Sat. Jul 27th, 2024

విద్యాహక్కు చట్టం ఏం చెబుతున్నది ?

నిబంధనలకు తూట్లు,ఆటస్థలం తప్పని సరి
 చిన్నారుల చేతికి రసీదిస్తే జరిమానా

– జిఒ ఎమ్‌ఎస్‌ నెం.42 ప్రకారం ప్రతి పాఠశాల 25శాతం మంది విద్యార్ధులకు ఉచిత విద్యనందించాలి.
– జిఒ ఎమ్‌ఎస్‌ నెం.42 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో రూ.12,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,800 ఫీజుకు మించి వసూలు చేయకూడదు.

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 30,ఖమ్మం: ‘ నేటి విద్యార్థులే రేపటి పౌరులు.. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పాఠశాలలే’  అన్నారు పెద్దలు. కానీ అలాంటి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. న్నాయి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి, జవాబుదారీ తనాన్ని ప్రదర్శించాల్సిన పాఠశాలల యాజమాన్యాలు నేడు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీచేస్తూ, అక్షరవ్యాపారాన్ని కొన సాగిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్‌,సెమీకార్పొరేట్‌తరహాపాఠశాలలనునిర్వహిస్తున్నయాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపూలేకుండా పోతుంది. వీటినినిరోధించాల్సిన విద్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా నిబంధనలకు పాతర వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, తల్లిదండ్రులు చైతన్యమై, ప్రభుత్వ నిబంధనలు, విద్యాహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 నిబంధనలు ఏం చెబుతున్నాయంటే ?
– రూల్‌ నెంబర్‌ 10, సెక్షన్‌-6 ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో నిర్వహించే అడ్మిషన్లు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జరగాలి.
– సెక్షన్‌-11 ప్రకారం, ప్రయివేటు యాజమాన్యాలు గవర్నింగ్‌ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు.
– ప్రభుత్వ నిబంధనలు ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి.
– రూల్‌ 12, సెక్షన్‌1, 2 ప్రకారం స్కూల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకరాం టీచర్లును, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించి, వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని చట్టం చెబుతోంది.
-సెక్షన్‌-12 ప్రకారం టీచర్‌ విద్యార్థుల నిష్పత్తి 1:20కు మించరాదు.
– విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రయివేటు యాజామాన్యం 25 శాతం సీట్లను యస్‌సి, యస్‌టి, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి.
– పాఠశాల యాజమాన్యాలు, నోట్‌బుక్స్‌, యూనిఫారాలు, స్కూలు బ్యాగులు, ఇతర స్టేషనరీ అమ్మరాదు. ఎక్కడ కొనుగోలు చేయాలో కూడా సూచించరాదు. డీఎడ్‌ లేదా బీఎడ్‌ అర్హత ఉండాలి  ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లోని టీచర్లు డీఎడ్‌ లేదా బీఎడ్‌ అర్హత ఉండాలి. టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. 2017-18 విద్యా సంవత్సరంతో పాటు 2018-19 విద్యా సంవత్సరపు ఫీజులను సీఎ్‌సఈ వెబ్‌సైట్లో పెట్టాలి. పాఠశాలల్లోనూ అందరికీ కనిపించేలా రెండు చోట్ల ప్రదర్శించాలి.2010లో విడుదల చేసిన జీ.వో.నెం. 42 ప్రకారం డొనేషన్లు, క్యాపిటేషన్‌ ఫీజులు వసూలు చేయరాదు. ఆటస్థలం తప్పని సరి
– మున్సిపాల్టీ పరిధిలో పాఠశాలల్లో 1000 చ.మీ, గ్రామీణ, ఇతర ప్రాంతాల్లో 2000 చ.మీ ఆటస్థలం తప్పని సరిగా ఉండాలి. పాఠశాల పక్కా భవనంలో నిర్వహించాలి.
– ప్రతి పాఠశాలలో సలహాలు, సూచనలకు ఫిర్యాదు బాక్సులు ఉండాలి.

చిన్నారుల చేతికి రసీదిస్తే జరిమానా
అభం, శుభం తెలియని చిన్నారుల చేతికి స్కూలు ఫీజుల  రసీదులు ఇస్తున్నారు. మీ అమ్మా, నాన్న ఇంకా ఫీజు చెల్లించ లేదంటూ వారిని కించ పరుస్తున్నారు. గతంలో ఓ చిన్నారి చేతికి రసీదు ఇ
చ్చిన ఓ ప్రయివేటు స్కూలుకు చెందిన యాజమాన్యానికి భారీ ఎత్తున జరిమానా విధించింది విద్యాశాఖ. ఈ విషయాన్ని ఆ శాఖ గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో మరొక సారి ఇటువంటి ఉదంతం చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది.
 ఖమ్మం జిల్లాలో…
ఖమ్మం జిల్లాలో వందల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ ప్రభుత్వ నిబంధనలను, విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదు. వాస్తవానికి ప్రతీ ప్రయివేటు పాఠశాలలో జిఒ నెం.1, 41, 42, 780 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. విద్యాహక్కు చట్టం-2009ను తూ.చ. తప్పకుండా అమలు చేయాలి. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వీటిని పట్టించుకోకుండా, దోపిడీకి పాల్పడుతున్నా, ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా, వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. పాఠశాలల యాజమాన్యాలతో లాలూచీ పడుతున్న విద్యాశాఖ ఏకంగా పర్యవేక్షణ గాలికొది లేయడంతో ప్రయివేటు యాజమాన్యాలు, కార్పొరేట్‌ బడులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నిలువ దోపిడీ చేస్తున్నాయి.

జాతీయ బాలల హక్కుల కమిషన్‌ ఏం చెబుతోంది ?
– అనుమతులు లేకుండా స్కూళ్లను ప్రారంభించకూడదు. ఒక వేళ ప్రారంభించినా ఆరు నెలల్లోపు అనుమతులు పొందాలి..
– ప్రభుత్వ సూచనల ప్రకారం ఫీజులు తీసుకోవాలి.
– 20 మంది చిన్నారులకు ఒక ఉపాధ్యాయుడు, ఒక సంరక్షకుడు ఉండాలి.
– రక్షణ, భద్రత, పారిశుధ్యం, పరిశు భ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– భవనానికి ప్రహరీ, గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి.
– చిన్నారులు నిద్రపోవడానికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ఉండాలి
– మరుగుదొడ్లు, స్నానాల గదిలో టవల్‌, సబ్బులు ఉంచి శుభ్రతా చర్యలు పాటించాలి.
– సిసి టీవీలను అందుబాటులో ఉంచాలి
– అగ్నిమాపక దళ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి.
– ప్లే స్కూలు రోజుకు 3 నుంచి 4 గంటల్లోపు మాత్రమే నిర్వహించాలి
– పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులతోనే బోధన ఉండాలి.
– బొమ్మలు, టీవీలను చూపించి చైతన్య పరచాలి.
– ప్రథమ చికిత్స కిట్‌, చిన్న పిల్లలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.
– వైద్య నిపుణులతో ప్రతి మూడు నెలలకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలి
– ప్రవేశపత్రం, హాజరు, ఆరోగ్య రికార్డులు, స్టాక్‌, ఫీజు వగైరా రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి.
– ప్లే స్కూలుకు తప్పనిసరిగా ప్లే స్కూలు అనే బోర్డు ఉంచాలి.
– విద్యాశాఖ ఎప్పటికప్పుడు ప్లే స్కూళ్ల జాబితాను గెజిట్లో ఉంచాలి.
– మూడేళ్లలోపు చిన్నారులను చేర్పించకూడదు.
– మూడేళ్లలోపు పిల్లలున్నా, ఫీజులు అధికంగా వసూలు చేసినా వెంటనే గుర్తింపు రద్దు చేయవచ్చు.
– ప్రవేశాలు పూర్తయిన ఒక నెలలోపు తల్లిదండ్రుల కమిటీని నియమించాలి. ఇందులో 50 శాతం తల్లులు, 25 శాతం ఉపాధ్యాయులు, 25 శాతం తండ్రులు ఉండేలా చూడాలి. ఈ కమిటీని ఏటా మారుస్తుండాలి.
– ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలు నమోదు చేయాలి.
– పిల్లలకు జంక్‌ ఫుడ్స్‌ను అనుమతించకూడదు. పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి.