యవాదములు తెలుపుతున్నాము. సమాజానికి విలువైన తోడ్పాటునందించడానికి డీబీఎస్ కట్టుబడి ఉంది మరియు ఈ తరహా కార్యక్రమాల ద్వారా కోవిడ్-19తో పోరాడుతున్న దేశాలతో చేతులు కలుపుతున్నాం” అని అన్నారు.రేఖా శ్రీనివాసన్, సీఈవో, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మాట్లాడుతూ “డీబీఎస్ ఆసియా హబ్ 2 ఆ సంస్థ ఉద్యోగులు అందించిన తోడ్పాటుకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాము. నిరుపేద కుటుంబాలకు మద్దతునందించడంలో సమాజాన్ని పునర్నిరర్మించడంలో ఈ తోడ్పాటు ఎంతో మేలు చేయనుంది. ప్రాధమిక స్థాయి నుంచి కమ్యూనిటీలతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సన్నిహితంగా పనిచేయడంతో పాటుగా కోవిడ్-19 విస్తరిస్తున్న ఈ కీలక సమయంలో అవసరమైన వారికి మద్దతునందించగలమనే భరోసా అందిస్తున్నాం* అని అన్నారు.

error: Content is protected !!