Sat. Nov 9th, 2024
STAR MAA PART OF STAR INDIA ROLLS OUT CAMPAIGN FOR CONSUMER SAFETY

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్ మే12020 :ఈ సంక్షోభ సమయంలో దేశమంతా ఏకతాటిపైకి వచ్చిన వేళ, నెలకు 700 మిలియన్ల మందికి పైగా వీక్షకులను చేరుకునే స్టార్ ఇండియా నెట్‌వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ వినియోగదారుల భద్రతను లక్ష్యంగా చేసుకుని – ‘ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి’ పేరిట ప్రచారంను ప్రారంభించడం ద్వారా తమ వీక్షకులకు నిరంతర వినోదానికి భరోసా కల్పిస్తుంది.

భద్రత పట్ల అవగాహన మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ప్రచారం ప్రోత్సహించడంతో పాటుగా ఇంటి వద్దనే ఉంటూ సురక్షితంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఇది తెలుపుతుంది. అదే సమయంలో కుటుంబాలకు వినోదాన్నీ అందిస్తుంది. తమ వినూత్నమైన సృజనాత్మకతతో, బయటకు తిరగకుండా ఉండటం ద్వారా- ఆఖరకు తమ టీవీ బిల్లు చెల్లింపులకు సైతం బయటకు వెళ్లకుండా ఉంటూ, సమస్యలను ఇంటి బయటే వదిలేయమని ఇది కుటుంబాలను కోరుతుంది. ఆన్‌లైన్ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా ఇది వీక్షకులకు చెబుతుంది. “మా ప్రచారం ద్వారా వినియోగదారులను ఇంటివద్దనే ఉండండి, సురక్షితంగా ఉండండి అని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. అదే సమయంలో వారు తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతూనే ఆన్‌లైన్‌లో టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బిల్లులను చెల్లించాల్సిందిగానూ చెబుతున్నాం. బహుళభాషలలో మా ప్రాచుర్యం పొందిన జీఈసీ, కిడ్స్, మూవీస్, స్పోర్ట్స్ ఛానెల్స్ యొక్క చేరికపై ఆధారపడి ఈ సందేశాన్ని ఈ సంక్షోభ సమయంలో వ్యాప్తి చేస్తున్నాం” అని గుర్జీవ్ సింగ్ కపూర్, ప్రెసిడెంట్ అండ్ హెడ్- డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్, స్టార్ ఇండియా అన్నారు. ” ఈ ఆపద సమయంలో కూడా ఆన్‌గ్రౌండ్ పనిచేస్తున్న మా కేబుల్, డీటీహెచ్ భాగస్వాములకు చెందిన సాహసోపేత బృందాలను ప్రశంసిస్తున్నాము , వీక్షకుల కోసం సేవల పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు భరోసా కల్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలను అభినందిస్తున్నాము” అని అన్నారు. అలోక్ జైన్, బిజినెస్ హెడ్, స్టార్ మా నెట్‌వర్క్ మాట్లాడుతూ “బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా సెలబ్రిటీ హోమ్ వీడియోలను అద్భుతంగా మిళితం చేసి మన తెలుగు వీక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి స్టార్ మా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మా వినియోగదారుల భద్రత , ఆరోగ్యం తొలి ప్రాధాన్యత అయిన ఈ కీలక సమయంలో, మేము ప్రతి ఒక్కరినీ తమ కేబుల్/డీటీహెచ్ బిల్లులు లేదా మరేదైనా యుటిలిటీ బిల్లును ఆన్‌లైన్ విధానంలో చెల్లించమని కోరుతున్నాం. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా మరికొంత కాలం ఇళ్లలోనే ఉండాల్సిందిగానూ అభ్యర్థిస్తున్నాం. ఇది ఇంటిలోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ చెప్పేందుకు మనకోసం మా ప్రయత్నం” అని అన్నారు. స్టార్ ఇండియా తమ నెట్‌వర్క్ ఛానెల్స్‌పై వినోదపరంగా మరింత ఆసక్తిని జోడించింది. అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ షోస్ అయినటువంటి మహాభారత్ మొదలు ఎన్నో ఆసక్తికరమైన షోస్ తీసుకువచ్చింది. స్టార్ మా టీవీ వీక్షకులు ఇప్పుడు తమ అభిమాన సీరియల్స్ కార్తీక దీపం ,వదినమ్మ, గృహలక్ష్మి , మరెన్నో నాన్ ఫిక్షన్ సీరియళ్లతో పాటుగా నూతన, ఉత్సాహపూరితమైన ప్రీమియర్స్‌ను వీక్షించవచ్చు. ఈ ఛానెల్ ఇప్పుడు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సినిమాలను ప్రసారం చేస్తుండటంతో పాటుగా ప్రతి శుక్రవారం ఫ్యామిలీ మూవీస్‌ను ప్రసారం చేస్తుంది. ఈ లాక్‌డౌన్ వేళ తమ వీక్షకులతో అనుసంధానించబడటానికి కొన్ని నాన్ ఫిక్షన్ ఫార్మట్స్‌ను సైతం తీసుకువచ్చింది. వీకెండ్ బ్లాక్‌బస్టర్ షోకు కొనసాగింపుగా ఇస్మార్ట్ జర్నీ,పూర్తి సరికొత్త రూపులో బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్ వంటివి సైతం ఉన్నాయి. ఈ బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్‌లో స్టార్ మా సెలబ్రిటీలు ఇంటి పనులతో ఒకరినొకరు సవాల్ విసురుకుంటుంటారు.
స్టార్ మా మూవీస్ , స్టార్ మా గోల్డ్ సైతం కొన్ని ఆసక్తికరమైన సినీ పండుగలను సృష్టించాయి. సినీ వినోదసాగరంలో తేలియాడుతూ ఇళ్లలోనే కుటుంబాలు ఉంటాయన్న భరోసానూ ఇవి అందిస్తాయి.
స్టార్ మూవీస్ ఇప్పుడు చిన్నారులకు ఇష్టమైన చిత్రాలైనటువంటి మేరీ పాపిన్స్ రిటర్న్స్, డుంబో , నట్‌క్రాకర్, ఫోర్ రియల్మ్స్ ఆన్ ప్లేడేట్ ప్రదర్శిస్తుంది. వీటితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ మూవీ సెలక్షన్, అత్యుత్తమ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ ను యాక్షన్ ఎట్ 9తో వీక్షించవచ్చు. వీక్షకులు అత్యుత్తమ ఇంగ్లీష్ వినోదాన్ని అమెరికన్ ఐడెల్, కాఫీ విత్ కరణ్, మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాలో అత్యుత్తమ ఎపిసోడ్స్ చూడవచ్చు.కిడ్స్ నెట్‌వర్క్‌పై 100 గంటలకు పైగా తాజా కంటెంట్‌ను జోడించారు. డిస్నీ ఛానెల్ హంగామా టీవీ లపై సమ్మర్ బొనాంజాను వీరు వీక్షించవచ్చు. వీటిలో దేశీయంగా తీర్చిదిద్దిన బాపు – తెలివైన నాయకుని స్వచ్ఛమైన, సానుకూల కథ ; దీనితో పాటుగా సంతోషకరమైన సర్కస్ ట్రూప్‌లోని స్నేహితులతో కూడిన జంతువుల కథ -గుడ్డు , సృజనాత్మక గాడ్జెట్స్‌తో కూడిన సాఫ్ట్ టాయ్ – గాడ్జెట్ గురు విత్ గణేశాఆ వంటివి వీక్షించవచ్చు. చిన్నారులు వీటితో పాటుగా హగేమారు షోను సైతం వీక్షించవచ్చు. దీనిలో అల్లరి హగేమారు కథను తెలుపుతారు. వీటితో పాటుగా సెల్ఫీ విత్ భజరంగ్, డోరెమాన్, చాచా చౌదరి, మిరాక్యులస్‌లో నూతన ఎపిసోడ్స్‌ను సైతం వీక్షించవచ్చు.

error: Content is protected !!