Sun. Apr 14th, 2024
Call for Entries now open for Lexus Design Award India 2021

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,హైదరాబాద్‌,12 ఆగష్టు 2020:లెక్సస్‌ ఇండియా విజయవంతంగా మూడు ఎడిషన్లను నిర్వహించిన తరువాత తన ప్రతిష్టాత్మక లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021 నాల్గవఎడిషన్‌ను ప్రకటించింది. తద్వారా డిజైన్‌ రంగంలో ఔత్సాహిక,ప్రముఖ డిజైనర్లు తమ సృజనాత్మకతను,నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వారికి ఒక వేదికను అందిస్తున్నది.2020 అక్టోబర్‌ 6 చివరి గడువు తేదీగా ఎంట్రీలను ఆహ్వానిస్తున్నది . దేశవ్యాప్తంగా ఉన్న నిపుణు లు, విద్యార్దులు,ఔత్సాహిక డిజైనర్లు తమ వాస్తవ నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్బుత అవకాశాన్ని వార్షిక డిజైన్‌ పోటీలను నిర్వహించడం ద్వారా అవకాశమిస్తున్నది. ఈ అవార్డు ఎడిషన్‌తో లెక్సస్‌ ఇండియా తన డిజిటల్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది.మెరుగైన భవిష్యత్తును అందించే లక్ష్యంతో రూపకల్పనకు,డిజైన్లకు లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్స్‌ ఇండియా ఒక వేదికను అందిస్తున్నది. ప్రపంచ సామాజిక,ఆర్దిక మూలాలను సమూలంగా కదిలించిన కోవిడ్‌-19 మహమ్మారితో ప్రపంచం పోరాడుతున్న సందర్బంలో, లెక్సస్‌డిజైన్‌ అవార్డ్‌ ఇండియా (ఎల్‌ఎడిఐ)2021 ప్రపంచాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా మార్చుతూ ముందుకు సాగాలని కోరుకునే వ్యక్తుల కోసం ఒక వేదికను అందించాలి అన్న తన కృషిని కొనసాగిస్తూనే ఉన్నది. ఇంతకుముందు నిర్వహించిన ఎడిషన్లకు అనుగుణంగానే అవార్డు ‘డిజైన్‌ ఫర్‌ ఎ బెటర్‌ టుమారో’ అనే  మార్గదర్శక సూత్రానికి కట్టుబడి ఉన్నది. లెక్సస్‌ బ్రాండ్ ఊహించడం, ఆవిష్కరించడం,ఆకర్షించడం(యాంటిసిపేట్‌, ఇన్నోవేట్‌ అండ్‌ క్యాప్టివేట్‌) అనే మూడు ముఖ్య సూత్రాలపై ఆధారపడి పోటీదారులప్రధాన ఆలోచన ప్రతిపాదనలను వ్యక్తపరచవలసి ఉంటుంది, అంతేకాకుండా ఎప్పటికప్పుడు మారుతున్న సమాజ అవసరాలను తీర్చేవిధంగా వారి నమూనాలు ఉండాలి.

లెక్సస్‌ ఇండియా, ప్రెసిడెంట్‌, పిబి వేణుగోపాల్‌, లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021(ఎల్‌ఎడిఐ) ప్రారంభం గురించి మాట్లాడుతూ,‘‘లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా నాల్గవ ఎడిషన్‌ను ప్రకటించినందుకు ఆనందిస్తున్నాము. ‘యదాతత స్థితి’ని సవాలు చేసే ఒక మెరుగైన రేపటిని నిర్మించే డిజైన్‌ భావనలను లెక్సస్‌ ఇండియా ప్రోత్సాహిస్తుంది. గత ఎడిషన్లకు అద్బుతమైన నైపుణ్యం కలిగిన భారతీయ డిజైన్‌ కమ్యూనిటీ నుండి అద్బుత స్పందన అందుకున్నాయి. ఈ సంవత్సరం గత ఎడిషన్లను అధిగమిస్తుందని మేము నమ్ముతున్నాము మరియు ఖచ్చితంగా ‘మెరుగైన రేపటి కోసం డిజైన్లు’ కోసం మేము ఎదురు చూస్తున్నాము.’’ అని ఆయన అన్నారు.

లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021 ఎంట్రీు క్రింద తెలిపిన 10 విభాగాలలో ఉంటాయి.ఎ. ఎస్టాబ్లిష్ట్‌ వర్క్‌ (క్లయింట్‌ / సెల్ప్‌-కమీషన్డ్‌)

1. ప్రాడక్ట్‌ డిజైన్‌

2. ఫర్నిచర్‌ డిజైన్‌

3. టెక్స్‌టైల్‌ డిజైన్‌

4. క్రాఫ్ట్‌ డిజైన్‌

5. డిజైన్‌ థింకింగ్‌

6. పబ్లిక్‌ యుటిలిటీ డిజైన్‌

7. లైఫ్‌స్టయిల్‌ యాక్సిసరీ డిజైన్‌

8. డిజైన్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ బి. కాన్సెప్చువల్‌ వర్క్‌

9. స్టూడెంట్‌ కేటగిరి

10. ఓపెన్‌ కేటగిరి

Call for Entries now open for Lexus Design Award India 2021
Call for Entries now open for Lexus Design Award India 2021

కాన్సెప్చువల్‌ కేటగిరీకి చెందిన విజేతలు డిజైన్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలచే మార్గనిర్దేశాన్ని అందుకుంటారు.ప్రోగ్రామ్‌ ద్వారా అభ్యర్దులు నిపుణులైన వారి నుండి విలువైన సిఫార్సులు,ఆలోచనలు,అందుకుంటారు. ఇది వారి ప్రాజెక్ట్‌ను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది.10 కేటగిరీకు చెందిన విజేతలకు లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా ట్రోఫీలను ప్రధానం చేస్తుంది, ఎల్‌డిఎఐ 2020 మెంటర్స్‌లో ప్యానెల్‌ డిజైన్‌ రంగంలో ఒక బెంచ్‌మార్క్‌ను కలిగిన ప్రఖ్యాత డిజైనర్‌ మైఖల్‌ ఫోలే ఒకరు. గెలిచిన డిజైన్లను లెక్సస్‌ ఇండియాడిజిటల్‌ రంగంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న గెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల ద్వారా ప్రమోట్‌ చేయబడతాయి.  ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అంతర్జాతీయ డిజైన్‌ అవార్డ్‌ అయిన లెక్సర్‌ డిజైన్‌ అవార్డ్‌ 2021కు 2 కాన్సెప్చువల్ ‌వర్క్‌ కేటగిరీలు(9&10) లు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి.2 కాన్సెప్చువల్‌ వర్క్‌ కేటగిరీలు (9&10) విజేతలను మిలాన్‌ డిజైన్‌ వీక్‌2021(అనుకూల పరిస్థితలకు లోబడి) లెక్సస్‌ డిజైన్‌ ఈవెంట్‌కు ఆహ్వానించడం జరుగుతుంది.ఎల్‌డిఎఐ 2021 విజేతను 2021 ప్రారంభంలో ప్రకటిస్తారు. ఈ అవార్డుకు న్యాయనిర్ణేతు,సలహాదారులగా  భారతదేశానికి చెందిన సుప్రసిద్ద డిజైనర్లు ఉంటారు వారిని 2020 అక్టోబర్‌లో ప్రకటించడం జరుగుతుంది.లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియాకు ధరఖాస్తు,ఎంట్రీను 2020 అక్టోబర్‌6 తేదీ లోప అందజేయవచ్చు. లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా 2021కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దర్శించండి : www.lexusindia.co.in/en/discover-lexus/lexus-design-award-india.అధికారిక హ్యాష్‌ట్యాగ్‌ : #LexusDesignAwardIndia

లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా గురించి:లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ ఇండియా (ఎల్‌డిఎఐ) భారతీయ డిజైనర్లు, సంస్థలు, డిజైన్‌ కన్సల్టెన్సీ సంస్థలు,సంస్థలో  అంతర్గతంగా ఉండే డిజైన్‌ బృందాలు అమలు చేసిన ఉత్తమ పారిశ్రామిక రూపక్పనను గుర్తించి వాటికి బహుమతి అందివ్వడం జరుగుతుంది. మంచి మార్పునకు ఎల్‌డిఎఐ ఎర్గోనామిక్‌, ఆస్థెటిక్‌, కమర్షియల్‌, ఇండస్ట్రియల్,సైంటిఫిక్‌ విభాగాలు సమన్వయాన్ని నిర్వస్తుంది. ఒక బ్రాండ్‌గా లెక్సస్‌, డిజైన్‌ ఎర్గోనామిక్స్‌, సుస్థిరత, సాంకేతిక ఆధిపత్యం    బాధ్యతాయుతమైన వినియోగంలో ఎ్లప్పుడూ రాణించింది  ఎల్‌డిఎఐ ఈ బ్రాండ్‌ విలువకు అద్దం పడుతుంది.

లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ గురించి:లెక్సస్‌ గురించి2013 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన లెక్సస్‌ డిజైన్‌ అవార్డ్‌ అనేది అంతర్జాతీయ డిజైన్‌ కాంపిటీషన్‌, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఆవిష్కర్తలను లక్ష్యంగా చేసుకుంటుంది. మంచి భవిష్యత్తును రూపొందించడానికి సహాయపడే డిజైనర్లుక్రియేటర్లకు మద్దతు ఇవ్వడం ద్వారా సమాజానికి దోహదపడే ఆలోచన పెరుగుదలను ప్రోత్సాహించడానికి ఈ అవార్డ్‌ ప్రయత్నిస్తుంది. పైనలిస్టుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిజైనర్లతో వారి డిజైన్ల యొక్క ప్రోటోటైప్‌ను రూపొందించడానికి ఒక మెంటర్‌గా పనిచేయడానికి ఇదొక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఆపైన వాటిని డిజైన్‌ క్యాలెండర్‌లోని అతి కీలకమైన ఈవెంట్లలో ప్రదర్శిస్తుంది.

లెక్సస్‌1989లో ఫ్లాగ్‌షిప్‌ సెడాన్‌ మరియు ప్రీమియం అటోమోటివ్‌ పరిశ్రమలను నిర్వహించడంలో సహాయపడేందుకు ఏర్పాటు చేయబడిది.1989లో, లెక్సస్‌ ఆర్‌ఎక్స్‌ను ప్రారంభించడంతో లగ్జరీ క్రాస్‌ ఓవర్‌ విభాగాన్ని ప్రవేశపెట్టింది. లగ్జరీ హైబ్రిడ్‌ సేల్స్‌ లీడర్‌ అయిన లెక్సస్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి లగ్జరీ హైబ్రిడ్‌ను పంపిణీ చేసింది, అప్పటి నుండి 1.5  మిలియన్లకు పైగాహైబ్రిడ్‌ వాహనాలను విక్రయించింది.2017 మార్చిలో భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి, లెక్సస్‌ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్దిక వ్యవస్థలో లగ్జరీని పునర్‌ నిర్వచించింది స్థిరంగా అసాధారణమైన డిజైన్‌ను అందించింది,వివేకం కలిగిన భారతీయులకు 6 వాహనాల పోర్టిఫోలియోలో 5 సెల్ఫ్‌ చార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎక్ట్రిక్‌ వాహనాల శ్రేణితో, ప్రత్యేక తయారీతో,అద్బుత ప్రదర్శనతో, ప్రపంచవ్యాప్త లగ్జరీ గ్రూప్‌కు చెందిన తదుపరి తరపు అవసరాలను తీర్చే వాహన శ్రేణిని అందిస్తున్నది. రాజీలేని డిజైన్‌, అసాధారణమైన క్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌తో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలో అందుబాటులో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్సస్‌ సహచర / టీమ్‌ సభ్యుల ఉత్తేజపరిచేప్రపంచాన్ని మార్చగలిగే అనుభవాలను రూపొందించడంలో అంకితమైనారు.