365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 29,హైదరాబాద్: స్కై ఎస్ టెక్నో సొల్యూషన్స్ అధినేత,ప్రముఖ ఐటీ నిపుణులు సతీష్ ఎల్లంకి దంపతులను ఘనంగా సత్కరించారు. గురువారం రవీంద్రభారతిలో పద్మమోహన ఆర్ట్ థీయోటర్స్ ఆద్వర్యం లో సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ ఆర్ ఆర్ ఫార్చూన్ ఇన్ ఫ్రా సౌజన్యంతో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి పురస్కారాలు అందించారు. గత కొన్నేళ్ళుగా ఐ టి రంగంలో విలువైన సేవలందిస్తున్న స్కై ఎస్ టెక్నో సొల్యూషన్స్ అధినేత,ప్రముఖ ఐటీ నిపుణులు సతీష్ ఎల్లంకి దంపతులను “విశిష్ట దంపతులు పురస్కారం “తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం , అలీ తదితరులు పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=HBHhcJS8pBQ&feature=share&fbclid=IwAR3gaVY6HfO_ySgCv1LAqzxGsT3Gosv3vNNcTOZWg4vYw_uCA_CAqk0iOmU