365తెలుగు డాట్ కం ఆన్లైన్ న్యూస్,జూలై 25,హైదరాబాద్2020: ఈస్ట్ – వెస్ట్ సీడ్ ఇండియా చాముండి, లావా పేరుతో తెలంగాణలో రెండు నూతన మిర్చి రకాలను ప్రవేశపెట్టింది. ఇవి ఉత్పత్తి వ్యయాలను తగ్గించడమే కాకుండా చిన్నరైతులకు దిగుబడుల పెంచుతాయి. లావా అనేది ఎరుపు, పొట్టి రకానికి చెందింది. కాగా.. లీఫ్ కర్ల్ (ఆకు ముడత) వ్యాధిని తట్టుకునే శక్తిని కలిగిఉంటుంది. పలు కోతల దాకా కూడా కాయ పరిమాణం నిలకడగా ఉంటుంది. అంతేగాకుండా రైతులకు సస్యరక్షణ, కూలీ వ్యయాలు కూడా తగ్గుతాయి. ఘాటు (ఎస్ హెచ్ యు: 85కె-90కె), రంగు వాల్యూ (ఏఎస్ టిఎ : 75-80), ఒలెఒరెసిన్ శాతం (17.5 శాతం)ల అద్భుత సమ్మేళనం దీన్ని ఒలెఒరెసిన్ ఎక్స్ ట్రాక్షన్ ,ఎగుమతుల కోసం అనువైందిగా తయారు చేసింది.
చాముండి అనేది ఎరుపుతోపాటు కొంచెం పొడవుగా ఉంటుంది. లీఫ్ కర్ల్ (ఆకు ముడత) వ్యాధిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఈ విభాగంలోనే అత్యుత్తమ కలర్ వాల్యూ (ఏఎస్ టిఎ : 105-110)ను కలిగిఉంటుంది. చిల్లీ పౌడర్ పరిశ్రమకు అత్యుత్తమ ఎంపిక. రైతులకు అధిక ధరలను అందిస్తుంది. చాముండి చక్కటి రంగును నిలబెట్టుకునే శక్తి (సిఆర్సీ)ని కలిగిఉండి రైతులు నిల్వ చేసుకునేందుకు (ఆరు నుంచి 8 నెలలు), తగిన సమయంలో విక్రయించుకొని మెరుగైన ధరలు పొందేందుకు వీలు కల్పిస్తుంది. చాముండి మరో అదనపు ప్రయోజనం కూడా అందిస్తుంది. 8-10 రోజులు ముందుగానే కోతలు పూర్తయి మార్కెట్ చేరుకునే అవకాశాన్ని అందిస్తుంది. “మసాలా దినుసు ల్లో ఈస్ట్ – వెస్ట్ సీడ్ 25 ఏండ్ల నైపుణ్యాన్ని కలిగిఉన్నది. చాముండి , లావా రెండూ కూడా ఎంతో ఘాటుగా ఉంటాయి. అందుకే వాటికి తగిన పేర్లు పెట్టాం. ఈ రెండు రకాల నూతన హైబ్రిడ్స్ తో రైతులు మెరుగైన ఉత్పత్తిని సాధిస్తారని ఆశిస్తున్నాం” అని ఈస్ట్ – వెస్ట్ సీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ రాజన్ అన్నారు.