365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్,2 ఆగష్టు 2020 : హైదరాబాద్‌లోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన నూట తొంభైమంది విద్యార్దులు తెలంగాణలో అక్షయ పాత్ర ఫౌండేషన్ చేపట్టిన కోవిడ్-19 సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ ద్వారా నిధుల సమీకరణ ప్రచారాన్ని చేపట్టి తద్వారా 1.05 కోట్ల రూపాయల నిధులను సమీకరించి తద్వారా 4 లక్షల మందికి పైగా ఆర్దికంగా వెనుకబడిన,రోజువారీ కూలీల ఆకలిని తీర్చడంలో సహాయపడ్డారు. 9 నుండి 12వ తరగతులకు చెందిన వీరు కేవలం 13 నుండి 17 ఏళ్ల వయస్సుకు చెందినవారు కావడం విశేషం. కేవలం మూడు వారాలోనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండిరగ్ వెబ్‌సైట్ అయిన ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ ద్వారా 1.05 కోట్ల రూపాయల నిధులను వారు సేకరించారు.నిధుల సేకరణలో మొదటి ఐదు స్థానాలలో నిలిచిన వారిలో దివ్య చెఱుకూరి (గ్రేడ్ 9), కృష్ణ తేజ సోమిశెట్టి (గ్రేడ్ 10), శ్రీని రెడ్డి (గ్రేడ్ 9), వజ్ర మోచర్ల (గ్రేడ్ 10),దియా రెడ్డి (గ్రేడ్ 10) లు ఉన్నారు. ఈ ప్రచారం ద్వారా సమీకరించిన నిధులను హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో అక్షయ పాత్ర చేపట్టినటువంటి పేద వర్గాలకు భోజనం అందించే కార్యక్రమానికి వెచ్చించనున్నారు.
అక్షయపాత్ర, సిఎంఒ, సందీప్ తల్వార్ క్రౌడ్ ఫండింగ్‌పై మాట్లాడుతూ, ‘‘చిరెక్ ఇంటర్నేషనల్ విద్యార్దులు,స్కూల్ మేనేజ్‌మెంట్ నుండి మాకు అందిన మద్దతుకు మేము చాలా ఆనందించాము. ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రచారం పేదలపై నేటితరానికి ఉన్న సానుభూతికి ఒక నిదర్శనం. ‘ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు’ అనే మా ప్రచార నినాదానికి ఇది మద్దతు తెలుపుతుంది. సమాజానికి సేవ చేయడానికి పూర్తిగా అంకితమైన అక్షయపాత్రకు ఈ విద్యార్దులు ముందుకు వచ్చి క్రౌడ్‌ఫండిరగ్ ద్వారా సహాయపడినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.’’కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో, భారతదేశవ్యాప్తంగా భోజనం మరియు కిరణా వస్తు సామాగ్రిని అందించడం ద్వారా నిరాశ్రయలు,వలస జీవుల మద్దతుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. యాదృచ్చికంగా, అక్షయ పాత్ర, అనుబంధ ఫౌండేషన్లు గత నాలుగు నెలలుగా సమాజంలోని నిరుపేద వర్గాలకు చెందిన సుమారు 70 మిలియన్ల మందికి భోజన సదుపాయాన్ని అందించాయి.
ఫ్యూయల్‌డ్రీమ్.కామ్, వ్యవస్థాపకుడు, రంగనాథ్ తోట మాట్లాడుతూ, ‘‘మేము స్కూళ్లలో క్రౌడ్ ఫండింగ్ లైఫ్ స్కిల్స్‌ను బోధిస్తాము. స్టోరీటెల్లింగ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, సామాజిక ప్రభావంపై వినియోగదారు ప్రవర్తన వంటి వాటి ద్వారా విద్యార్దులు నైపుణ్యాలు నేర్చుకోగలుగుతారు. ఒకసారి నేర్చుకున్న తరువాత వారు గొప్ప ప్రభావం చూపగలిగే సాధనాలుగా మారుతారు. ఒక గొప్ప మార్పును తీసుకురాగలవారమనే నమ్మకంతో వారు ఎదుగుతారు. ఈ ప్రచారంలో సానుభూతిప్రభావంనిజంగాఅసాధారణమైనది.మహమ్మారి సమయంలో అక్షయ పాత్రకు గ్లాండ్ ఫార్మా, బికెటి, బయోకాన్, డ్యూయిష్ బ్యాంక్, అమెజాన్, బర్కలీస్, అడోబ్,ఎమ్‌యుఎఫ్‌జి బ్యాంకు మరియు ఇంకా అనేక ఇతర ప్రముఖ కార్పోరేట్ సంస్థల దాతల నుండి అద్బుతమైన మద్దతు లభించింది.
అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి:అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది భారతదేశంలోని బెంగుళూర్‌లో ప్రధాన కార్యాయం కలిగిన ఒక లాభాపేక్షలేనటువంటి సంస్థ. ఇది దేశంలో ఆకలి,పోషకాహార లోపం వంటి సమస్యను పరిష్కరించడంలో కృషి చేస్తున్నది. ప్రభుత్వ,ప్రభుత్వ సహాయం (ఎయిడెడ్) అందుకుంటున్న పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ద్వారా, అక్షయ పాత్ర ఆకలితో పోరాడా లని,అదే సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకురావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. 2000వ సంవత్సరం నుండి, అక్షయ పాత్ర పాఠశాల ప్రతి పనిదినంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు చేరవేసేందుకు విస్త్రృతంగా కృషి చేస్తున్నది. మిలియన్ల మంది చిన్నారుల ఆకలి తీర్చడానికి ఫౌండేషన్ నిరంతరం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నది. అక్షయపాత్ర ఫౌండేషన్ యొక్క అత్యాధునిక కిచెనులు ఒక అధ్యయన అంశంగా మారాయి, ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు వాటిని చూసేందుకు ఆసక్తిని కనపరుస్తున్నారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వా భాగస్వామ్యంతో,అనేక మంది దాతలు, శ్రేయోభిలాషుల మద్దతుతో అక్షయ పాత్ర కేవలం 1,500 మంది పాఠశాల విద్యార్దులకు సేవలు అందించడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది, ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద (లాభాపేక్ష లేనటువంటి) సంస్థగా అవతరించింది. భారతదేశంలోని 12 రాష్ట్రాలో మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 19,039 పాఠశాలల్లోని 1.8 మిలియన్ల మంది పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నది. మరిన్ని వివరాల కోసం దయచేసి లాగిన్ అవ్వండి : www.akshayapatra.org
ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ గురించి :సృజనాత్మక ఆలోచను, మంచి పనలు, దాతృత్వ సంస్థల కోసం నిధులను సమీకరించడానికి మరియు ఇండియా, ఆఫ్రికా మరియు ఇతర ఆగ్నేయాసియాలోని దేశాలకు చెందిన 2.2 బిలియన్ల ప్రజలను ప్రభావితం చేసే లక్ష్యంతో పనిచేసే వ్యక్తులు మరియు సంస్తల కోసం ఒక క్రౌడ్ ఫండిరగ్ మార్కెట్‌గా ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ ఉన్నది. 2016 ఏప్రిల్ మధ్యలో ఈ వేదిక ఏర్పాటు అయ్యింది, ఇప్పటివరకు 500 ప్రచారాల ద్వారా 37 కోట్ల రూపాయలను సమీకరించింది. బెంగుళూర్‌లో దీని ప్రధాన కేంద్రం ఉన్నది. రంగనాథ్ తోట ఆలోచనల ప్రతిరూపమే ఫ్యూయల్‌డ్రీమ్.కామ్. సృజనాత్మక ఆలోచలను సామాజిక సమస్యలు మరియు ఇతర కార్యకలాపాల కోసం ప్రజలు నిధులు సమకూర్చి అందించడంపై ఆయన బృందం దృష్టి పెడుతుంది. మంచి పనికి నిధుల సేకరణకు ప్రచారం కావాలని కోరుకునే వ్యక్తులకు మరియు దాతృత్వం కలిగిన వారిని ఫ్యూయల్‌డ్రీమ్.కామ్ కలుపుతుంది.