Wed. May 29th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి11,హైదరాబాద్: సమాజ సేవలో వినూత్న రీతిలో పథకాలను ఏర్పరుస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నమూనాలను అందిస్తూ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది బాలవికాస సాంఘిక స్వచ్చంద సంస్థ. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం తో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతు నేటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు , మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో 6000 వేలకు పైగా గ్రామాలలో 43 లక్షల మంది ప్రజలు వివిధ రకాల పథకాల ద్వారా లబ్దిని చేకూర్చి దేశం లోనే ఇన్ని గ్రామాలకు సేవలందించిన మొదటి స్వచ్చంద సంస్థగా నిలిచింది.
సేవ రంగం లో తనదైన మార్క్ వేసుకున్న బాలవికాస ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్విహిస్తున్న టీ హబ్ తరహా ప్రైవేట్ రంగం లో దేశం లోనే అతిపెద్ద ఇంకుబేషన్ సెంటరను ప్రారంభించింది సుమారు 35 కోట్ల రూపాయల వ్యయంతో, 20 ఎకరాల విస్తరణలో, లక్ష 40,000 వేల స్కెరు ఫీట్ల విస్తీర్ణం తో ఘాట్ కేసర్ లోని రాంపల్లి దయారా అనే గ్రామం లో సాంకేతిక అధునాతన హంగులతో బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో బాలవికాస వ్యవస్థాపకులు శ్రీమతి బాలథెరిసా ఆంద్రె జింగ్రాస్ మాట్లాడుతూ దీని ముఖ్య ఉద్దేశం సమాజంలో ఏర్పడిన సమస్యల నిర్మూలనకు వినూత్న పద్ధతుల్లో కూడిన సామాజిక వ్యాపారాలను ప్రోత్సహిస్తు, వివిధ కార్పొరేట్ కంపెనీలు నిర్వహించే csr డిపార్టుమెంట్ లకు అభివృద్ధి రంగంలో దృఢమైన,సుస్థిరమైన నమూనాలను అందించడమే కాకుండా సమాజం లో ఉన్నటువంటీ సమస్యల గూర్చి ఒక సమర్థ బాధ్యతాయుత వ్యాపారం ద్వారా సమస్య పరిస్కారానికి కావలసిన శిక్షణాలను, నైపుణ్యాలను ఇవ్వడం జరుగుతుంది.

బాలవికాస డైరెక్టర్ శౌరీ రెడ్డి మాట్లాడుతూ బాలవికాస ఇంటర్నేషనల్ సెంటర్ ద్వారా రానున్న ఏడాది సమయం లో బాధ్యతా యుత సామాజిక వ్యాపారం ద్వారా 30లక్షలమందిని ప్రభావితం చేస్తామన్నారు.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారితో మరికొన్ని రోజుల్లో MBA కాలేజీ మొదలు కావడానికి ఒప్పందం కుదిరిందని తెలిపారు. MLC రామ చంద్రా రావు మాట్లాడుతూ బాలవికాస ఇంటర్నేషనల్ సెంటర్ ఇంకుబేషన్ ను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు… సామాజిక వ్యాపారం చేసే విధంగా ప్రోత్సహించే సంస్థలు చాలా అరుదుగా ఉంటాయన్నారు. ఎంట్రప్రెన్యూర్ షిప్ విద్యను అభ్యసించే వారికి BVIC ఒక మంచి ప్లాటుఫారం అని కొనియాడారు . కర్ణాటక డిప్యూటీ స్పీఎకర్ శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ బాలవికాస చెరువు పూడికలు ద్వారా మా నియోజక వర్గం లో చాలా లబ్ది పొందడం జరిగింది.. తర్వాత మహిళా సంఘాల ఏర్పాటుతో మా నియోజక వర్గ మహిళలలు చైతన్య వ0తులయ్యారు అన్నారు. చాలా అభివృద్ధి చెందుతుందని ఇక్కడున్న నాయకత్వం చాలా బలంగా ఉందని హరీష్ రావు ని మరియు తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశంసించారు

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఒక సామాజిక స్పృహతోయా సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్న గొప్ప తపన పడుతుతున్న బాలమ్మ ఆంద్రె జగ్రాస్ గార్లను అభినందించారు. 30 సంవత్సరాల క్రితం బాల వికాస చెరువు పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టి భారత ప్రభుత్వానికి నమూనా గ నిలిచిందన్నారు… అన్ని పతకాలతో 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి బాలవికాస కృషి చేస్తుందన్నారు. గతం లో బాలక్కకి కేసీర్ గారి ద్వారా లెటర్ రాయించుకొని భారత రత్న అవార్డు కి కృషి చేసిన సంఘటనని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో తప్పక కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ BVIC సెంటర్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందించారు. 30 సంవత్సరాల క్రితం మా నియోజక వర్గం లో మంచి నీటి ట్యాన్కులను బాలవికాస ఏర్పాటు చేసిందని అప్పటితో వారి సేవలు మా నియోజక వర్గం తో పాటు అనేక రాష్ట్రాలకు విస్తరించి చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు . మా ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆదర్శం బాలవికాస చేస్తున్న పథకాలే అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఇక్కడి వరకు ప్రభుత్వం తరపున రోడ్డు సౌకర్యం మరియు వీడి సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా మెషిన్ భగీరత నల్లాలను కూడా బాలవికాస ఇంటర్నేషనల్ సెంట్రర్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బాలవికాస చేస్తున్న అన్ని పథకాల్లో ప్రజలను భాగస్వాములుగా చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.. ప్రభుత్వాలు చేయని పథకాలను బాలవికాస పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. బాలవికాస ద్వారా CSR ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు.. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చినటువంటి ప్రతిరూపాయిని ప్రజల కోసం పెడ్తున్నటువంటి సంస్థ గా బాలవికాస ఒక నమ్మకాన్నిసాధించిందన్నారు. బాలవికాస కి ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో సోపార్ (కెనడా )president మార్క్ రెడ్డి, సోపార్ డైరెక్టర్ శోభా రెడ్డి, బాలవికాస ప్రెసిడెంట్ ఇంద్రా రెడ్డి, బాలవికాస బోర్డు మెంబర్లు, వివిధ దేశాల ప్రతినిధులు, ‘సి ఎస్ ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.