365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 24,హైదరాబాద్, 2019: ఫిట్ నెస్, కలసిఉండే సందర్భాలను వేడుక చేసుకునే హెర్బాలైఫ్ న్యూట్రిషన్, ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ 2019 మూడో ఎడిషన్ కార్యక్రమానికి 1800 కు పైగా ఔత్సాహికులు హాజరయ్యారు.
అంతర్జాతీయ ప్రీమియర్ న్యూట్రిషన్ కంపెనీ అయిన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ నిర్వహించే ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ నేడిక్కడ హైదరాబాద్, కొండాపూర్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. రన్నింగ్, సైక్లింగ్ లకు సంబంధించిన వివిధ పోటీల్లో హైదరాబాద్ కు చెందిన ఔత్సాహికులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అవే గాకుండా వివిధ క్రీడలు, ఫిట్ నెస్ కార్యక్రమాలు, సవాళ్ళు, పోటీలు, వినోద కార్యక్రమాలు, చర్చలు జరిగాయి. ఆయా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు సానుకూల ఎంపికలు చేసుకునేందుకు వీలుగా తమ మనస్సును, శరీరాన్ని, ఆత్మను నూతనోత్తే జం చేసుకునేలా స్ఫూర్తిని పొందారు. ఆరోగ్యదాయక కుటుంబాలు ఆనందదాయక కుటుంబాలు అని నిరూపించడం లక్ష్యంగా వినోదం, ఫిట్ నెస్, వేడుకల సమ్మిళితంగా హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ జరిగింది. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఇండియా కంట్రీ హెడ్ &విపి, అజయ్ ఖన్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ప్రభు త్వ అధికారులు, భాగస్వాములు, మన అసోసియేట్స్ సహకారంతో రెండేళ్ళ స్వల్ప వ్యవధిలోనే ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ఇంతగా వృద్ధి చెందడం నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా కార్యక్రమం తో మమేకం కావడం మాకెంతో ఆనందదాయకం. రానున్న ఏళ్ళలో భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం, ప్రతీ నగరా నికి కూడా ఆరోగ్యదాయకమైన, చురుకైన జీవనశైలిని అందించడం హెర్బాలైఫ్ న్యూట్రిషన్ లక్ష్యం. ఫిట్ ఫ్యామిలీస్ ఫెస్ట్ 2019 ను పలు నగరాల్లో నిర్వహించాలని మేము భావించడం ఇదే మొదటిసారి. భువనేశ్వ ర్ తో మొదలుపెట్టి లూథియానా, అహ్మదాబాద్, హైదరాబాద్ లలో దీన్ని నిర్వహిస్తున్నాం’’ అని అన్నారు. ప్రతీ ఒక్కరు కూడా తమ ఫిట్ నెస్ లక్ష్యాలను సాధించేందుకు ,పరస్పర సహకారంతో, ప్రోత్సాహంతో వృద్ధి చెందేందుకు ఒక చేకూర్పు వేదికను అందించడాన్ని హెర్బా లైఫ్ కొనసాగించనుంది.