365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,జనవరి1, హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్. ఆయన ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సీఎం శ్రీ కేసీఆర్ సంతకం చేశారు. 1 జనవరి, 2020 నుంచి 31 డిసెంబర్, 2023 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.రిటైర్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Latest Updates
Icon