Mon. Apr 15th, 2024

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఎంబెడ్డెడ్ సిస్టంస్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ,మెషిన్ లెర్నింగ్ విషయాలపై విద్యార్థులకు అకాడమీ శిక్షణ ఇస్తుంది. పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తుంది.

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 12,గౌహతి, భారతదేశం: శామ్­సంగ్ ఇండియా ఈరోజు శామ్­సంగ్ డిజిటల్ అకాడమీని ఐఐటీ-గౌహతీలో ప్రారంభించింది. తద్వారా ప్రభుత్వపు స్కిల్ ఇండియా మిషన్ దిశగా తన నిబద్ధతను శక్తివంతం చేసింది. డిజిటల్ ఇండియా చొరవకు మద్దతు ఇస్తోంది.

ఐఐటీ-గౌహతీలో శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఎంబెడ్డెడ్ సిస్టంస్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ విషయాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది మరియు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవడంలో వారికి సహాయం చేస్తుంది మరియు వారు ఉద్యోగాలకు సిద్ధంగా ఉండేలా తయారు చేస్తుంది.

శామ్­సంగ్ డిజిటల్ అకాడమీ శామ్­సంగ్ కార్పొరేట్ వారి సామాజిక చొరవ.  ఇది ఆధునిక టెక్నాలజీ పై విద్యార్థులకు నైపుణ్యాలను అందించడం ద్వారా దేశంలో డిజిటల్ విభజన మరియు ప్రావీణ్యత అంతరాలను పూరించే లక్ష్యాలను కలిగి ఉంది.  ఈ భాగస్వామం ద్వారా ఐఐటీ-గౌహతీతో అకాడమీ రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ఆధునిక టెక్నాలజీలపై 300 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యాన్ని కలిగి ఉంది.

ఐఐటీ-గౌహతీలో శామ్ సంగ్ డిజిటల్ అకాడమీ ప్రోగ్రాం  అస్సాం ఆధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థల్ని అభివృద్ధి చేయడంలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి సహాయపడుతుందని మరియు డిజిటల్ విధానంలో నైపుణ్యాభివృద్ధి కోసం సంభావ్య గమ్యస్థానంగా మారడానికి రాష్ట్రానికి సహాయపడుతుందని   నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను.  ఈ నైపుణ్య చొరవను ప్రారంభించడంలో శామ్ సంగ్ మరియు ఐఐటీ-గౌహతీల మధ్య సహకారం రాష్ట్రంలో  ప్రభుత్వం సుస్థిరమైన ఉపాధి అవకాశాల్ని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి ఖచ్చితంగా కీలకమైన బాధ్యతవహిస్తుందని నేను ఆశిస్తున్నాను అని అస్సాం ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు.

తలెత్తుతున్న ఆధునిక  టెక్నాలజీల పై ఉమ్మడి బోధన, సలహాలు మరియు పరిశోధనను ప్రోత్సహించడానికి, సహకారాల్ని పెంచుకోవడంలో భారతదేశంలో  ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్ స్టిట్యూషన్స్ తో కలిసి శామ్­సంగ్ ఆర్ & డి ఇన్ స్టిట్యూట్ ఇండియా, ఢిల్లీ ఎన్నో సంవత్సరాలుగా సన్నిహితంగా పని చేస్తోంది. ఆధునిక సాంకేతిక అభివృద్ధి రంగంలో పని చేయడానికి మరియు
శామ్­సంగ్ డిజిటల్ అకాడమీ కార్యక్రమం ద్వారా శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నెట్ వర్క్ ద్వారా ఐఓటీ వంటి ఆధునిక పరిశోధనా అంశాల వృద్ధిలో పాల్గొనడానికి మేము కట్టుబడ్డాము అని శామ్­సంగ్ రీసెర్చ్ & డవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్, ఢిల్లీ మేనేజింగ్ డైరక్టర్ కిహో కిమ్ అన్నారు.

విద్యార్థుల్లో నవీన  సంస్క్రతిని పోషించడం, వారికి ఉత్తమమైన మౌలిక సదుపాయాల్ని కేటాయించడమే శామ్­సంగ్ లో, మా లక్ష్యం. మా పౌరసత్వ చొరవల్లో భాగంగా ఉన్న శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ విద్యార్థులు తమ వృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీస్ మార్కెట్ ను గరిష్టంగా ఉపయోగించేలా చేయడానికి మరియు వారి ప్రతిభను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని కూడా ఆయన అన్నారు.” అనిశామ్­సంగ్ ఇండియా కార్పొరేట్  వైస్ ప్రెసిడెంట్ పీటర్ రీ అన్నారు.

సంస్థ విద్యార్థులకు అత్యంత ఆధునిక విద్యను అందచేయడానికి శామ్­సంగ్ ఇండియాతో సంబంధానికి ఐఐటీ-గౌహతి చురుకుగా ఎదురుచూస్తోంది. అలాంటి చొరవలు అకాడమియా-పరిశ్రమ అంతరాన్ని పూరించడంలో సహాయపడతాయి  మరియు ఇరువురికి లాభదాయకంగా ఉండే పరిస్థితికి మరిన్ని సహకారాల్ని పోషించడంలో సహాయపడతాయి. రాష్ట్ర ప్రభుత్వపు శక్తివంతమైన ఆసక్తి మరియు మద్దతుతో అస్సాంలో ఇతర భాగాలకు ఐఐటీ-గౌహతి మరియు శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ నైపుణ్యతలు విస్తరించడంలో ప్రధానంగా  సహాయం చేస్తాయి. అకాడమిక్ శ్రేష్టతకు మరియు అభివృద్ధికి ఇది సాంకేతిక అవకాశాల్ని కేటాయిస్తుంది,” అని ఐఐటీ-గౌహతి డైరక్టర్ ప్రొఫెసర్ టీజీ సీతారాం అన్నారు.

ఐఐటీ-గౌహతీలో శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఎంబెడ్డెడ్ సిస్టంస్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ లు పాఠ్యాంశంలో  భాగంగా ఉంటాయి. తరగతిలో లెక్చర్లు, అసైన్ మెంట్స్ మరియు ల్యాబ్ రూం సమావేశాలు, స్వయంగా అధ్యయనం చేయడం మరియు మినీ ప్రాజెక్టుల ద్వారా కోర్స్ 14 వారాల్లో బోధించబడుతుంది. ప్రాక్టికల్ అభ్యాసనలు సులభం చేయడానికి  విస్త్రతమైన ట్యుటోరియల్స్ మరియు అప్రోచ్ డాక్యుమెంట్స్ విద్యార్థులకు అందచేయబడతాయి.శామ్­సంగ్ ఇప్పటి వరకు  శామ్­సంగ్ డిజిటల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా అయిదు  శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ను ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-హైదరాబాద్, ఐఐటీ-ఖరగ్ పూర్ మరియు ఐఐటీ-రూర్కీలలో  ఏర్పాటు చేసింది. సమీప భవిష్యత్తులో మరిన్ని శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ రానున్నాయి. ల్యాబ్స్ ప్రస్తుతం శామ్­సంగ్ తో ఉమ్మడి పరిశోధన మరియు శామ్­సంగ్ అందించే కోర్స్ /శిక్షణలు వంటి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఐఐటీ-గౌహతీలో శామ్­సంగ్ ఇన్నోవేషన్ ల్యాబ్ పర్వేసివ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ /మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, ఎంబెడ్డెడ్ సిస్టంస్ వంటి అంశాల పై పరిశోధన చేస్తుంది.