365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 30 ,హైదరాబాద్: బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
అందరికి
నమస్కారం. సుమన్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది, ఆయన నటిస్తోన్న ఈ బగ్గిడి
గోపాల్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న. చిన్న నిర్మాత చేస్తున్న ఈ
సినిమాకు మా అందరి సపోర్ట్ ఉంటుంది. బయోపిక్ లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి,
అలాంటి నేపథ్యంలో వస్తోన్న ఒక బయోపిక్ సినిమా ఇది. బగ్గిడి గోపాల్ అనే
బయోపిక్ లో ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఏంఎల్ఏ గా ఎలా ఎదిగాడు అనే అంశాలు ఈ
సినిమాలో ఉండబోతున్నాయి. సుమన్ గారు ఈ మూవీలో ఒక పోలీసు అధికారి పాత్రలో
కనిపించబోతున్నాడు. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను.
ఫిబ్రవరి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని తెలిపారు.
సుమన్ మాట్లాడుతూ…
ఒక
సామ్యన్య కండెక్టర్ పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు అనే అంశం ఈ సినిమాలో బాగా
చూపించారు డైరెక్టర్ అర్జున్ కుమార్. ఈ సినిమా కథ ఆదర్శంగా ఉంటుంది. నేను ఈ
సినిమాలో ఒక పోలీస్ అధికారి రోల్ లో కనిపిస్తాను. కొత్త నిర్మాత అయిన
బగ్గిడి గోపాల్ ఈ సినిమాను బాగా తీశాడు, డైరెక్టర్ అర్జున్ కుమార్
సినిమాను అద్భుతంగా ఆవిష్కరించారు. రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా
ఉండబోతొంది. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న అందరికి బెస్ట్ విషెస్
తెలుపుతున్నాను అన్నారు.
బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ…
1982 లో
మార్చి లో రాజకీయాల్లో జరిగిన కొన్ని కీలక మార్పులు జరిగాయి. అదే రోజు నేను
ఎన్టీఆర్ తో పాటు నడవడం జరిగింది. తాను పెట్టిన టిడిపి పార్టీలో నేను
చేసిన కృషి , సేవలు ఈ బగ్గిడి గోపాల్ చిత్రంలో చూపించడం జరిగింది. ఫిబ్రవరి
23న ఈ సినిమా విడుదల కాబోతొంది. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రీ
రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నాము. ఈ సినిమాను మా కుటుంబ
సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా గురించి, నా జీవితంలో జరిగిన కీలక
సన్నివేశాలు ఈ మూవీలో చెప్పడం జరిగిందని తెలిపారు.
ఎక్స్ ఎమ్ఎల్ఏ సంజయ్ రావు మాట్లాడుతూ….
బగ్గిడి
గోపాల్ గారు ఎమ్ఎల్ఏ అయిన తరువాత జరిగిన అన్ని సంఘటనలు నాకు తెలుసు. ఆయన
చేస్తున్న బగ్గిడి గోపాల్ సినిమాలో నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి
అయిన బగ్గిడి గోపాల్ ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి అనేక
అంశాలు ఈ బగ్గిడి బయోపిక్ లో పెట్టడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్
అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.
హీరోయిన్ చందన మాట్లాడుతూ…
అందరికి
నమస్కారం. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు. నాకు ఈ
మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ ఇష్టం, ప్రధానంగా గోపాలన్న సాంగ్ నాకు ఇష్టమని
తెలిపారు.
డైరెక్టర్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ…
నేను ఈ
సినిమాను డైరెక్ట్ చెయ్యడంతో పాటు ఒక పాత్రలో నటించాను. బగ్గిడి గోపాల్
గారు నిజాయితీ కలిగిన వ్యక్తి, ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 23న ఈ
సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాము, ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల
చేస్తున్నాము, మా సినిమాకు మీడియా అందరి సపోర్ట్ కావాలని కోరారు.
బ్యానర్: బగిడి ఆర్ట్ మూవీస్
సినిమా: బగిడి గోపాల్
ఆర్టిస్ట్స్: సుమన్, కవిత, ప్రభావతి, మహేష్, తేజ
హీరో: రమాకాంత్
హీరోయిన్: సిరి చందన
డైరెక్టర్: అర్జున్ కుమార్
ప్రొడ్యూసర్: బగిడి గోపాల్
కెమెరామెన్: ప్రవీణ్ కుమార్
స్టంట్స్ & కోడైరెక్టర్: అవిష్ పూరి
మ్యూజిక్: జయసూర్య బుప్పేం