Mon. May 20th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 2,హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. బాలీవుడ్ లో హిట్టయిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మెగాపవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు.

పవన్ ఇనుప మంచంపై కూర్చుని పుస్తకం చదువుకుంటున్న స్టిల్ అదిరింది. అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్నది ఈ చిత్రం. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పవన్ రెండేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయిందని సమాచారం.