Sat. May 25th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి2 ,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ వెలువరుస్తున్న ప్రస్థానం జనవరి సంచికతో పాటు రవాణా శాఖా డైరీ, క్యాలెండర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించేలా నూతన విధానాలను అమలులోకి తీసుకు రావడమే కాకుండా ఏజెంట్లు లేకుండా సేవలు అందించే స్థితికి ఆర్టీఏ చేరుకోవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ సూచికలో తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నెం.1 స్థాయిలో ఉండాలని, దేశంలో ప్రమాదాల గణంకాలు ఆందోళన కల్గిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమ, నిబంధనల్ని పాటించినప్పుడే ప్రమాదాల రేటు తగ్గుతుందన్నారు. పరివర్తన చెందినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ఈ దిశగా అందరి ప్రయత్నం ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎం.డి, టి.ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ,ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌  సందీప్‌ సుల్తానియాతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్‌,టి.వి.రావు, యాదగిరి, వెంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొని మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

  •