Oliveboard free online course to help aspirants prepare during COVID 19 crisis

365తెలుగు డాట్ కామ్,ఆన్‌లైన్ న్యూస్,26 మార్చి,నేషనల్ 2020: అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభంతో పలు పొటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్ష్కణ ఇస్తున్న ఇనిస్టిట్యూట్‌లు చాలా వరకూ మూతపడ్డాయి. దీంతో విద్యార్థులకు కోచింగ్ సంస్థ ఆలీవ్‌బోర్డ్ ఘర్ పే కోచింగ్ పేరుతో బ్యాంకింగ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారి కోసం ఉచిత కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తున్నది. ఈ ప్లాట్‌ఫామ్‌ను విద్యార్థులకు మార్చి 19 నుంచి హిందీ ,ఇంగ్లీషు భాషలలో అందుబాటులో ఉండనున్నది. ఇందులో వీడియోలు, అత్యున్నత ఫ్యాకల్టీతో లైవ్ ట్యూషన్లు ,మాక్ టెస్ట్‌లతో ప్రత్యేకమైన ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయి. ఇటీవల విడుదలైన అధ్యయనాల ప్రకారం భారతదేశంలో 4 మిలియన్ల మంది విద్యార్థులు పలు బ్యాంకింగ్ పరీక్షల కోసం ప్రతి సంవత్సరం హాజరవుతున్నారు .ఈ విద్యార్థులు రెగ్యులర్ కోచింగ్ తరగతులకు ఈ పరీక్షలకు సిద్ధం కావడంలో భాగంగా హాజరవుతున్నారు. నేడు భారీ స్థాయిలో ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆలీవ్‌బోర్డ్ ఇప్పుడు ఈ విద్యార్థులకు తోడ్పడటానికి ముందుకు రావడంతో పాటుగా పూర్తి ఉచితంగా ప్రత్యామ్నాయ కోచింగ్‌ను అందిస్తుంది.

ఆలీవ్‌బోర్డ్ సీఈవో అభిషేక్ పాటిల్

ఉచిత తరగతులను అభ్యాసకులకు దేశవ్యాప్తంగా అందిస్తూ బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యేలా తోడ్పడుతుంది. ఈ సమయాన్ని అభ్యాసకులు ఉపయోగించాలని కోరుకుంటున్నాం. మహమ్మారి కరోనావైరస్‌కు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ ఇంటి నుంచి సౌకర్యవంతంగా అభ్యసించవచ్చని ఆలీవ్‌బోర్డ్ సీఈవో అభిషేక్ పాటిల్ తెలిపారు. ఆలీవ్‌బోర్డ్ ఈ కీలకమైన సమయంలో వీలైనన్నిమార్గాలలోవిద్యావ్యవస్థకుమద్దతునందించాలనుకుంటుంది, బ్యాంకింగ్ రంగంలో సత్తాచాటాలనుకుంటున్న ఔత్సాహికులు తమ లక్ష్యం చేరుకునేలా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.