365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్3,నేషనల్,2020: లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులు ఇంటి నుంచి బయటకు రాకుండానే వారికి కావాల్సిన నిత్యా వసర వస్తువులు అందించడానికి రెండు ప్రముఖ సంస్థలు చేతులు కలిపాయి. పిజ్జా డెలివరీ బ్రాండ్ డోమినాస్ పిజ్జా, ప్యాకేజ్డ్ ఫుడ్ సంస్థల్లో ఒకటైన ఐటీసీ ఫుడ్స్ భాగస్వామ్యంతో ‘డోమినోస్ ఎసెన్షియల్స్’ పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించాయి. నాణ్యమైన ప్యాకేజ్డ్ బ్రాండ్ ఐటీసీ ఫుడ్స్ తో పాటు,ఇతర నిత్యావసరాలను ఆర్డర్ చేయడంలో సహాయపడేందుకు డోమినోస్ డెలివరీ సేవలను వినియోగించుకోనున్నారు. గోధుమపిండి , కారంపొడి, మెంతులపొడి, పసుపులతో సహా మసాలాలు కాంబో ప్యాక్ గా డోమినోస్ యాప్ ద్వారా అందించనున్నారు.
ఈ సేవలు ఇప్పటికే బెంగళూరులో ప్రారంభ మయ్యాయి. హైదరాబాద్, నోయిడా, ముం బై, కోల్ కతా, చెన్నై ల్లోనూ మరికొద్ది రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను పొందేందుకు వినియోగదారులు డోమినోస్ యాప్ తాజా వెర్షన్ ను వినియోగించి, డోమినోస్ ఎసెన్షియల్స్ సెక్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా లావాదేవీలు జరిపేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు.