Sun. Sep 8th, 2024

365తెలుగుడాట్,కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి11,హైదరాబాద్: వర్షమొస్తుంటే పక్షులన్నీ గూట్లోకి వెళ్లి దాక్కుంటాయి. కానీ.. గద్ద మాత్రం గూట్లోకి వెళ్లి దాచుకోదు. వానకు అందనంత దూరాలకు వెళ్తూ మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. ఆంగోత్ తుకారాంను చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎవరెస్ట్ ఎక్కడమే తుకారాం లక్ష్యం పెట్టుకున్న తుకారాం ఇప్పుడు.. దానిని సాధించిన తర్వాత కూడా పర్వతాల వెంట పరుగులు తీస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలోనే అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహంచి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలోని కోస్కియోజి పర్వతం 2,228 మీటర్ల ఎత్తు ఉంటుంది. పర్వతారోహకులకు దీనిని అధిరోహించాలనే లక్ష్యం ఉంటుంది. ఈ పర్వతాన్ని హోలీ రోజున అధిరోహించాడు తుకారం. పర్వతం ఎక్కి.. జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ భారతమాతకు వందనం చేశాడు. తెలంగాణ గిరిజన యువకుడు సాధించిన ఈ రికార్డుకు ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ నెల 12న తుకారాం ఇండియా రాబోతున్నాడు. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయరస్వామి అతనికి అన్ని విధాల సహాయ.. సహకారాలు అందించారు.
ఖండాలు దాటిన తండా ఖ్యాతితుకారాంది ఎప్పటికీ తరగని సాహసం. ఎక్కడా తొణకని ధైర్యం. గొప్ప వ్యక్తుల అడుగుజాడల్లో నడిస్తే లక్ష్యం ఎప్పటికైనా నెరవేరుతుందనేది తుకారాం ఆలోచన. అందుకే నిద్ర లేచింది మొదలు.. పడుకునేదాకా మౌంటెనీరింగ్ గురించి తప్పితే వేరే ఏ విషయాలు మాట్లాడడు. శోధన.. సాధన.. ఆచరణతోనే అతని రోజు పూర్తవుతుంది. తుకారాం గిరిజన కుటుంబంలో పుట్టాడు. కనీస మౌలిక వసతుల్లేని గిరిజన తండాలో పెరిగాడు. తల్లిదండ్రులు కూలీ పనిచేసి చదివించగా.. వాళ్ల కష్టం వృథాగా పోవద్దనీ.. వాళ్ల శ్రమకు ఫలితాన్ని ఎవరెస్టంత ఎత్తులో చూపిస్తానని అంటున్నాడు తుకారాం. తండాల ఖ్యాతి ఖండాలు దాటిస్తూ అత్యంత ఎత్తయిన పర్వతాలన్నీ ఎక్కుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.
సందేశమూ ఇస్తాడు;పర్వతాలను అధిరోహించడమే కాదు.. వాటి ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇస్తాడు తుకారం. హెల్మెట్‌లు పెట్టుకొని వాహనాలు నడపాలనీ.. వాతావరణాన్ని పరిరక్షించాలనీ.. ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరగొద్దనీ.. ఆత్మహత్యలు వద్దని ఇలా పర్వతం ఎక్కిన ప్రతీసారి ఒక సందేశాన్ని ఇస్తుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జాతీయ పతాకం ఎగరవేసి తన దేశభక్తిని చాటుకున్నాడు. అంతేకాదు పర్వతంపైనే తోటి పర్వతారోహకులతో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్నాడు. ఎవరెస్టూ అయిపోయింది:ఇటివలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు (8,848మీటర్లు) శిఖరాన్ని అధిరోహించిన తుకారాం, యూరప్ ఖండంలోని రష్యా దేశంలోగల 18,510 ఫీట్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని ఆదివారం తన సాహస యాత్రతో అధిరోహించి ఔరా అనిపించాడు. పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న చందంగా పర్వతారోహణలో తుకారాం విజయపరంపర కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని సాహసయాత్రలకు సలాం చేస్తున్నారు.

ఎవరికైనా ఎవరెస్ట్ ఎక్కడమే లక్ష్యం.తుకారాం కూడా ఎవరెస్టే లక్ష్యంగా ఉండేది.కానీ అది సాధించాడు.అయినంత మాత్రాన ఖాళీగా కూర్చుంటాడా?ఎవరెస్ట్ తర్వాత.. ఏం చేయాలనే ఆలోచన అతనికీ వచ్చింది?ప్రపంచంలోని తొమ్మిది అత్యంత ఎత్తయిన పర్వాతాలు ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నా ఆత్మవిశ్వాసంతో తాజాగా కోస్కియోజి పర్వతాన్ని అధిరోహించి మరో రికార్డు సాధించాడు.
ఎవరెస్టూ అయిపోయింది: ఇటివలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు (8,848మీటర్లు) శిఖరాన్ని అధిరోహించిన తుకారాం, యూరప్ ఖండంలోని రష్యా దేశంలోగల 18,510 ఫీట్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని ఆదివారం తన సాహస యాత్రతో అధిరోహించి ఔరా అనిపించాడు. పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న చందంగా పర్వతారోహణలో తుకారాం విజయపరంపర కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని సాహసయాత్రలకు సలాం చేస్తున్నారు.
ఏడు ఖండాలు లక్ష్యం:ప్రపంచంలోని ఏడు ఖండాలలో అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడమే తుకారాం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే దక్షాణాఫ్రికాలోని కిలిమంజారో, ఆసియాలోని ఎవరెస్టు, యూరప్‌లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించిన తుకారాం ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కికా ఖండాలలో ఎత్తైన పర్వతాలను సైతం అధిరోహించడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే జూన్ 2,2016న హిమాచల్ ప్రదేశ్‌లోని నార్బూ(17,145 ఫీట్ల)పర్వతాన్ని 25మంది సభ్యులలో మెదటి స్థానాన్ని సాధించి బెస్టు మౌంటనీర్‌గా గుర్తింపును పొందాడు. జూన్ 2,2017న ఉత్తరాఖాండ్‌లోని రుదుగైరా(19,091ఫీట్ల) పర్వతాన్ని ఎక్కి హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించాడు. జూలై 2017స్టాక్ కాంగ్రీ(20,187 ఫీట్ల ) పర్వతం,2018 జూలైలో దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో(19,340ఫీట్లు) పర్వతాన్ని అధిరోహించాడు. మే 22న ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు(8,848మీటర్లు) శిఖరాన్ని అత్యంత సాహసంతో అధిరోహించి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ఎత్తైన ఎల్బ్రస్(18,510 ఫీట్ల) పర్వతాన్ని అధిరోహించి తల్లిదండ్రులతో పాటుగా రాష్ర్టానికి గుర్తింపును తీసుకొచ్చాడు. తాజాగా కోస్కియోజి పర్వతాన్ని అధిరోహించాడు. ఇక మిగిలి ఉన్నది నార్త్ అమెరికాలోని దెనాలి, అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మిగిలి ఉన్నాయి.
ఉత్తర కాశీలో శిక్షణ:గతంలో ఎవరెస్ట్ పర్వతం ఎక్కేందుకు జమ్మూ కశ్మీర్లో బీఎంసీ ద్వారా సర్టిఫికేట్ అందుకున్నాడు తుకారం. ఎవరెస్ట్ కోసం ఈ కోర్సు చేసినవారిలో దక్షిణభారతం నుంచి తొలి యువకుడు తుకారాం కావడం విశేషం. మంచులో శిక్షణ.. వెయిట్ రన్నింగ్.. పర్వతారోహణ సామర్థ్యాన్ని బట్టి తుకారాంకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బెస్ట్ టెక్నిక్ అవార్డు ఇచ్చింది కూడా. ఇక్కడ శిక్షణ పొందిన అనంతరం ఎవరెస్ట్ ఎక్కాలంటే మూడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించి ఉండాలి. తుకారాం ఈ అర్హత కూడా సాధించాడు. సమర్థ పర్వతారోహకులుగా ఎదిగేందుకు ప్రోత్సాహాన్నిచ్చే అడ్వెంచర్ క్లబ్ అతని ప్రతిభను గుర్తించింది. ఉత్తర కాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్.. జవహార్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో శిక్షణ పొంది ఒంటరిగా ఎవరెస్ట్ ఎక్కడానికి వెళుతున్న తెలంగాణ తొలి గిరిజన యువకుడిగా తుకారాం రికార్డు సృష్టించాడు.

స్టాక్ కాంగ్రీపై జయకేతనం:హిమాలయాల్లోని స్టాక్ శ్రేణిలో 20,580 అడుగుల ఎత్తున్న పర్వతం స్టాక్కాంగ్రి. పర్వతారోహణ వృత్తిగా.. అభిరుచిగా ఎక్కేవాళ్లకు ఇదే అత్యంత ఎత్తైన పర్వతం. ఒక్కోసారి అనుభవమున్నవాళ్లకూ ఈ పర్వతం ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్ని కల్పిస్తూ సవాలు విసురుతుంటుంది. చుట్టూ మంచు కప్పేసుకొని ఉంటుంది. శిఖరాలను చూస్తుంటే వాటిని మేఘాలు భస్మధూళితో అభిషేకిస్తున్నాయా అనిపించేలా ఉంటాయి. అలాంటి పర్వతాన్ని అవలీలగా 2017 జూలై 15వ తేదీన అధిరోహించాడు తుకారాం.
రుదుగైరాపై రెపరెపలు:మౌంట్ రుదుగైరా ఉత్తరాఖండ్లో ఉంది. ఇది ఎక్కాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జీవితం తలకిందులయ్యే పరిస్థితి. ఒకరకంగా ఇది జీవితంతో సాహసం. అలాంటిది తుకారాం రుదుగైరా ఎక్కి తెలంగాణ జెండాను రెపరెపలాడించాడు.2017 జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా పర్యాటక శాఖ సహకారంతో 8మంది బృందం రుదుగైరాను అధిరోహించేందుకు వెళ్లారు. వారిలో తుకారాం ఒక్కడే రుదుగైరా మొత్తం ఎక్కాడు. రుదుగైరా ఎత్తు 5,819 మీటర్లు. తుకారాం ప్రతిభకు మెచ్చినవారు ఏదో ఒక రకంగా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పలు స్వచ్ఛంద సంస్థలు.. సంఘాలు.. శ్రేయోభిలాషులు తుకారాంకు ఏదో ఒక రకంగా ప్రోత్సాహమందిస్తూ వచ్చారు.

నార్బుపై తెలంగాణ పతాక :2016 జూన్ 2న మనమంతా రాష్ర్టావిర్భావ సంబురాలు జరుపుకున్నాం. అదే రోజున హిమాచల్ప్రదేశ్లోని నార్బు పర్వతం అంచుల్లో ఉదయం 8.30 గంటలకు తెలంగాణ జెండాను రెపరెపలాడించింది ఓ పర్వతారోహక బృందం. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో నార్బో పర్వతాన్ని అధిరోహించిన ఆ బృందం ముఖ్యుల్లో తుకారాం ఒకడు. భూమికి 5,226 మీటర్ల ఎత్తులో ఉన్న నార్బో పర్వతారోహణ ప్రారంభించి రాత్రికల్లా ఫైనల్ సమ్మిట్లో పర్వత శిఖరానికి చేరుకున్నారు. కేవలం పర్వతాలు ఎక్కడాన్ని.. నదులు ఈదడాన్ని నేర్చుకోవడం ఈ కార్యక్రమాల లక్ష్యం కాదు. సమస్యల్ని అధిగమించేందుకు కావాల్సిన సాహసాన్ని, నాయకత్వ లక్షణాల్ని దేశ సమైక్యతా భావాన్ని ప్రకృతితో సహజీవనాన్ని పెంపొందించడం వీటి పరమార్థం అంటూ నార్బో నుంచి సందేశమిచ్చారు.

యంగెస్ట్ మౌంటెనీర్:2015 అక్టోబర్లో ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతారోహణకు సెలక్షన్స్ జరగ్గా నేపాల్, పోలాండ్, ఇండియాకు చెందిన పర్వతారోహణ ఆసక్తిపరులు ఈ సెలక్షన్స్‌కు హాజరయ్యారు. ఆబ్సికల్ రేస్.. క్రాస్ కంట్రీ.. స్పోరట్స్ క్లయింబింగ్లో గోల్ మెడల్ సాధించిన తుకారాం ఎంపికయ్యాడు. పర్వాతాలను ఎక్కాలనే కసి ఉన్న తుకారాం ఆసక్తిని పసిగట్టిన ఆర్మీ కెప్టెన్ సరోజ్బాల తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఫౌండర్ కోలా రంగారావుకు పరిచయం చేశారు.


యంగెస్ట్ మౌంటెనీర్
2015 అక్టోబర్లో ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతారోహణకు సెలక్షన్స్ జరగ్గా నేపాల్, పోలాండ్, ఇండియాకు చెందిన పర్వతారోహణ ఆసక్తిపరులు ఈ సెలక్షన్స్‌కు హాజరయ్యారు. ఆబ్సికల్ రేస్.. క్రాస్ కంట్రీ.. స్పోరట్స్ క్లయింబింగ్లో గోల్ మెడల్ సాధించిన తుకారాం ఎంపికయ్యాడు. పర్వాతాలను ఎక్కాలనే కసి ఉన్న తుకారాం ఆసక్తిని పసిగట్టిన ఆర్మీ కెప్టెన్ సరోజ్బాల తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఫౌండర్ కోలా రంగారావుకు పరిచయం చేశారు. ఫిట్నెస్ లెవల్ పరిశీలించి శిక్షణ ఇప్పించారు. ఆసక్తికి తగ్గట్టు శ్రమిస్తూ అడ్వెంచర్ క్లబ్ నుంచి మంచిమార్కులు కొట్టేశాడు తుకారాం. అలా ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు ఉత్తమ మౌంటెనీర్ వరకు తీసుకెళ్లింది. తాజాగా తుకారాం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ వారిచే తెలంగాణ యంగెస్ట్ మౌంటెనీర్గా పురస్కారం అందుకున్నాడు.

తండాలో పుట్టి
ఆంగోతు తుకారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తక్కళ్లపల్లి తండాకు చెందిన ఆంగోత్ రాందాసు, ఝుంకు దంపతులకు ఐదో సంతానం. తల్లిదండ్రులు తుకారాంతో పాటు ఇతర సంతానాన్ని కూలిపనులు చేసుకుంటూ పెంచుకుంటున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో తుకారాం చదివాడు. అప్పుడే ఎవరెస్టు శిఖరం ఎక్కాలని నిశ్చయించుకున్నాడు. ఆ తపనతో స్కౌట్ అండ్ గైడ్స్‌లో చేరి పలు రకాల శిక్షణ తీసుకున్నాడు. ఇబ్రహీం పట్నంలోని ప్రతిభా కళాశాలలో ఇంటర్ చదివాడు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాడు. ఇంటర్ చదువుతూనే మల్లకంభలో శిక్షణ తీసుకున్నాడు. పాఠశాల స్థాయిలోనే లంగ్డీ ఆటను ఎంచుకొని మంచి ప్రావీణ్యం సంపాదించాడు. అదే విధంగా మల్కుందా ఆటలో తుకారాం మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్సీ సీలో మంచి ప్రావీణ్యం పొంది బి.సర్టిఫికెట్ పొంద డమే గాక సీడీటీ ఆవార్డు అందుకున్నాడు. ఆయా క్రీడల్లో విశేష ప్రతిభ చాటి రాష్ట్ర, జాతీయ పత కాలను అందుకుని, పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఎన్సీసీ ద్వారానే ఉత్తర కాశీలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ మౌంటెనీరింగ్‌లో తుకారాం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.


యంగెస్ట్ మౌంటెనీర్
2015 అక్టోబర్లో ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతారోహణకు సెలక్షన్స్ జరగ్గా నేపాల్, పోలాండ్, ఇండియాకు చెందిన పర్వతారోహణ ఆసక్తిపరులు ఈ సెలక్షన్స్‌కు హాజరయ్యారు. ఆబ్సికల్ రేస్.. క్రాస్ కంట్రీ.. స్పోరట్స్ క్లయింబింగ్లో గోల్ మెడల్ సాధించిన తుకారాం ఎంపికయ్యాడు. పర్వాతాలను ఎక్కాలనే కసి ఉన్న తుకారాం ఆసక్తిని పసిగట్టిన ఆర్మీ కెప్టెన్ సరోజ్బాల తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఫౌండర్ కోలా రంగారావుకు పరిచయం చేశారు. ఫిట్నెస్ లెవల్ పరిశీలించి శిక్షణ ఇప్పించారు. ఆసక్తికి తగ్గట్టు శ్రమిస్తూ అడ్వెంచర్ క్లబ్ నుంచి మంచిమార్కులు కొట్టేశాడు తుకారాం. అలా ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు ఉత్తమ మౌంటెనీర్ వరకు తీసుకెళ్లింది. తాజాగా తుకారాం హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ వారిచే తెలంగాణ యంగెస్ట్ మౌంటెనీర్గా పురస్కారం అందుకున్నాడు.


error: Content is protected !!