Thu. Oct 3rd, 2024

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి 8, హైదరాబాద్ :టిఎస్ఆర్టీసీ బస్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, సతీమణి శ్రీమతి శాలిని శర్మ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీలలో మహిళా ఉద్యోగులు వారి కుటుంబసభ్యులతో పాటుగా ఉత్సాహంగా పాల్గొన్నారు, విజేతలకు, క్రీడల్లో పాల్గొన్న వారికి ముఖ్య అతిధి శ్రీమతి శాలిని శర్మ గారు బహుమతిప్రధానం చేశారు. ఆటలపోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు వారి పిల్లలను అభినందించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి శాలిని శర్మ మాట్లాడుతూ మహిళా సిబ్బంది కార్యక్రమ నిర్వహణ తీరును మెచ్చుకున్నారు. ప్రతి కార్యాలయంలో మహిళా ఉద్యోగులు ఓపికగా, సమర్దవంతంగా తమ విధులు నిర్వహిస్తూ, బహుళ ప్రతిభావంతులుగా రాణిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ, ఐఎఎస్ మాట్లాడుతూ విజేతలను అభినందించారు . మహిళా అధికారులు, మహిళా పర్యవేక్షకులు. మహిళా ఉద్యోగులు ఒకే కుటుంబంగా పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎ) టి.వి.రావు , యస్ ఎల్ ఓ శ్రీలత , డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీమతి విజయ పుష్ప , మహిళా ఉద్యోగులు ఆధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

error: Content is protected !!