Sat. May 25th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 25 బెంగళూరు, 2019 – భారతదేశవ్యాప్తంగా 50,000+ రూట్ల కోసంబస్ ఆపరేటర్ల నుండి అత్యంత విస్తారమైన బస్సు సేవల ఎంపికను అందించడానికిఅమెజాన్ ఇండియా ప్రముఖ ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ రెడ్‌బస్‌తో భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. అమెజాన్‌కస్టమర్లందరూ పరిమిత కాలానికి అమెజాన్‌లో వారి మొదటి బస్సు టికెట్ బుకింగ్‌లో రూ. 200 వరకు 20% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు,అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు Amazon.in పైవారు బస్సు టికెట్లను బుక్ చేసుకున్న ప్రతిసారీ అదనంగా 2% రివార్డులఅదనపు ప్రయోజనం పొందుతారు.

ఈ భాగస్వామ్యంతో,ప్రయాణీకుల ద్వారా బస్ సర్వీస్ రేటింగ్స్ మరియు బస్సుల యొక్క ప్రత్యక్ష ట్రాకింగ్ వంటి రెడ్‌బస్ ప్లాట్‌ఫార్మ్ ప్రత్యేక లక్షణాలకుఅమెజాన్ కస్టమర్లు కూడా ప్రాప్యత పొందుతారు. ఇతర కస్టమర్‌ల ద్వారా ఒక బస్సు సేవ రేటింగ్‌లను, తమ రూట్ లో అందుబాటులో ఉన్నఉత్తమ బస్సు ఎంపికను ఎంచుకోవడానికికస్టమర్‌లు మార్గదర్శకంగా ఉపయోగించుకోవచ్చు. వారు తమ బస్సు యొక్క లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకుని వారి బోర్డింగ్ పాయింట్‌కు చేరుకునే ఆశించబడిన సమయాన్ని చెక్ చేసుకోవచ్చు. వారికి బయలుదేరే ముందు బస్సు నంబర్ మరియు బస్సు సిబ్బంది సంప్రదింపు సమాచారం అందుతుంది.

అదనపు సౌలభ్యం మరియు నియంత్రణను అందించే అతిపెద్ద షాపింగ్ మరియు చెల్లింపు వినియోగం కేసులను కస్టమర్లు ఇప్పుడు అమెజాన్‌లోకనుగొనవచ్చు. షాపింగ్, డబ్బు బదిలీలు, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జీలు, ఫ్లైట్ బుకింగ్‌లు మరియు మూవీ టిక్కెట్లకు అదనంగావారికి ఇప్పుడు – అన్నీ ఒకే యాప్ లో – ప్రైవేట్ బస్సుల కోసం టిక్కెట్లు కొనే సామర్ధ్యం ఉంది.

Amazon.inపై బస్సు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, కస్టమర్లు ‘అమెజాన్ పే’ టాబ్ క్రింద ‘బస్ టికెట్స్’ వర్గానికి వెళ్ళితమ ప్రస్తుత సంప్రదింపు వివరాలు మరియు చెల్లింపు సమాచారాన్ని వారు ఉపయోగించవచ్చు, ఇది ప్రతిసారీ ఈ సమాచారాన్ని తిరిగి నమోదు చేసే శ్రమను ఆదా చేస్తుంది. ఒక సులభమైన చెక్అవుట్ అనుభవం కోసం వారు తమ అమెజాన్ పే బ్యాలెన్స్,అమెజాన్ పే యుపిఐ లేదా అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్లేదా ఇతర డిజిటల్ పేమెంట్ పధ్ధతులనుఉపయోగించవచ్చు. ఒకవేళ కస్టమర్‌లు టికెట్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంటే, ఆపరేటర్ నిర్వచించిన క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం వారు క్యాన్సిలేషన్ పెనాల్టిని మాత్రమే చెల్లిస్తారు; Amazon.inఏ అదనపు ఛార్జీలను విధించదు.

ఆవిష్కారంసందర్భంలో మాట్లాడుతూఅమెజాన్ పే డైరెక్టర్, వికాస్ బన్సాల్, “కాలం గడిచే కొద్దీమా కస్టమర్ల షాపింగ్ మరియు చెల్లింపు అవసరాలకు అమెజాన్ యాప్ ఒక వన్ స్టాప్ గమ్యస్థానంగా మారిందిఅన్నీ ఒక్కటేయాప్ లో- షాపింగ్ మరియు చెల్లింపు కోసం మేము అందించే సౌలభ్యాన్ని వారు ఇష్టపడతారు. ఈ రోజుఅమెజాన్‌లో బస్సు టిక్కెట్ల బుకింగ్ ను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. రెడ్‌బస్‌తో భాగస్వామ్యం చేసుకుని మా కస్టమర్ల కోసం జీవితాన్ని సులభతరం చేయడంలో సహాయపడటంలో మరొక అడుగు ముందుకు వేసినందుకు మాకు ఎంతగానో ఆనందదాయకంగా ఉంది” అన్నారు.

రెడ్‌బస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ అగర్వాలా మాట్లాడుతూ, “మన దేశంలో ఆన్‌లైన్ బస్సు టికెటింగ్‌ చొచ్చుకుపోవడాన్ని మరింత విస్తృతంగా మరియు లోతుగా చేయడానికి బస్ టికెటింగ్‌ను దాని పెద్ద కస్టమర్ బేస్ కి తీసుకురావడానికి అమెజాన్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము.ఈ భాగస్వామ్యంతోమేము మా బస్ ఆపరేటర్ భాగస్వాములకు వారి ఇన్వెంటరీని పంపిణీ చేయడానికి మరియు వారి అమ్మకాలు మరియు ఆక్రమించుకోబడిన సీట్లని పెంచుకోవడానికి మరో మార్గం అందిస్తున్నాము “అన్నారు.