365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి31,హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాపై పోరుకు తమ వంతుగా 51కోట్లు విరాళం అందజేస్తున్నట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ సొమ్మును ఆయా రాష్ట్రాల్లోని సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో రూ.3కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి, రూ. కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించినట్లు సమాచారం.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెంటిలేటర్లు, వ్యక్తిగత భద్రతకు అవసరమైన ఉత్పత్తులను సరఫరా చేస్తామని, దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ చైర్మన్ ఆర్‌సీ జునేజా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటువంటి సమయంలో కరోనాపై పోరాడేందుకు తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నామని జునేజా పేర్కొన్నారు.