365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16, 2020: ప్రీమియం బ్రాండెడ్ లూబ్రికెంట్స్ యొక్క ప్రపంచవ్యాప్త అగ్రగామి సరఫరాదారు, అదే విధంగా ఆటోమోటివ్ సర్వీసెస్ సంస్థ అయిన వాల్వోలైన్ కమిన్స్ ప్రై.లి. ఎప్పుడూ వినూత్నతలో అగ్ర గామిగా ఉంటూ వచ్చింది మరియు ఈ విభాగంలో విశ్వసనీయ సంస్థగా పేరొందింది. ఈ బ్రాండ్ చేపట్టిన ఈ నూతన ప్రచారం, ఇంజిన్ సామర్థ్యానికి ఎల్లవేళలా హామీ ఇచ్చే అధునాతన ఇంజిన్ ఆయిల్ గా వాల్వో లైన్ ను ప్రముఖంగా చాటి చెబుతుంది. వాల్వో లైన్ ప్రచారకర్త, తన విజయాలతో, వ్యక్తిత్వంతో దేశానికి పేరు తెచ్చిన ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇందులో నటించారు.
ఈ క్యాంపెయిన్ భావన లియో బర్నెట్ చే రూపొందించబడి, అభివృద్ధి చేయబడింది. టీవీసీ రూపంలో ఇది విడుదల కానుంది. ‘ఇంజిన్ కె దివానే’ సందేశాన్ని అందిస్తూ, డిజిటల్ మీడియాలో ఇది విడుదల కా నుంది. ఈ క్యాంపెయిన్ ప్రధానంగా, విరాట్ కోహ్లి కూడా భాగంగా ఉన్న నూతన తరం వాహనదారుల భాషలో సంభాషణకు ప్రాధాన్యం ఇస్తుంది. కారుకు వాల్వోలైన్ ఇంజిన్ ఆయిల్ నే ఎంచుకోవాలని, ఎందుకంటే, ఈ బ్రాండ్ వినియోగదారు అత్యున్నత స్థాయి అనుభూతికి హామీ ఇస్తుందని ఈ ఫిల్మ్ చాటి చెబుతుంది.
మీ కార్ల యొక్క అత్యంత విశ్వసనీయ నిపుణులు చెప్పే మాట అనే చిన్న అంశాన్ని ఈ ఫిల్మ్ ఎంతో అందంగా చాటిచెప్పింది. తాము చేసే పని పట్ల మక్కువ మాత్రమే గాకుండా వాహన భాగాలతో భావోద్వేగపరమైన అనుబంధం కలిగిన మెకానిక్స్ వాల్వోలైన్ బ్రాండ్ పై పూర్తి విశ్వాసం కలిగిఉంటారు. ఎందుకంటే నిజంగా వారు ‘ఇంజిన్ కె దివానే’. విరాట్ కోహ్లి తన అనుభవాలను పంచుకోవడాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. వాల్వోలైన్ 150 ఏళ్ళకు పైగా వారసత్వాన్ని కలిగిఉన్న కారణంగా తాను ఈ బ్రాండ్ ను విశ్వసిస్తున్నట్లుగా విరాట్ కోహ్లి చె బుతారు. ఈ బ్రాండ్ నిరంతరాయంగా సంచలనాత్మక వినూత్నతలతో లూబ్రికెంట్స్ ను పునరావి ష్కరిస్తున్నది, భారతీయ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వాటిని కస్టమైజ్ చేస్తున్నది.
వాల్వో లైన్ కమిన్స్ చే ప్రదర్శించబడిన ఈ ఉత్పాదన సులభంగా పోయగలిగే ప్యాకేజింగ్ తో యాంటీ గ్లగ్ సాం కేతికతతో లభిస్తుంది. ఇది ఆయిల్ పోసే ప్రతిసారి కూడా శుభ్రంగా పోసేందుకు హామీ ఇస్తుంది. ఈ బ్రాండ్ ఎప్పు డూ ఏళ్ళుగా తాను సాధించిన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది మరియు ఉత్కృష్టతతో ఉండే ఉత్పత్తులను తయారుచేస్తుంది.
ఈ సందర్భంగా వాల్వోలైన్ కమిన్స్ ప్రై.లి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సందీప్ కాలియా మాట్లాడుతూ, “ఈ క్యాంపెయిన్ ద్వారా మేము ప్రగతిశీలక, బాధ్యతాయుత మరియు సాంకేతికంగా అవగాహన కలిగిన వాహన దారులతో పటిష్ఠ అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తున్నాం. ఇంజిన్ యొక్క పనితీరును సరిగా నిర్వ హించడంలో లూబ్రికెంట్స్ ఎంతముఖ్యమనే అంశంపై వినియోగదారుల్లో చైతన్యం కలిగించడంపై మా క్యాంపెయి న్ దృష్టి పెట్టింది. మా లక్ష్యిత వినియోగదారుల భాషలో మా ఉత్పాదన విశిష్టతలను చెప్పేందుకు మేము ప్రయత్నించాం. విరాట్ కోహ్లీ సరిగ్గా సరిపోయారు. వాల్వోలైన్ ను విశ్వసించడం అనే క్యాంపెయిన్ సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఒక కుతూహల వాహనదారుగా ఆయన ఇమేజ్ మాకు సహాయపడింది. తమ ఇంజిన్ కు అత్యుత్తమమైన దాన్ని కోరుకునే వారు ప్రాధాన్యమిచ్చే బ్రాండ్ ఇది” అని అన్నారు.ఈ క్యాంపెయిన్ గురించి ప్రచారకర్త విరాట్ కోహ్లి మాట్లాడుతూ, “ఇంజిన్ ఆయిల్ విభాగంలో విశ్వసనీయ బ్రాండ్ వాల్వో లైన్. దానిలో నాకు నచ్చింది వినూత్నత కోసం నిరంతర తపన. తమ విభాగంలో విజేతగా నిలిచిన ఈ కంపెనీతో అను బంధం నాకెంతో ఆనందదాయకం” అని అన్నారు.
నూతన టీవీసీ గురించి లియో బన్నెట్ క్రియేటివ్ డైరెక్టర్ అర్జున గౌర్ మాట్లాడుతూ, “తమ వాహనాల్లోకి పోసే ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ ఏంటో ఎంతో మందికి తెలియకపోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా వారు తమ మెకానిక్ లు చెప్పింది విశ్వసిస్తారు. ఈ విభాగంలో మరింత ప్రమేయాన్ని కల్పించడం ‘ఇంజిన్ కె దివానే’ లక్ష్యం. ఇంజిన్లతో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతుంటారు, వాల్వో లైన్ ను ఎంచుకునే మెకానిక్ లేదా కుతూహల వాహనదారు ఈ బ్రాండ్ ను విశ్వసించాల్సిందిగా వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తారనే భావన ఆధారంగా ఈ టీవీసీ రూపుదిద్దుకుంది. లూబ్రికెంట్ రంగంలో పటిష్ఠ వారసత్వాన్ని కలిగిన వాల్వోలైన్ వంటి బ్రాండ్ తో కలసి పని చేయడం ఎంతో ఆనందదాయక అనుభూతి. వినోదంతో కూడిన సందేశాన్ని అందించడం ఒక బ్రాండ్ కు ఎంతో సాహసమే” అని అన్నారు. You can view the campaign and TVC link below:-https://www.youtube.com/watch?v=DmKJi8KzYMM&feature=youtu.be