Wed. Jan 15th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 11,2020 : డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ సంస్థ మరో అడుగు ముందుకేసింది. ప్రపంచ శ్రేణి కంటి సంరక్షణా సదుపాయాలను హైదరాబాద్ వ్యాప్తంగా అందించాలనే తమ నిబద్ధతను పునరుదద్ఘాటిస్తూ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ మంగళవారం నూతన కంటి చికిత్స కేంద్రాన్ని మెహదీపట్నంలో ఏర్పాటుచేసింది. అన్ని రకాల కంటి సమస్యలకూ చికిత్సనందించే ఏకైక కేంద్రమిది. ఈ కార్యక్రమానికి నటి ఆదా శర్మ ముఖ్య అతిథి గా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.

మెహదీపట్నంలో 6500చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం తెలంగాణాలో ఏడవది. ఈ కేంద్రంలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, వ్యూయింగ్ గ్యాలరీ ఉన్నాయి. ఈ కేంద్రంలో శస్త్రచికిత్సలు, ఔట్‌పేషంట్ డయాగ్నోస్టిక్, దృష్టి లోపాలకు అంతర్జాతీయంగా అత్యున్నత ప్రమాణాలతో చికిత్సనందిస్తారు. హైదరాబాద్‌లో మరో 4 కేంద్రాలతో పాటుగా తెలంగాణాలో మూడు కేంద్రాలను డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ఏర్పాటుచేయనుంది.

ఆదాశర్మ మాట్లాడుతూ “మన కళ్లు అత్యంత విలువైనవి. ఇవి చూపును బహుమతిగా అందిస్తాయి. వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటుగా మెరుగైన కంటి చూపు కోసం తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. మెహదీపట్నంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నూతన కేంద్రం ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాను” అని అన్నారు.

డాక్టర్ గౌరవ్ అరోరా, రీజనల్ హెడ్- క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్, హైదరాబాద్ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2.2 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పలు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో అధికశాతం మంది మనదేశంలోనే ఉన్నారు. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రతి ఒక్కరికీ మెరుగైన నేత్రదృష్టికి భరోసా కల్పిస్తుంది.ఈ ప్రాంతంలోని ప్రజలకు ఈ కేంద్రం ఓ వరం కానుందని విశ్వసిస్తున్నాను” అని అన్నారు.
డాక్టర్ వంశీధర్, రీజనల్ హెడ్- క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్, హైదరాబాద్ మాట్లాడుతూ ” ప్రపంచంలో దృష్టిలోపంతో ఇబ్బంది పడుతున్న 25% మంది మనదేశంలోనే ఉన్నారు. సవాల్ పెద్దదే అయినా, నిష్ణాతులైన ఆప్తమాలజిస్ట్‌లు, సృజనాత్మక పద్ధతులతో అత్యధిక విజయశాతాన్ని మేము నమోదు చేస్తున్నాం..” అని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌరవ్ అరోరా, రీజనల్ హెడ్-క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్ ; డాక్టర్ వంశీధర్, రీజనల్ హెడ్-క్లీనికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, హైదరాబాద్, డాక్టర్ బాల్కీ సత్క ప్రసాద్, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్ పాల్గొన్నారు.

error: Content is protected !!