Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, జనవరి 23,గురుగ్రామ్, భారతదేశం: భారతదేశపు అతి పెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్  ఆహారాన్ని పొందుపర్చడమే కాకుండా తయారీ కూడా చేసే  ప్రపంచపు మొదటి రిఫ్రిజిరేటర్ కర్డ్ మేస్ట్రోను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. శామ్ సంగ్ అందించే కొత్త శ్రేణి రిఫ్రిజిరేటర్లు మరింత స్టోరేజ్ స్థలాన్ని మాత్రమే కాకుండా తక్కువ శక్తిని వినియోగించే విధంగా రూపొందించబడిన  అర్థవంతమైన ‘మేక్ ఫర్ ఇండియా’ నవ్యతలను కేటాయిస్తాయి. 


తరాల తరబడి, పెరుగు వివిధ ప్రాంతాలలో వివిధ రకాల భారతీయ వంటకాల్లో ఒక ప్రధానమైన ఆహారపు జోడీగా ఉంది; కానీ పెరుగు తయారీ మాత్రం కష్టమైన పని. కర్డ్ మేస్ట్రో™ శామ్ సంగ్ వారి మేక్ ఫర్ ఇండియా నవ్యత.  ఎన్నో ఏళ్లుగా భారతదేశపు వినియోగదారుల అవసరాలను కంపెనీ  ఎంతో అర్థం చేసుకున్న తరువాత  వచ్చిన ఉత్పత్తి మరియు రోజూ పెరుగు తయారీ కలిగే సమస్యలను పరిష్కరించింది. శామ్ సంగ్ వారి కర్డ్ మేస్ట్రో™లో పెరుగు తయారీ ప్రక్రియను  నేషనల్ డైయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ డీఆర్ఐ) పరీక్షించి  సిఫారసు చేసింది. భారతదేశపు నంబర్ 1 రిఫ్రిజిరేటర్ బ్రాండ్ శామ్ సంగ్ మీరు ఉల్లిపాయలు, బంగాళదుంపలను భద్రపరిచే  భారతదేశపు మొదటి ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ ను బేస్ స్టాండ్ డ్రాయర్ తో పరిచయం చేసింది. కొత్త 2020 స్టార్ రేటింగ్స్ పై ఆధారపడిన  భారతదేశపు మొదటి ఫైవ్-స్టార్ డైరక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ క్రమాన్ని కూడా పరిచయం చేసింది. ఈ సరికొత్త అర్థవంతమైన నవ్యతలు వినియోగదారుల ప్రతిస్పందన మరియు వారి అభిప్రాయాలు ఆధారంగా  శామ్ సంగ్  ఇండియా వారి ‘మేక్ ఫర్ ఇండియా’ చొరవలో భాగంగా ఉన్నాయి.


“ప్రజల జీవితాలను మార్చే అర్థవంతమైన నవ్యతల్ని శామ్ సంగ్ లో మేము నమ్ముతాము. సౌకర్యం, భద్రపర్చుకోవడానికి తగిన స్థలం మరియు శక్తి సామర్థ్యాలు వంటి ముఖ్యమైన ప్రత్యేకతలను వినియోగదారులు ఒక రిఫ్రిజిరేటర్ లో గమనిస్తారు మరియు మా 2020 శ్రేణి ఈ అవసరాలు అన్నింటినీ పరిష్కరిస్తుంది. ఈ కొత్త  రిఫ్రిజిరేటర్ల శ్రేణి రిఫ్రిజిరేటర్ తరగతిలో మా మార్కెట్ నాయకత్వాన్ని మరింత శక్తివంతం చేస్తుందని మేము ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాము” అని శామ్ సంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు. 
2020 రిఫ్రిజిరేటర్ క్రమంకర్డ్ మేస్ట్రో™: ప్రతీరోజు ఇంటికి నవ్యతకర్డ్ మేస్ట్రో™ రిఫ్రిజిరేటర్ భారతదేశంలో సంప్రదాయబద్ధమైన రిఫ్రిజిరేటర్ దృశ్యాన్ని ఆహారాన్ని భద్రపర్చడం మరియు ఆహారాన్ని పొందుపర్చడానికి మించి మార్చేసింది. కర్డ్ మేస్ట్రో™ భారతదేశపు ఇళ్లల్లో ఒక ప్రధానమైన ఆహార పదార్థంగా ఉన్న , నైపుణ్యంతో కూడిన కష్టమైన, సమయంతో కూడిన,  పెరుగు తోడు పెట్టే సమస్యల్ని పరిష్కరించింది. కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ మీకు మీ విలువైన కుటుంబపు సమయానికి మధ్యలో ఏదీ అడ్డు రాకుండా నిర్థారిస్తుంది; అయిదు నుండి ఆరు గంటల్లో – మృదువైన పెరుగు కోసం అయిదు గంటలు, గడ్డ పెరుగు కోసం ఆరు గంటల పెరుగు తయారీ సదుపాయం కల్పిస్తుంది. పెరుగు తోడు పెట్టడానికి మేన్యువల్ గా  పాలను మరిగించి చల్లార్చాలి మరియు  కొంచెం పెరుగు కలపాలి కానీ కర్డ్ మేస్ట్రో అత్యంత కీలకమైన పులియపెట్టడాన్ని (ఫెర్మంటేషన్) చేస్తుంది. ఇది పెరుగును పులియపెట్టడమే కాకుండా భద్రపరుస్తుంది కూడా. 
కర్డ్ మేస్ట్రో పెరుగును ప్రతీసారీ అదే చిక్కదనంతో తయారు చేస్తుంది వివిధ వాతావరణ పరిస్థితులలో పెరుగు తయారు చేసే ఇబ్బందిని నిర్మూలిస్తుంది. కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్స్ శామ్ సంగ్ వారి స్మార్ట్ కన్వర్టబుల్ 5 ఇన్ 1 ట్విన్ కూలింగ్ టెక్నాలజీతో లభిస్తున్నాయి మరియు 244లీ, 265లీ, 314 లీ , 336 లీ సామర్థ్యాలలో లభిస్తున్నాయి. స్మార్ట్ కన్వర్టబుల్ 5 ఇన్ 1 ట్విన్ కూలింగ్ రిఫ్రిజిరేటర్స్ అయిదు మోడ్స్ లో -నార్మల్, ఎక్స్ ట్రా షాపింగ్, వెకేషన్, సీజనల్,హోం అలోన్ లలో లభిస్తున్నాయి. కన్వర్షన్ మోడ్స్ వివిధ భద్రపరిచే అవసరాలకు పరిపూర్ణమైన పరిష్కారం మాత్రమే కాకుండా ప్రతీ మోడ్ శక్తి ని కూడా ఆదా చేస్తాయి.  ట్విన్ కూలింగ్ ప్లస్ నిజమైన స్వతంత్ర కూలింగ్ వ్యవస్థ. ఫ్రిడ్జ్ , ఫ్రీజర్ రెండిటిలో వేర్వేరుగా గాలి ప్రసారమవుతూ ఫ్రిడ్జ్ , ఫ్రీజర్ మధ్య ఆహారాల నుండి వచ్చే వాసనని నివారిస్తుంది. సమర్థవంతమైన చోటు, డిజైన్ టెక్నాలజీ: నవ్యత వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. 
బేస్ స్టాండ్ డ్రాయర్ తో ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్కొత్త క్రమం అదనపు సామర్థ్యం కోసం విలక్షణంగా రూపొందించబడింది. వినియోగదారులు ఇప్పుడు బేస్ స్టాండ్ డ్రాయర్ లో కుళ్లిపోని కూరగాయలను ఉంచవచ్చు. భారతదేశపు వినియోగదారులు ఇష్టపడే విశాలమైన చోటు (టాల్ బాయ్ డిజైన్) గల డిజైన్ ను ఈ డ్రాయర్ రిఫ్రిజిరేటర్ కు ఇస్తుంది. వివిధ డిజైన్లు ,నమూనాల అవసరాలను తీరుస్తూ, ఈ క్రమం ఉత్పత్తులకు అందమైన విలువను చేర్చే కొత్త డిజైన్ నమూనాలు పారడైజ్ బ్లూమ్, వేవ్ లలో లభిస్తోంది,253 లీ సామర్థ్యంలో లభిస్తోంది. సింగిల్ డోర్, డైరక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్శామ్ సంగ్ ఇటీవల 198 లీ సామర్థ్యంతో కొత్త 2020 శక్తి నియమాలకు అనుగుణంగా  భారతదేశపు మొదటి ఫైవ్-స్టార్ డైరక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ ను ప్రారంభించింది. ఎక్కువసేపు విద్యుత్తు కోతలకు పరిష్కారంగా, మోడల్ డిజిటల్ ఇన్వెర్టర్ టెక్నాలజీని కలిగి రిఫ్రిజిరేటర్ హోం ఇన్వెర్టర్ మరియు తగ్గిన విద్యుత్తు వినియోగంతో  సౌర శక్తి పై పని చేసేలా అవకాశం ఇస్తున్నాయి. కొత్త క్రమం స్టెబిలైజర్ రహితమైన పనులతో  కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ మరియు డిజిటల్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో లభిస్తోంది. 
‘మేక్ ఫర్ ఇండియా’ చొరవ క్రింద, 2020 క్రమం అదనపు స్థలం కోసం విలక్షణంగా రూపొందించబడింది మరియు భారతదేశపు మార్కెట్ లో మొట్ట మొదటి గారో హ్యాండిల్ తో పాటు ఆధునికమైన హారిజాంటల్ కర్వ్ డోర్ డిజైన్ ను కూడా కలిగి ఉంది. 2020 క్రమం పారడైజ్ బ్లూమ్, న్యూ కమీల్లియా, వేవ్ అండ్ ప్రీమియం స్టీల్ వంటి కొత్త డిజైన్ నమూనాలతో లభిస్తూ ఉత్పత్తికి అందాన్ని చేరుస్తున్నాయి.
ధర, ఆఫర్లు మరియు లభ్యతశామ్ సంగ్ వారి సరికొత్త 2020 రిఫ్రిజిరేటర్ క్రమం అన్ని రీటైల్ దుకాణాలలో మరియు 2020 జనవరిలో ఆరంభమయ్యే శామ్ సంగ్ దుకాణంలో లభిస్తాయి మరియు ఇవి కొత్త 198 లీ డైరక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఐఎన్ఆర్ 17,990 నుండి స్మార్ట్ కన్వర్టిబుల్ 5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్ కోసం ఐఎన్ఆర్ 45, 990కి లభిస్తున్నాయి. కర్డ్ మేస్ట్రో™ మోడల్స్ ఐఎన్ఆర్ 30,990 మరియు ఐఎన్ఆర్ 45,990 ధరల మధ్య లభిస్తున్నాయి.
శామ్¬సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్¬ను గురించిశామ్¬సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్-ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్¬వర్క్ సిస్టమ్¬లు , మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ , ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్¬సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్¬సంగ్ ఇండియా  http://news.samsung.com/in వద్ద సందర్శించండి.  https://news.samsung.com/bharat @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్¬ పై అనుసరించవచ్చు.

error: Content is protected !!