Sun. Sep 15th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్10, హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే ఆటా వేడుకలు ఈ సంవత్సరం డిసెంబర్‌ 11 నుంచి జరుగుతాయని ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి తెలిపారు.  డిసెంబర్‌ 29న గ్రాండ్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్నదని ఆయన తెలిపారు. ఈ వేడుకలు ఎలక్ట్ ప్రెసిడెంట్ భువనేష్ బుజ్జాలఅధ్యక్షతనలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఉచిత వైద్యశిబిరాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌మేళా, ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు, ఆటా సాంస్కృతిక, జానపద ఉత్సవాలను నిర్వహిస్తున్నామని భువనేశ్ తెలిపారు. ఈ కార్యక్రమాలతో పాటు స్కూల్‌ ప్రాజెక్ట్‌, స్టూడెంట్‌ స్కాలర్‌షిప్స్‌, వైజాగ్‌లో, హైదరాబాద్‌లో బిజినెస్‌ కాన్ఫరెన్స్‌, ఎడ్యుకేషనల్‌ సెమినార్‌ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నిజాం క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆట ఇండియా కోఆర్డినేటర్ లతో సమావేశం ఏర్పాటు చేశారు.

error: Content is protected !!