365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి13, హైదరాబాద్ :2020: ప్రపంచ శ్రేణి కంటి సంరక్షణా సదుపాయాలను హైదరాబాద్ వ్యాప్తంగా అందించాలనే తమ నిబద్ధతను పునరుదద్ఘాటిస్తూ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నూతన అత్యాధునిక కంటి చికిత్స కేంద్రాన్ని గచ్చిబౌలిలో ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి రాశీఖన్నాహాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్-క్లీనికల్ సర్వీసెస్,డాక్టర్ గౌరవ్ అరోరా, డాక్టర్ వంశీధర్, డాక్టర్ హరికృష్ణ కులకర్ణి, సీనియర్ కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్ పాల్గొన్నారు.
ఈ కేంద్రంలో ప్రపంచశ్రేణి సదుపాయాలైన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, ప్రెసిషన్ క్యాటరాక్ట్, రెటీనా ఆపరేషన్ థియేటర్, వ్యూయింగ్ గ్యాలరీ ఉన్నాయి. ఈ కేంద్రంలో డే కేర్ శస్త్రచికిత్సలు, ఔట్‌పేషంట్ డయాగ్నోస్టిక్ చికిత్సా సేవలను అన్ని రకాల దృష్టి లోపాలకు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలతో చికిత్సఅందిస్తారు. హైదరాబాద్‌లో 5 కేంద్రాలతో సహా తెలంగాణా రాష్ట్రంలో 10-12 కేంద్రాలను విస్తరించాలని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రణాళిక చేసింది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని టియర్ 2, టియర్ 3 నగరాలలో వీటిని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఈ కేంద్రంలో లేబరేటరీ, ఫార్మసీ , సుప్రసిద్ధ బ్రాండ్‌ల అత్యున్నత నాణ్యత కలిగిన ఫ్రేమ్‌లు, లెన్స్‌లను విస్తృతశ్రేణిలో అందించే ఆప్టికల్ వింగ్ కూడా ఉంది.
అనంతరం రాశీఖన్నా మాట్లాడుతూ “గచ్చిబౌలిలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నూతన కేంద్రాన్ని ప్రారంభిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. మన కళ్లు అత్యంత విలువైనవి. ఈ ప్రపంచాన్ని మనకు అత్యంత అందంగా చూపే కెమెరాలా అవి పనిచేస్తాయి. మన భావాలు, ఆసక్తులను ఎదుటి వారికి చెప్పేందుకు కూడా కళ్లు దోహదపడతాయి. అందమైన కళ్లు, ఆకర్షణకు బలమైన గుర్తులు. దీనికోసం మనం వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరికీ మెరుగైన కంటి సంరక్షణను డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ అందించగలదని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.
డాక్టర్ గౌరవ్ అరోరా, రీజనల్ హెడ్- క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్, హైదరాబాద్ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2.2 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పలు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిలో ఒక బిలియన్ కేసులను నివారించడం లేదా చికిత్సనందించడం చేయవచ్చు. కంటి సమస్యలకు ,అంధత్వంకు కారణమవుతున్న అతి సాధారణ పరిస్థితిల్లో క్యాటరాక్ట్, ట్రాచోమా, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటున్నాయి. కానీ డ్రై ఐ , కండ్లకలక వంటి ఇతర కారణాలకు సైతం కంటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వద్ద డాక్టర్లు ప్రతి ఒక్కరి కంటి సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటుగా అనుమానిత సమస్యలకు చికిత్సనందించగలరు” అని అన్నారు.
రీజనల్ హెడ్- క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ ” భారతదేశంలో 62 మిలియన్ల మంది ప్రజలు అంధత్వం లేదా కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, వయసు సంబంధిత సమస్యలు, పరిమిత కంటి సంరక్షణ వంటివి దృష్టి సమస్యలు పెరుగుతుండటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అత్యాధునిక, అత్యున్నత సాంకేతిక, సృజనాత్మక పద్థతులను డాక్టర్ అగర్వాల్స్ ఐ కేర్ హాస్పిటల్స్ స్వీకరించడంతో పాటుగా సుశిక్షితులైన కంటి నిపుణులు ప్రతి ఒక్కరి కంటి ఆరోగ్యం పరీక్షించి అత్యుత్తమ కంటి చికిత్సను అందించగలరు” అని అన్నారు.
సీనియర్ కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్, డాక్టర్ హరికృష్ణ కులకర్ణి మాట్లాడుతూ “గచ్చిబౌలిలో అధికశాతం ఐటీ కంపెనీలు , విద్యాసంస్థలు ఉన్నాయి. ఎక్కువ గంటలు చదవడం, కంప్యూటర్ స్క్రీన్‌లకు అతుక్కుపోవడం వల్ల చాలామంది కంటి సమస్యలను ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్నారని మేము గమనించాం. కంటి సమస్యలను అసలు నిర్లక్ష్యంచేయకూడదు. సరైన సమయంలో కంటి సమస్యలను గుర్తిస్తే, చికిత్సనందించడం సులభం. అన్ని రకాల కంటి సమస్యలకూ ఇక్కడ పరిష్కారాలను అందించగలం” అని హరికృష్ణ కులకర్ణి అన్నారు.