Sat. May 25th, 2024

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, జనవరి 12, హైదరాబాద్: రనౌత్సూపర్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా అశ్వినీ అయ్యర్ తివారీ డైరెక్ట్ చేసిన సినిమా ‘పంగా’. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించారు. జనవరి 24న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోమీడియాతో కంగన, అశ్విని సమావేశమయ్యారు

-కంగనా రనౌత్’పంగా’లో మీ పాతేమిటి?

ఒక మిడిల్ క్లాస్ విమన్
గా అందులోనూ బిడ్డల తల్లిగా నటించా.  తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది. మహిళ సాధికారత  కోసం చాలా సినిమాల్లో నటించాను.. కానీ ‘మణికర్ణిక’ తరువాత ఈ సినిమాలో నేను ఓ తల్లిగా జీవించాను.

-డైరెక్టర్ అశ్వినితో పనిచెయ్యడం ఎలా అనిపించింది?

అశ్విని మంచి డైరెక్టర్. నా గురించి తనకు చాలా మంది అనేక విషయాలు చెప్పినా వాటిని  అశ్విని ఎప్పుడు పట్టించుకోలేదు. వర్క్పై మంచి ఫోకస్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. నేను చాలా మందితో వరుసగా సినిమాలు చేశాను. కంగనాతో పని చేయడం కష్టం అని మాట్లాడిన వారికి అశ్విని  లాంటి వారే సమాధానం చెప్తున్నారు.

-ఈ కథలో మీకు నచ్చిన విషయమేమిటి?

ఇందులో నాది నేషనల్ లెవల్ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆ ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర. అశ్విని స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టరైజేషన్, అందులోని కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చాయి. జనరల్గా  సెట్ కి  వెళ్లే ముందే నేను సీన్ గురించి తెలుసుకుంటాను. కానీ ‘పంగా’ సమయం లో నా పరిస్థితులను అర్ధం చేసుకుని.. నాకు ప్రతి విషయాన్ని అశ్విని వివరంగా చెప్పేవారు.

ఇప్పుడు జయలలిత బయోపిక్ చేస్తున్నారు కదా.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మీ అభిప్రాయమేమిటి?

అంతకుముందు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తూ, హైదరాబాద్, చెన్నై తిరుగుతూ నేను పూర్తి సౌత్ ఇండియన్ గా మారిపోయా. సౌత్ ఇండియాలో గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్ నాకు బాగా నచ్చింది.


అశ్విని అయ్యర్ సమాజంలో మహిళా సాధికారికత ఎలా ఉందని అనుకుంటున్నారు?మన సమాజంలో మహిళ సాధికారత గురించి చర్చిస్తున్నాం కానీ  వాటి అమలు అంతగా లేదు.ఇంట్లో భర్త రోల్ ఎలా ఉండాలంటారు?

ఈ సినిమాలో కంగన పేరు జయా నిగం. ప్రతి ఇంట్లో ఒక జయ వుంది. మగవాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లో ప్రతి విషయం నచ్చుతుంది. ఒకసారి పెళ్లై పిల్లలు పుట్టాక మాత్రం మహిళకు సంబంధించిన ప్రతి విషయం మారి పోతుంది. కానీ ఇవాళ్టి రోజున పరిస్థితి అది కాదు..  పిల్లల పెంపకం ఇద్దరి బాధ్యత. భర్తే భార్యకి సపోర్ట్ చేయకపోతే ఇంక ఎవరు చేస్తారు.

ఈ సినిమాతో ఆ సందేశం ఇద్దామనుకున్నారా?

కంగనా వంటి సూపర్ స్టార్ ద్వారా  మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పించడం బావుంటుంది. ఈ సినిమా ద్వారా కొంతమందైనా ఆలోచిస్తే, దీన్ని తీసిన ప్రయోజనం నెరవేరినట్లే. ఎందుకంటే దాదాపు 40 శాతం మహిళలు పిల్లలు పుట్టాక జాబ్ మానేస్తున్నారని గణాకాలు చెబుతున్నాయి.

కంగననే ఈ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారు?

కంగన ఎలాంటి నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంగనా లాంటి నటి మాత్రమే ఇలాంటి ఒక స్క్రిప్ట్ కి న్యాయం చేస్తారు అనిపించింది. ఆమెకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు  వెంటనే ఒప్పుకున్నారు. కబడ్డీ అనేది కామన్ మాన్ ఆట. అందుకే మేము కండల గురించి చెప్పలేదు. తల్లిగా, క్రీడాకారిణిగా జీవించే వాళ్లు కావాలని ఇందులో చెప్పాం.

ఆమెతో పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

ఈ సినిమా  కోసం దాదాపు 2 ఏళ్ళు పనిచేసాము. ఇప్పుడు మేము ఒక కుటుంబంలా మారిపోయాం. సెట్స్ పై తను పూర్తి ప్రొఫెషనల్. బయట మేం స్నేహితులమై పోయాం. నేను తనతో జీవిత కాలం సరిపోయే ఎమోషనల్ అగ్రిమెంట్  చేసుకున్నాను. యాక్టర్, డైరెక్టర్ మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఒక కుటుంబంలో ఎప్పుడు, ఎవరు కోప్పడకుండా ఉంటారా! ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.