Mon. Sep 9th, 2024

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి20హైదరాబాద్: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో డొమినోస్ పిజ్జా మెరుగైన పరిశుభ్రతను పాటిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న1325 డొమినోస్ పిజ్జారెస్టారెంట్లలో“జీరో కాంటాక్ట్ డెలివరీ ”సేవలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా  వినియోగదారులకు డెలివరీసిబ్బందితో సంబంధంలేకుండ ఆర్డర్లను స్వీకరిస్తారు.  కస్టమర్లు,డెలివరీ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తచర్యగా ఈ ప్రత్యేక విధానాన్ని ప్రవేశ పెట్టబడింది. “జీరో కాంటాక్ట్ డెలివరీ ”సేవలను పొందడానికి,  వినియోగదారులు డొమినోస్ అప్లికేషన్ నూతన వెర్షన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసేటప్పుడు “జీరో కాంటాక్ట్ డెలివరీ ” ఆప్షన్ ను ఎంచుకోవాలి.  పరిశుభ్రతలో భాగంగా డొమినోస్ పిజ్జా కంపెనీ ఉద్యోగులకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది. తమ వినియోగదారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా డొమినోస్ పిజ్జా పనిచేస్తున్నదని , అందుకోసమే మెరుగైన సేవలు అందించేందుకు సిధ్దమైనాట్లు ఆ సంస్థ పేర్కొన్నది

error: Content is protected !!