Mon. Oct 7th, 2024
"ninne pellaadutha " second lyrical song released

365తెలుగుడాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 21, 2020: గతంలో నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం సూపర్ హిట్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఇప్పుడిదే టైటిల్‌తో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు రకుల్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘కింగ్ అక్కినేని నాగార్జున‌గారి సినిమా టైటిల్‌తో వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా చిత్ర టైటిల్‌ను కూడా ఆయనే విడుదల చేసి, మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. అమన్, సిద్ధిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ తదితరులు నటించారు. ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. షూటింగ్‌కు సంబంధించి చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఇంతకు ముందు విడుదల చేసిన తొలి లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర రెండో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశాము. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా, చిన్మయి ఆలపించారు.

‘నిన్నే పెళ్లాడతా’ రెండో లిరికల్ సాంగ్ విడుదల
‘నిన్నే పెళ్లాడతా’ రెండో లిరికల్ సాంగ్ విడుదల
‘నిన్నే పెళ్లాడతా’ రెండో లిరికల్ సాంగ్ విడుదల

నటి రకుల్ ప్రీత్ సింగ్ మా టీమ్‌కు శుభాకాంక్షలు తెలపడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వైకుంఠ బోను చాలా చక్కగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది..’’ అని తెలిపారు. అమన్, సిద్ధిక, సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత్, ఎడిటర్: అనకాల లోకేష్, ఫైట్స్: రామకృష్ణ, సహ నిర్మాత: సాయికిరణ్ కొనేరి, నిర్మాతలు: బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు; కథ- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వైకుంఠ బోను.

error: Content is protected !!