Mon. May 20th, 2024

ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ – ఇండియా జాతీయ అధ్యక్షులు డా. హిప్నో కమలాకర్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్16,హైదరాబాద్: మంచి ఆలోచనలు,ఉద్వేగాలతోనేమనసుఆరోగ్యవంతంగాఉంటుందని ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ – ఇండియాజాతీయ అధ్యక్షులు డా. హిప్నో కమలాకర్‌ అన్నారు. ”మానసిక సమస్యలు, వ్యక్తిత్వ వికాసం” అంశంపై హైదరాబాద్‌, అశోక్‌ నగర్‌ క్రాస్‌ రోడ్స్‌లోని మైండ్‌ అండ్‌ పర్సనాలిటీ కేర్‌లో నిర్వహించిన సామూహిక కౌన్సెలింగ్‌ కార్యక్రమంలో ఆయన ప్రేక్షకులకు మార్గదర్శనం చేశారు. శరీరం మనసు వేర్వేరు కావన్నారు. శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయన్నారు. శరీరానికి వచ్చే వ్యాధులకు మందులెంత అవసరమో, మనసుకు కలిగే వ్యాధులకు, బాధలకు వైద్యం, కౌన్సెలింగ్‌ కూడా అంతే అవసరమన్నారు. గతులు తప్పే మనసును గుర్తించి, అంతరంగ శృతులను సరిచేసుకోవాలంటే భావోద్వేగాలకు అలవాలమైన మానసిక స్వభావ స్వరూపాలను అర్థం చేసుకోవలన్నారు.  అవసరాలను తీర్చుకోటానికి కావల్సిన వనరులను సమీకరించటంలో తగిన జ్ఞానాన్ని, సమాచారాల్ని పెంపొందించుకోవాలన్నారు. పెరుగుతున్న బాధ్యతలను భాగాలుగా విభజించి వాటిలో కొన్నింటిని ఇతరుల చేత చేయించటం ద్వారా ఒత్తిడి ఎక్కువ కాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు.  అప్పుడే మనసుకు, శరీరానికి మధ్య సమన్వయాన్ని సాధించి ఆరోగ్యంగా జీవించటం సాధ్యపడుతుందన్నారు. జన్యుపరమైన లోపాలు కూడా మానసిక అనారోగ్యాన్ని కలిగిస్తాయన్నారు.సామాజికఒడిదుడుకులు కూడామనోవ్యాధులకుకారణాలవుతున్నాయన్నారు. సైకోటిక్‌ వ్యాధులకు ప్రధాన కారణం అనువంశికతే అయినా, అభద్రతా భావన, కుటుంబ సభ్యుల ప్రవర్తన మూలంగా ఏర్పడే ఒత్తిడి వీటిని బయటపెడ్తాయన్నారు. మనోవ్యాధుల కర్కశత్వానికి చిన్నారులు కూడా బలికావటం తప్పటం లేదన్నారు. భవిషత్తు జీవితంలో పోటీని తట్టుకోటానికి తగిన విధంగా తీర్చిదిద్దాలనే తపనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,సమాజంబాలలనుఒత్తిడికిగురిచేస్తున్నారన్నారు.సోషల్‌ మీడియా, టి.వి. ఛానల్లు  పిల్లల్లో అవాంఛనీయ భావాలెన్నిటికో బీజాలు వేస్తున్నాయన్నారు.

 డా. హిప్నో పద్మా కమలాకర్‌ మాట్లాడుతూ గర్భీణీ స్త్రీ ఒత్తిడికి గురయితే హార్మోన్లు అధిక స్థాయిలో ఉత్పత్తి అయి, అవి గర్భస్థ శిశువులోకి ప్రవేశిస్తాయన్నారు. దీని మూలంగా జన్మించక ముందే మనిషిలో మనో వ్యాధి ప్రారంభమవుతుందన్నారు. మనిషి జీవిస్తున్న క్రమంలో నేను ఒంటరివాడ్ని కానన్న ఊహ మనసుకి ఎంతో శక్తి నిస్తుందన్నారు.

కౌన్సెలింగ్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైకాలజిస్టు గ్రంథి సరోజారాయ్‌ మాట్లాడుతూమనసుకిమంచిఆలోచనలు,జ్ఞానాన్నిఅందివ్వాలన్నారు.శరీరానికిచక్కటిపౌష్టికాహరాన్ని,వ్యాయామాన్నిఅందివ్వాలన్నారు.తద్వారా మానసిక,శారీరక సమన్వయం జరిగి మంచి ఆరోగ్యంతో పాటు మేధా శక్తి మరింతగా పెంపొందింపడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. మానసికోల్లాసానికికొంతసమయంకేటాయించడం అవసరమన్నారు.సామాజికవిలువలుపతనంకాకుండాకాపాడుకోవడం ముఖ్యమన్నారు.మనసు ‘గతి’ ఏమిటో చక్కని పరిజ్ఞానాన్ని అందించే విధంగా ఉచిత కౌన్సెలింగ్‌ కార్యక్రమం చక్కటి అవగాహన కలిగించింది. తిరుమల సుధాకర్‌ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవమరించారు.