Mon. Oct 7th, 2024

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి20,2020:సుప్రసిద్ధ ఆరోగ్య భీమా సంస్ధ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ‘స్టార్ నోవెల్ కరోనా వైరస్ ఇన్సూరెన్స్ పాలసీ’ని ఆవిష్కరించింది. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి (నోవెల్ కరోనావైరస్) బారిన పడటంతో పాటుగా హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుంటున్న రోగులకు ఇది ప్రయోజనం కలిగించనుంది.స్టార్ నోవెల్ కరోనావైరస్ పాలసీ ఏకమొత్తంలో చెల్లింపుల ప్రయోజనాన్ని 18 నుంచి 65 సంవత్సరాల లోపు వయసు కలిగి, భీమా చేయించుకున్న వ్యక్తులకు అందించనుంది. అదీ ప్రభుత్వం నిర్ధారించిన పరీక్షాకేంద్రం వద్ద కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారించబడి, ఆ వైరస్ చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరిన వారికి ఈ మొత్తాలను అందిస్తారు. మరీ ముఖ్యంగా ఈ పాలసీలో ఎలాంటి అంతర్జాతీయ పర్యటనల సంబంధిత మినహాయింపులు లేవు.ఈ ‘స్టార్ నోవెల్ కరోనా వైరస్ పాలసీ’ రెండు హామీ ఇవ్వబడిన మొత్తాలలో లభిస్తుంది. మొదటి పథకానికి ప్రీమియం 459 రూపాయలు (జీఎస్‌టీ అదనం) తో 21వేల రూపాయలు రెండవ పథకంకు 918 రూపాయల ప్రీమియం (జీఎస్‌టీ అదనం)తో 42 వేల రూపాయలు హామీ మొత్తం అందిస్తారు. 65 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఎవరైనా సరే ఈ పాలసీని ఆన్‌లైన్‌లో https://www.starhealth.in/ లేదా విస్తృతశ్రేణిలోని కంపెనీ నెట్‌వర్క్ ఏజెంట్లను సంప్రదించడం ద్వారా ఎలాంటి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే కొనుగోలు చేయవచ్చు.ఈ నూతన పాలసీ గురించి ఆనంద్ రాయ్, మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు కరోనా వైరస్ కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడకుండా భారతీయులు తమను తాము కాపాడుకోవాల్సి ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారికి ఉపయుక్తంగా ఉండేలా ఈ పాలసీ డిజైన్ చేశారు. దేశపు సరిహద్దులు దాటి ఉన్న వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారికి హాస్పిటలైజేషన్ ఖర్చులకు తగినట్లుగా ఇది తోడ్పడుతుంది” అని అన్నారు.కోవిడ్ -19 చికిత్స కోసం తమ రెగ్యులర్ ఆరోగ్య భీమా పథకాలన్నీ కూడా కవరేజీ అందిస్తాయని స్టార్ హెల్త్ నిర్థారించింది. ఎలాంటి పర్యటన చరిత్ర మినహాయింపులు లేకుండా ‘స్టార్ నోవెల్ కరోనావైరస్ పాలసీ’ని ఆవిష్కరించిన స్టార్‌హెల్త్కోవిడ్ -19 కోసం హాస్పిటల్‌లో చేరిన రోగులకు ఏకమొత్తంలో ప్రయోజనం కల్పించే పాలసీ

error: Content is protected !!