Tue. Dec 10th, 2024


365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి14,హైదరాబాద్: భారతదేశపు అతి పెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్,మొబైల్ ఫోన్ బ్రాండ్ శామ్ సంగ్ శుభప్రదమైన సంక్రాంతి పండగ సందర్భంగా ఈరోజు తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఉత్తేజభరితమైన ఆఫర్లు 15% వరకు క్యాష్ బ్యాక్ , జీరో డౌన్ పేమెంట్ తో సులభ ఈఎంఐలతో ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీంలతో 2020 జనవరి 31 వరకు లభిస్తాయి.

ఈ ఆనందకరమైన సందర్భానికి జోడీస్తూ, ఈ ఆఫర్లు క్యూఎల్ఈడీ టీవీ, 4కే యూహెచ్ డి టీవీ మరియు కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ వంటి వినియోగదారు ఉత్పత్తుల పై ఆకర్షణీయమైన ధరలతో , గ్యారంటీ బహుమతుల్ని కూడా అందిస్తోంది మరియు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ , ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్, ఆడ్ వాష్ వాషింగ్ మెషిన్స్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్, మరియు డిజిటల్ ఇన్వెర్టర్ ఎయిర్ కండిషనర్స్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ల పై కూడా ఫైనాన్స్ ఆఫర్లని అందిస్తోంది. అదనంగా, ఆక్సిక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మరియు ఐసీఐసీఐ బ్యాండ్ డెపిట్ , క్రెడిట్ కార్డ్స్ తో 15% వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తోంది.

ఆఫర్ అమలవుతున్న సమయంలో, శామ్ సంగ్ వారి ఎంపిక చేయబడిన మోడల్స్ క్యూఎల్ఈడీ మరియు 4కే యూహెచ్ డీ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులు ఐఎన్ఆర్ 76,900 విలువ గల గాలక్సీ ఎస్ 10 (512 జీబీ) , ఐఎన్ఆర్ 19,999 విలువ గల గాలక్సీ ఏ50(4జీబీ), ఐఎన్ఆర్ 16,999 విలువ గల గాలక్సీ ఎం30 6జీబీ, ఐఎన్ఆర్ 8499 విలువ గల గాలక్సీ ఏ10ల 2జీబీ మరియు ఐఎన్ఆర్ 3,799 విలువ గల శామ్ సంగ్ యు ఫ్లెక్స్ హెడ్ ఫోన్ వంటి గ్యారంటీ బహుమతుల్ని పొందుతారు. టీవీ మోడల్స్ పై గ్యారంటీ బహుమతులతో పాటు, వినియోగదారులు జీ5 కోసం 30 రోజుల ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతే కాదు, మై శామ్ సంగ్ మై ఈఎంఐ సర్వీస్ తో ఎంపిక చేసిన టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్స్ , వాషింగ్ మెషిన్ల పై శామ్ సంగ్ తన కస్టమర్లు తమ బడ్జెట్ ప్రకారం డౌన్ పేమెంట్ , ఈఎంఐలను ఎంచుకునే సదుపాయం కల్పించింది. అలాంటి విలక్షణమైన ఆఫర్లు , గ్యారంటీ బహుమతులతో, ఈ పండగ సీజన్ లో వినియోగదారులు మెరుగైన జీవనశైలికి మారగలరు.

శామ్ సంగ్ అందించే ఫ్లెక్సి ఈఎంఐ ఆఫర్ తో కస్టమర్లు తాము కొనుగోలు చేసే స్క్రీన్ సైజ్ ఆధారంగా సరళమైన నెలవారీ ఇన్ స్టాల్మెంట్ ను 2020 జనవరి 1 నుండి 2020 జనవరి 31 మధ్య ఎంపిక చేసిన కొనుగోళ్ల పై 2 సంవత్సరాల వారంటీ (ప్యానెల్ పై 1+1 ఎక్స్ టెండెడ్ వారంటీ) , ఉచిత 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్ ఇన్ వారంటీని పొందే అవకాశం కల్పించింది. అదనంగా, ఎంపిక చేసిన కన్వెక్షన్ మైక్రోవేవ్ మోడల్స్ కొనుగోళ్ల పై వినియోగదారులు 28 లీ , అంతకు పైగా కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్లను కొనుగోలు చేసినప్పుడు ఉచిత బోరోసిల్ కిట్ ను, సెరామిక్ ఎనామిల్ కేవిటీ పై 10 సంవత్సరాల వారంటీని పొందుతారు. ఈ ఆఫర్ అమలవుతున్న సమయంలో, ఎంపిక చేయబడిన ఎయిర్ కండిషనర్ మోడల్స్ పై కూడా శామ్ సంగ్ 2 సంవత్సరాల వారంటీని కేటాయిస్తోంది. “శామ్ సంగ్ అర్థవంతమైన వినియోగదారు కేంద్రీకృత నవ్యతలను విశ్వసిస్తుంది. సులభమైన ఫైనాన్స్ స్కీంలు విలక్షణమైన ఆఫ్రలతో మా కస్టమర్ల కోసం సాటిలేని టెక్నాలజీని తీసుకురావడానికి మేము కట్టుబడ్డాం. ప్రీమియీకరణ పోకడను ప్రోత్సహిస్తూ, కొత్త ఆఫర్లు ఈ పండగ సీజన్ లో మా కస్టమర్లు తమ ఇళ్లను ప్రకాశవంతం చేసుకోవడంలో ఎటువంటి లోటును రానీయకుండా చేస్తాయని మేము విశ్వసిస్తున్నాము” అని శామ్ సంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.

శామ్ సంగ్ క్యూఎల్ఈడీ 4కే యుహెచ్ డి టెలివిజన్స్: శామ్ సంగ్ క్యూఎల్ఈడీ , 4కే యూహెచ్ డీ టీవీలు ప్రీమియం టీవీలు, హోం ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త అడుగు వేసాయి, అత్యంత ఆధునికమైన పిక్చర్ నాణ్యతతో మద్దతు చేయబడే అందమైన డిజైన్ ను అందిస్తున్నాయి. టీవీలు ప్రేక్షకులు ప్రకాశవంతమైన ,లోతైన రంగుల్ని ఆనందించే అవకాశాన్ని ఇస్తాయి. ఇవి వన్ రిమోట్ కంట్రోల్ పై కొత్త బిక్స్ బీ ప్రత్యేకతతో వాయిస్ కంట్రోల్ కూడా చేయడానికి అవకాశం ఇస్తాయి. శామ్ సంగ్ సైడ్-బై సైడ్ ,ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్: సైడ్ -బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ , ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్ భారతదేశపు వినియోగదారుల యొక్క భద్రపర్చుకునే వివిధ అవసరాలను తీరుస్తాయి. శామ్ సంగ్ రిఫ్రిజిరేటర్లు తాజాదనం, శక్తి సామర్థ్యం, సమానమైన కూలింగ్ , మన్నికల మిశ్రమం. విద్యుత్తు బిల్లులు పై ఆదాలు కేటాయించడానికి అవి పరిపూర్ణమైన పరిష్కారం, విద్యుత్తు కోతల సమయంలో కూడా నిరంతరం కూలింగ్, తాజాదనాన్ని ను కలిగి ఉంటాయి. డిజిటల్ ఇన్వెర్టర్ మోటార్స్ తో మద్దతు చేయబడిన శామ్ సంగ్ ఇకో బబుల్ ,టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్: శామ్ సంగ్ వాషింగ్ మెషిన్‌లు పని చేసే సమయంలో తక్కువ శక్తిని వినియోగిస్తాయి మరియు అతి తక్కువ శబ్దం మరియు ప్రకంపనలు కలిగిస్తాయి. శామ్‌ సంగ్ వారి ఇకో బబుల్ టెక్నాలజీ బబుల్ జనరేటర్ ను ఉపయోగించి డిటర్జెంట్ నీటిలో కరిగేలా చేస్తుంది తదుపరి గాలిని ఇంజెక్ట్ చేసి పుష్కలమైన సబ్బు నురగ కుషన్ ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని శామ్ సంగ్ వాషింగ్ మెషిన్లు శక్తివంతమైన హైజీన్ స్టీమ్ సైకిల్ తో లభిస్తున్నాయి. ఇవి దుస్తుల్ని ఉతికినప్పుడు శుభ్రం చేసే నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఆఫర్ల పై మరింత సమాచారంకోసం, https://www.samsung.com/in/offer/regional-festivals-2019/  ని చూడండి.

error: Content is protected !!