365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి24, హైదరాబాద్ :కనీసం చనిపోయిన తర్వాత బూడిదను కూడా చూసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంత ప్రమాదకారి ఈ మహమ్మారి . ఆ బూడిద లో కూడా ఈ వైరస్ బతికే ఉంటుంది. ఈ రోగం వస్తే కనీసం మనుషులు చివరి చూపు చూసుకోవడానికి కూడా వీలుండదు. చైనా ఇటలీ దేశాల్లో ప్రజలు అక్కడ కర్ఫ్యూ విధించినా ఆ టైంలో ఇలాగే మనలానే ప్రవర్తించారు. అందరు బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు వాళ్ళకు అదే పెద్ద శాపం అయింది. వాళ్లకే కాదు ప్రపంచ దేశాలను సైతం ఆ ముప్పుఆవహించింది. అయితే చైనా దేశస్తులు తాము చేసిన తప్పేంటో తెలుసుకొని తమ ఇళ్లలో నే ఉంటూ… స్వచ్ఛందంగా బయటికి రాకుండా పరిశుభ్రత పాటించి,ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇప్పుడు అక్కడ వారు పాటించిన ఆరోగ్య విధానాలే వారికి శ్రీరామరక్ష అయ్యాయి. స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది వారికే కాదు ప్రపంచానికి మేలు జరుగుతుంది కాబట్టి అందరూ ఆలోచించి ఇంట్లోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి. కరోనా వైరస్ అంతమొందించాలంటే.. ఎవరికి వారు స్వచ్ఛందంగా బందు పాటించాలి. అందుకు వారి సహకారాన్ని అందించాలి లేకపోతే అందరూ అంతం అయిపోతారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. పరిస్థితులు ఇంకా మన చేతిలోనే ఉన్నాయి వాటిని అనుకూలంగా మార్చుకుంటే అందరం సుభిక్షంగా పదికాలాలపాటు బతకడానికి అవకాశం ఉంటుంది లేదంటే…. అందరం కుక్క సావు చావాల్సిందే… ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి… ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సహకరించి… అందరూ బందు పాటించి… ఈ వైరస్ మహమ్మారిని తరిమికొడదాం… దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ లభించింది. దానిని ఇప్పుడు సద్వినియోగం చేసుకుందాం… ప్రతి ఒక్కరూ సైనికుల్లా సమరభేరి మోగించి ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ పై యుద్ధం చేద్దాం….