Fri. Jul 12th, 2024

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి31,హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

• హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రభుత్వానికి అందించారు. చెక్కును ముఖ్యమంత్రికి, మందులను వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజందర్ కు హెటిరో చైర్మన్ పార్థసారధి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.

Several organisations have contributed large donations to the Chief Minister’s Relief Fund

• తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్ అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ అధ్యక్షుడు కె. పాపారావు తదితరులు ముఖ్యమంత్రికి అందించారు.

• సువెన్ ఫార్మా కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి ముఖ్యమంత్రికి అందించారు.

• ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి ఎ. రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు.

• శ్రీ చైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై. శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు.

• తెలంగాణ రైస్ మిల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ నాయకులు నాగేందర్,మోహన్ రెడ్డి తదితరులు సీఎంకు అందించారు.