Sat. Jul 27th, 2024

పాత పీసీలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కారణంగా దక్షిణ భారతదేశంలోని ఎస్‌ఎంబీలు సెక్యూరిటీ ఉల్లంఘనలు చూశాయి

వ్యాపారాభివృద్ధిని పెంచుకునేందుకు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు ఎస్ఎంబీలు విండోస్ 10 పీసీలకు మారాల్సిన అవసరం ఉంది.

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి9,త్రివేండ్రం:  నాలుగేళ్ల కంటే పాత పీసీలు, పాత ఆపరేటింగ్ సిస్టిమ్స్ తో దక్షిణ భారతదేశంలో నడుస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపారాలు (ఎస్‌ఎంబీలు) కొత్త వాటితో పోల్చితే పనిప్రదేశంలో తక్కువ ఉత్పాదకతను చూస్తున్నాయి. పనిసామర్ధ్యమే కాదు పాత పీసీల కారణంగా వ్యాపార సంస్థలకు సెక్యూరిటీ సమస్యలతో పాటు ఐటీ ముప్పు కూడా పొంచి ఉంటుంది. డేటా రికవర్ చేయడం, వ్యాపారం నిరంతరాయంగా కొనసాగించడమన్నది దక్షిణాదిన ఎస్‌ఎంబీలు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు. గతేడాది దక్షిణ భారతదేశంలో నిర్వహించిన సర్వేలో తాము సెక్యూరిటీ ఉల్లంఘనను ఎదుర్కొన్నామని 25% సంస్థలు తెలిపాయి. దక్షిణ భారతదేశంలో దాదాపు 40% ఎస్‌ఎంబీలు కాలం చెల్లిన పీసీలు ఉపయోగిస్తున్నాయి, అందులో సగం కంటే ఎక్కువ (62%) వాటిల్లో పాత వెర్షన్ విండోస్. అంతర్జాతీయ ఎస్‌ఎంబీ ఐటీ మార్కెట్ రీసెర్చ్, విశ్లేషణ సంస్థ టెక్ ఐల్ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్1 తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 2,000 ఎస్‌ఎంబీల్లో ఈ అధ్యయనం నిర్వహించారు.

దక్షిణాదిన పనిప్రదేశంలో ఆధునిక వ్యూహాలను ఎంచుకున్న ఎస్‌ఎంబీలు వ్యాపారం, ఉద్యోగులపరంగా బహుళ ప్రయోజనాలు అందుకున్నాయి, ఇందులో అధిక ఉత్పాదకతతో పాటు చక్కని సెక్యూరిటీతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గాయి.

  • కొత్త పీసీల కారణంగా దక్షిణాదిన 89% ఎస్‌ఎంబీలు ఐటీ సామర్ధ్యంలో మెరుగుదలను చూశాయి.
  • కొత్త పీసీలతో క్లౌడ్, మొబిలిటీ సొల్యూషన్స్ వలన చక్కని ఉపయోగ అనుభూతి చూశామని 75% ఎస్‌ఎంబీలు అంగీకరించాయి.
  • ఆధునిక పీసీల వలన దక్షిణ భారతదేశంలోని ఎస్‌ఎంబీలు  మొత్తంగా నిర్వహణ ఖర్చుల్లో 91% Lతగ్గుదలను చూశాయి.
  • కొత్త పీసీల ద్వారా సెక్యూరిటీ పెరుగుదల, డేటా సంరక్షణలో 84% మెరుగదల ఛూశామని పుణేలోని ఎస్‌ఎంబీలు అంగీకరించాయి, అలాగే ఉద్యోగుల ఉత్పాదకతలో పెరుగుదల చూశామని 81% తెలిపాయి.

“చిన్న, పెద్ద వ్యాపారం ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం అనేది నిజమైన ప్రయోజనకారిగా ఉంటుంది, ఐటీ పెట్టుబడులతో ప్రస్తుత, భవిష్యత్ ప్రగతి ఉంటుంది. ఆ విలువను ఎస్‌ఎంబీలు గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎస్‌ఎంబీల్లో 100 మిలియన్ కంటే ఎక్కువ మంది పనిచేస్తూ భారతీయ ఆర్థిక ప్రగతికి తమ వంతు వాటాను అందిస్తున్నారు. భారతదేశంలో ఎస్‌ఎంబీలతో కలిసి పనిచేసి ఈ పోటీ మార్కెట్‌లో అవి తమ లక్ష్యాలను సాధించాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది” అని వెల్లడించారు మైక్రోసాఫ్ట్ ఇండియా డివైజెస్, గ్రూప్ డైరెక్టర్ ఫర్హానా హక్._

అందిపుచ్చుకునే అంతరాన్ని తగ్గించడం

ఈ అధ్యయనం ప్రకారం, ఎస్‌ఎంబీలుతన వ్యాపార విధుల్లో కొత్త మౌలిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో జాప్యం చోటు చేసుకోవడానికి అవి తమకు సరిపోవనే భావనతో పాటు కొత్త పీసీల సమర్థత గురించి తెలియకపోవడం కారణాలుగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో సర్వే చేసిన ఎస్‌ఎంబీల్లో మూడొంతలు (75%) తమ దగ్గర పీసీ రీఫ్రెష్ విధానం లేదని, దాని గురించి తామేమి ఆలోచించడం లేదని కూడా చెప్పాయి.వ్యూహాత్మక పీసీ రీఫ్రెష్ విధానం లేకపోవడం వలన దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. దక్షిణాదిన ఎస్‌ఎంబీలు కొత్తవాటితో పోల్చితే పాత పీసీలను దాదాపు నాలుగుసార్లు రిపేర్ చేయించారు. దీని వలన 96 గంటల ఉత్పాదక సమయం నష్టపోయింది.

వ్యాపార లక్ష్యాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఎస్‌ఎంబీలు తమ పాత పీసీలను రీఫ్రెష్ చేసుకోవచ్చు, దాని ద్వారా సెక్యూరిటీ పాచెస్ పొందడంతో పాటు గరిష్టస్థాయిలో ఉపయోగం కోసం నిరంతరం ఓఎస్ అప్‌డేట్స్ కూడా అందుతాయి. విండోస్‌ 10 ద్వారా యాప్‌ కంపాటబిలిటీ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇది యాప్ విషయంలో విండోస్ టూ డేట్ వెర్షన్, ఇందులో డేటా డయాగ్నస్టిక్స్, ట్రబుల్ షూటింగ్, లూపింగ్ ఫీడ్ బ్యాక్ సైకిల్స్ కోసం యాప్ టెలిమెట్రి, ఐఎస్‌వీ భాగస్వామ్యం ఉంది. విండోస్ 7 సపోర్టు నిలిచిపోతున్న కారణంగా ఎస్‌ఎంబీలు కొత్త పీసీలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ వైపు మళ్లాలి. విండోస్ 7తో నడుస్తున్నపీసీలకు ఇక నుంచి సెక్యూరిటీ అప్‌ డేట్స్ అందవు. ఇందులో కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్, నాన్ సెక్యూరిటీ హాట్ ఫిక్సెస్, ఫ్రీ లేదా పెయిడ్ అసిస్టెడ్ సపోర్టు ఆప్షన్స్, ఆన్ టెక్నికల్ కంటెంట్ అప్ డేట్స్ వంటివి ఏవి ఇక విండోస్ 7 పీసీలకు అందవు.